ఫిర్యాదు చేసిన మరునాడే రేప్ చేసి..
బికనీర్: రోజులు గడుస్తున్న కొద్ది విద్యార్థులపట్ల ఉపాధ్యాయుల తీరు ఏవగింపు తెచ్చేలా మారుతోంది. విద్యాబుద్ధులు నేర్పించి తనంతవారిగా తీర్చిదిద్దాల్సినవారు కామాంధుల్లా తయారవుతున్నారు. రాజస్థాన్ లోని బికనీర్ లో వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి కామంతో పది హేడేళ్ల విద్యార్థినిపై లైంగిక దాడి చేసి అనంతరం చంపేశాడు. హాస్టల్ దగ్గర ఉన్న నీళ్ల ట్యాంకులో ఆమె మృతదేహాన్ని పడేశాడు. కానీ, అతడు మాత్రం అలా చేయలేదని చెప్తున్నాడు.
కాలేజీ యాజమాన్యం కూడా ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని అంటోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండు రోజుల కిందటే ఆ బాలిక తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయుడు తనపై కొద్ది రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. వారు స్పందించేలోగానే అతడు శుక్రవారం మరోసారి ఆ బాలిక లైంగిక దాడిజరిపి అనంతరం హత్య చేసి హాస్టల్ దగ్గర నీటి ట్యాంకులో పడేశాడు. పూర్తి వివరాల కోసం బాలిక మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపారు.