
ప్రతీకాత్మకచిత్రం
నెల్లూరు(క్రైమ్) : రాంగ్‌కాల్ పరిచయం ఓ యువతి పాలిట శాపంగా మారింది. సేకరించిన సమాచారం మేరకు.. కావలి పట్టణానికి చెందిన ఓ యువతి బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. యువతి సెల్‌ఫోన్‌కు కొంతకాలం కిందట ఓ నంబర్ నుంచి కాల్ వచ్చింది. వెంటనే సారీ.. రాంగ్ నంబర్ అంటూ యువకుడు మాటలు కలిపాడు. వారి పరిచయం సాన్నిహిత్యానికి దారితీసింది. రెండురోజుల కిందట ఇద్దరూ నెల్లూరులో కలుసుకున్నారు.
అనంతరం ఓ లాడ్జికి వెళ్లారు. ఈ క్రమంలో యువకుడు ఆమె సెల్‌ఫోన్‌లోని వీడియోలు, ఫొటోలు చూసి ఎవరివని ప్రశ్నించాడు. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగింది. కోపోద్రిక్తుడైన యువకుడు ఆమెపై దాడిచేసి సెల్‌ఫోన్‌తో పరారయ్యాడు. దీంతో యువతి అతని కోసం గాలించింది. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత యువతి, పరారైన యువకుని ఫోన్ నంబర్ల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (నీ న్యూడ్ వీడియో, ఫొటోలను బయట పెడతా.. సీఐ వేధింపులు)
Comments
Please login to add a commentAdd a comment