
వైభవ్ జ్యూయలరీ షోరూమ్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన వైభవ్ జ్యూయలర్స్ 9వ, జ్యూయలరీ షోరూమ్‌ను తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. వైభవ్ జ్యూయలర్స్ తెలంగాణలో తొలి షోరూమ్‌ను ప్రారంభించి, విస్తృతమైన శ్రేణిలో ఆభరణాలను అందించడం శుభపరిణామమన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలని ఆకాంక్షించారు.
ఏపీలో 8 శాఖలు...
ఆంధప్రదేశ్‌లో విశాఖపట్నం, గాజువాక, కాకినాడ, రాజమండ్రి, పార్వతీ పురం, బొబ్బిలి, అనకాపల్లి, ఏలూరులో 8 బ్రాంచీలను నిర్వహిస్తున్నట్లు వైభవ్ సంస్థ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ గ్రంధి మల్లికా మనోజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద బంగారు ఆభరణాల షోరూమ్‌గా వైభవ్ జ్యూయలర్స్ (మనోజ్ వైభవ్ జెమ్స్ అండ్ జ్యూయలర్స్ ప్రైవేట్ లిమిటెడ్) విభిన్న డిజైన్‌లలో బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు, ప్లాటినం, రత్నాలు, వెండి ఆభరణాలు.. అసంఖ్యాక శ్రేణిని ఉత్తమ ధరలలో అందిస్తున్నామన్నారు. వ్యాపార సేవలతో పాటు సామాజిక సేవలను అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వైజాగ్ పరిసరప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిసర ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటామని, రెండు నెలల్లో సౌకర్యాల కల్ప నపై దృష్టి సారిస్తామన్నారు.
ప్రారంభోత్సవ ఆఫర్ 9% నుంచి తరుగు
హైదరాబాద్‌లో వివిధ ప్రదేశాల్లో విస్తరింపదలచి వినియోగదారులకు ప్రపంచ శ్రేణి షాపింగ్ అనుభవంతో పాటు విస్తృత శ్రేణిలో 916 హాల్‌మార్క్‌డ్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ డైమండ్స్, ఫైన్ జ్యూయలరీ, 925 స్వచ్చత కలిగి 100 శాతం తిరిగి కొనుగోలు హామీ గల స్టెర్లింగ్ సిల్వర్ ఆభరణాలను అందించాలనే ఉద్దేశ్యంతో దిల్‌సుఖ్‌నగర్‌లో 9వ, జ్యూయలరీ షోరూమ్‌ను ప్రారంభిస్తున్నామని జనరల్ మేనేజర్ మార్కెటింగ్ జె. రఘునాధ్ తెలిపారు. ఈ సందర్భంగా సాధారణ బంగారు ఆభరణాలకు తరుగు 9 శాతం నుంచి అందిస్తున్నామని తెలిపారు. ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గ్రంధి అమరేంద్ర, డైరెక్టర్ కుమారి కీర్తన, చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ ఆర్. సతీష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.