
సాక్షి, హైదరాబాద్ : నగరంలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని.. చీకట్లు అలుముకున్నాయి. దీంతో ఆకాశం మేఘావృతమై మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, కర్మన్‌ఘాట్, ముషీరాబాద్, నారాయణగూడ, ట్యాంకుబండ్, కోఠి, ఆబిడ్స్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేటలో భారీ వర్షం కురుస్తోంది. దీనికితోడు పిడుగులు శబ్దాలు భీకరంగా వినిపిస్తుండటంతో భయాందోళనలో స్థానికులు ఉన్నారు. పాతబస్తీలోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది.