దిల్‌సుఖ్‌నగర్: ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ (ఐపీజీ) తరహాలోనె తెలంగాణ పంచాయతీరాజ్ గ్రూపును ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. పార్లమెంట్ స్పీకర్ అధ్యక్షుడుగా ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ 1949లో ఏర్పాటు అయిందని, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఈ గ్రూప్‌కు ఆద్యులని తెలిపారు.
బీజేఆర్ భవన్‌లో స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు కలిసి తెలంగాణ పంచాయతీరాజ్ గ్రూప్‌ను చట్టబద్ధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. పంచాయతీరాజ్ చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులపై ఎప్పటికప్పుడు సమీక్షలు, అప్పుడప్పుడు సెమినార్లు, అంతర్‌జిల్లాల స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపి, ఆయా అంశాలను ఎంపీలు, ఎమ్మేల్యేలు, ఎమ్మేల్సీల దృష్టికి తీసుకొని రావాలన్నారు. ప్రజాప్రతినిధులు సోషల్ ఇంజనీర్లని, సమాజ నిర్మాణంలో వారి పాత్ర కీలకమని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment