పాక్ ప్రేరణతోనే హైదరాబాద్ పేలుళ్లు: సుశీల్‌కుమార్ షిండే
న్యూఢిల్లీ: ఈ ఏడాది హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) పనేనని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే వెల్లడించారు. దేశంలో ఈ ఏడాది జరిగిన మొత్తం నాలుగు పేలుళ్లకుగాను మూడింటి వెనుక ఐఎం హస్తముందని తెలిపారు. బుద్ధగయ, పాట్నా పేలుళ్లు కూడా దాని దుశ్చర్యేనన్నారు.
బెంగళూరు పేలుడు దారితప్పిన కొందరు ఛాందసవాద యువకులు, అల్-ఉమాహ్‌కు చెందినవారి పనిగా తేల్చారు. పాకిస్థాన్‌లోని ప్రతీఘాత శక్తుల నుంచి ఐఎంకు ప్రేరణ లభిస్తోందన్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) ఆధ్వర్యంలో జరుగుతున్న డీజీపీలు, ఐజీల మూడు రోజుల సదస్సును షిండే గురువారం ప్రారంభించారు. లేనిపోని సమస్యలు సృష్టించేందుకు సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఆసిఫ్ ఇబ్రహీం చెప్పారు.