‘స్వరూపానంద సరస్వతిని అరెస్ట్ చేయాలి’
Published Fri, Oct 21 2016 12:41 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM
హైదరాబాద్: షిరిడి సాయిబాబాపై అనుచిత వాఖ్యలు చేసిన శ్రీ స్వరూపానంద స్వామిని అరెస్ట్ చేయాలని కోరుతూ సాయిబాబా భక్తులు ఆందోళలనకు దిగారు. గతంలో కూడా స్వరూపానంద పలుమార్లు సాయిబాబాపై విరుచుకుపడ్డారని ఆయన పై కఠిన చర్యలు తీసుకోవాలని సాయి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయ సమీపంలో స్వరూపానంద స్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement