చిలకలగూడ: ప్రియురాలి ఇంట్లో స్నేహితులతో కలిసి చోరీ చేసి.. చివరకు పోలీసులకు చిక్కాడో దొంగ ప్రియుడు. చిలకలగూడ పోలీసుల కథనం ప్రకారం.. పార్శిగుట్ట సంజీవపురానికి చెందిన వితంతువు ఇన్‌కమ్‌ట్యాక్స్ కార్యాలయంలో స్వీపర్. ఈమె మూడో కుమార్తె డిగ్రీ చదువుతోంది. ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గుర్తుతెలియని దుండగులు వీరింట్లో రూ.లక్ష నగదు, 8 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పోలీసుల దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టుచేశారు.
జరిగిన కథ ఇదీ..
ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం రుద్రంపూర్ గ్రామానికి చెందిన ముజీబ్ (22), శివ (23), నరేష్ (22)లు బీటెక్ పూర్తిచేసి, ఉద్యోగాన్వేషణలో నగరానికి వచ్చారు. చోరీ జరిగిన ఇంటి యజమానురాలు మూడో కుమార్తె ఫోన్‌కు వచ్చిన రాంగ్‌కాల్ ద్వారా ముజీబ్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆ యువతి ముజీబ్‌ను తన ఇంటికి పిలిచింది. పెళ్లి చేసుకుందాం.. మరి ఎలా జీవించేది అని ముజీబ్ అనడంతో ఆమె తమ ఇంట్లో ఉన్న నగలు, నగదు చూపించింది. వాటిని చూసిన ముజీబ్ తమ ఊరుకే చెందిన శివ, నరేష్‌లను కలిసి చోరీ పథకం వేశాడు.
ఈనెల ఏడో తేదీన శివ, నరేష్‌లు యువతి ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని నగలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో నగలు విక్రయించేందుకు వచ్చిన ముజీబ్,శివ, నరేష్‌లను అదుపులోకి తీసుకొని వచారించగా.. అసలు విషయం బయటపెట్టారు. రూ. లక్ష నగదు, 8 తులాల నగలు స్వాధీనం చేసుకుని ముగ్గురినీ రిమాండ్‌కు తరలించారు.
ప్రియురాలి ఇంటికే కన్నం వేశాడు
Published Fri, Jul 11 2014 9:11 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement
Advertisement