సాక్షి, హైదరాబాద్: రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం జలమయైంది. నగరంలో ఎక్కడ చూసిన రోడ్లన్ని నీట మునిగాయి. దీంతో ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక దిల్‌షుఖ్‌నగర్‌లోని ప్రముఖ శివగంగ థియేటర్లోకి భారీగా వరద నీరు చేరడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది.
అలాగే ఈ భారీ వర్షానికి థియేటర్ పక్కన ఉన్న గోడ కూలిపోవడంతో అక్కడ పార్క్ చేసిన 40 వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే ఆ గోడను పక్కనే ఉన్న నాళ పక్కనే కట్డడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. నాళ పక్కనే గోడ కట్టడంతో అది కూలడంతో నాళ దెబ్బతిందని, దీంతో భారీగా నీరు రోడ్లపైకి, థియేటర్లోకి, ఇళ్లలోకి చేరినట్లు స్థానికులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment