'బాహుబలి' బ్లాక్ టికెట్లు స్వాధీనం | Black marketing of Baahubali Tickets | Sakshi
Sakshi News home page

'బాహుబలి' బ్లాక్ టికెట్లు స్వాధీనం

Published Thu, Jul 9 2015 8:33 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM

'బాహుబలి' బ్లాక్ టికెట్లు స్వాధీనం

'బాహుబలి' బ్లాక్ టికెట్లు స్వాధీనం

చైతన్యపురి (హైదరాబాద్) : బాహుబలి సినిమా టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు గురువారం సాయంత్రం దిల్‌సుఖ్‌నగర్‌లోని రెండు థియేటర్లపై దాడి చేశారు.

ఇన్‌స్పెక్టర్ నర్సింగ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తపేట మహాలక్ష్మీ థియేటర్‌పై దాడి చేసి మొత్తం 1275 టికెట్లు, రూ.95,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. థియేటర్ మేనేజర్ విక్రంను చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. థియేటర్ నిర్వాహకుడు సాంబశివరావు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

అలాగే దిల్‌సుఖ్‌నగర్‌లోని మెగా థియేటర్ ఆవరణలో బ్లాక్ టికెట్‌లు అమ్ముతున్న పి.ఆంజనేయులు (37), ఎల్.కృష్ణ (30)లను అదుపులోకి తీసుకుని 66 టికెట్లు, రూ.2820 నగదును స్వాధీనం చేసుకున్నారు. థియేటర్ మేనేజర్ సత్యనారాయణగౌడ్‌తో పాటు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం సరూర్‌నగర్ పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement