
కారులో పొగలు..తప్పిన ప్రమాదం
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ పరిధిలోని రాజీవ్ చౌక్ వద్ద ఏపీ 09సీక్యూ 3294 అనే నంబర్ గల వోక్స్‌వ్యాగన్ కారు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు వెలువడ్డాయి. పొగలకు కారులో ఉన్న 70 ఏళ్ల వృద్ధుడు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై వృద్ధుడిని రక్షించడంతో ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే పొగలు వచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు.