రంగారెడ్డి : దిల్సుఖ్నగర్ లో 2013లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు యాసిన్ భత్కల్ను గురువారం పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జి ఎదుట గులాబీ పువ్వుతో హాజరయిన భత్కల్ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇదిలా ఉండగా రెండు రోజులుగా భత్కల్ వింతగా ప్రవర్తిస్తున్నాడని పోలీసులు పేర్కొంటున్నారు. ఉగ్రవాది భత్కల్ వింత ప్రవర్తనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.