Swaroopanand Saraswati
-
కొండవలస ప్రాంతాల ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన
-
యాదాద్రి నిర్మాణం చిరస్థాయిగా నిలుస్తుంది : స్వరూపానందేంద్ర
-
యాత్రను అశీర్వదించాలని శ్రీవారిని కోరుకున్నా
-
ఆలయాలు ఆదాయ కేంద్రాలా?
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి హైదరాబాద్: ‘‘హిందూ దేవాలయాలు దేవాదాయ శాఖకు ఆదాయ కేంద్రాలా? భక్తులు నిధులు, కానుకలు ఇచ్చేది అధికారులు, ఉద్యోగులకు వేతనాలిచ్చి, ఏసీ కార్లలో తిప్పడానికా?’’ అని విశాఖ శారదా పీఠాధిప తి స్వరూపానందేంద్ర స్వామి ప్రశ్నించారు. భక్తులు సమర్పించిన కానుకలు, నిధులను కాపాడాల్సిన అవసరం ఉందని, దేవాదాయ శాఖ ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తోందని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్ చందానగర్‌లోని విశాఖ శారదాపీఠ పాలిత శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ సముదాయంలో విరాట్ విశ్వశాంతి మహాయజ్ఞం ముగింపు వేడుకల్లో స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇతర మతాల ప్రార్థనాలయాల్లోకి వెళ్లడానికి దమ్ములేని ప్రభుత్వాలు హిందూ దేవాలయాల్లో మాత్రం భక్తులు సమర్పించిన నిధులను భక్షిస్తున్నాయన్నారు. రాష్ట్రం, దేశం హితం కోసం ప్రభుత్వాలు యాగాలు తలపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నిధులతో అద్భుత యాగం చేశారని కొనియాడారు. ముగిసిన మహాయజ్ఞం వేడుకలు శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ సముదాయంలో నిర్వహించిన విరాట్ విశ్వశాంతి మహాయజ్ఞం వేడుకలు ఆదివారం వైభవంగా ముగిసాయి. ఉదయం 7 గంటల నుంచి సంకల్పం, విశ్వక్సేన పూజ, నవగ్రహ, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర, లక్ష్మీనారాయణ, మహాసుదర్శన, ఛండీ, చతుషష్టి యోగిని దేవతా విరాట్ వేంకటేశ్వర మండపారాధన హోమాలు నిర్వహించారు. స్వరూపానందేంద్ర స్వామి పూర్ణాహుతి, హరిహరులు కల్యాణోత్సవం నిర్వహించారు. కాగా, ఈ సందర్భంగా స్వామీజీ.. విశాఖ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతిగా, బాలస్వామిగా కిరణ్‌కుమార్ శర్మ పేరును ప్రకటించారు. -
కశ్మీర్‌ను కాపాడుకోవాలి
సాక్షి,హైదరాబాద్: ‘ఆకలిగొన్న వారి ఆకలి తీర్చేదే హిందుత్వం. ప్రతి ప్రాణిలో పరమాత్మను చూసుకొనేవాడే హిందువు’ అని పశ్చిమామ్నాయ ద్వారకా శారదా పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య స్వరూపానంద సరస్వతీ మహాస్వామి చెప్పారు. దేశంలో ఉండేవారందరూ హిందువులు కారన్నారు. భారత్‌ను పట్టి పీడిస్తున్న ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి దేశమంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ‘భారత్ అమ్మలాంటిది. అందులో కశ్మీర్ ముఖం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అన్నారు. ఆదివారం నాంపల్లి లలిత కళాతోరణంలో జరిగిన దర్శనమ్ ఆధ్యాత్మిక మాస పత్రిక పుష్కరోత్సవంలో ఆయన ప్రసంగించారు. జీహాదీ ముసుగులో ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటున్నారన్నారు. మహిళలను దేవతలుగా పూజించే దేశంలో ప్రస్తుతం వారిపై అత్యాచారాలు, ఆరాచకాలు పెరిగాయన్నారు. ఇందుకు పురుషులు మత్తు మందులకు బానిసలవ్వడమే కారణమన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో భగవద్గీత, రామాయణం, భారతం బోధించాల్సిన అవసరం ఉందన్నారు. సాయి మనిషి రూపమే... ‘సాయి పేరుతో గాయత్రీ మంత్రి అర్థం మార్చేశారు. సీతారాం బదులు సాయిరాం తీసుకువచ్చారు. సాయి భూమిపై పుట్టినవారే. అవతార మూర్తి కాదు. షిర్డీ వేదికగా సాయిని దేవుడని రుజువు చేయండని షిర్డీ సంస్థాన్నే కోరాం. రెండు నెలలు గడువిచ్చినా వారు చూపలేకపోయారు. ఆంధ్రా, తెలంగాణాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని వందలాది గుళ్లల్లో ఒక్కటి కూడా సాయి ఆలయం లేదు. సాయిని దేవుడిగా కొలిచేవారు దీన్ని గుర్తించాలి. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సాయి పూజ సుద్ధ తప్పు. ఇవన్నీ పోవాలంటే సుదర్శన చక్ర పూజ అవసరం. గోహత్యలు ఆపాలి’ అని స్వామి వ్యాఖ్యానించారు. దీంతో సభలోని సాయి భక్తులు స్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వీరిని బయటకు పంపించారు. అనంతరం తెలంగాణ అభివృద్ధి చెందాలని కోరుతూ స్వామికి పాద పూజ నిర్వహించారు. పుష్పగిరి పీఠాధిపతి నృసింహ భారతిస్వామి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
నాంపల్లిలో స్వరూపానంద.. భారీ భద్రత!
హైదరాబాద్: షిరిడీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్వరూపానంద సరస్వతి ఆదివారం సాయంత్రం నగరానికి రావడంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ద్వారకా శారద పీఠం అధిపతి అయిన స్వరూపానంద సరస్వతి నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని లలిత కళాతోరణంలో గురువందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయిబాబాపై వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. ‘షిరిడీ సాయిబాబా ఓ ముస్లిం తెగకు చెందినవారు. ఆయన్ను వ్యక్తిగతంగా ఆరాధిస్తూ చాలా మంది హిందువులు తప్పు చేస్తున్నారు. ఆయన చిత్రపటాలను పూజ గదిలో ఉంచుకోవద్ద’ని స్వరూపానంద సరస్వతి గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన వ్యాఖ్యలను సాయిబాబా భక్తులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆయనను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
‘స్వరూపానంద సరస్వతిని అరెస్ట్ చేయాలి’
హైదరాబాద్: షిరిడి సాయిబాబాపై అనుచిత వాఖ్యలు చేసిన శ్రీ స్వరూపానంద స్వామిని అరెస్ట్ చేయాలని కోరుతూ సాయిబాబా భక్తులు ఆందోళలనకు దిగారు. గతంలో కూడా స్వరూపానంద పలుమార్లు సాయిబాబాపై విరుచుకుపడ్డారని ఆయన పై కఠిన చర్యలు తీసుకోవాలని సాయి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు నగరంలోని దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయ సమీపంలో స్వరూపానంద స్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. -
బాబా చిత్ర పటాలు పూజ గదిలో ఉంచుకోవద్దు
స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యలు అనంతపురం కల్చరల్: ‘షిరిడీ సాయిబాబా ఓ ముస్లిం తెగకు చెందినవారు. ఆయన్ను వ్యక్తిగతంగా ఆరాధిస్తూ చాలా మంది హిందువులు తప్పు చేస్తున్నారు. ఆయన చిత్రపటాలను పూజ గదిలో ఉంచుకోవద్ద’ని ద్వారకా శారద పీఠం అధిపతి శంకరాచార్య స్వరూపానంద సరస్వతి సూచించారు. శనివారం అనంతపుర వచ్చిన ఆయన భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా షిరిడీ సాయిని ఆరాధించడాన్ని వ్యతిరేకించడంతో పాటు ఆయన్ను పూజించబోమని, హిందూ ధర్మంతోనే ఉంటామని భక్తులతో ప్రమాణం చేయించారు. దీన్ని బాబా భక్తులు వ్యతిరేకించడంతో వివాదానికి దారితీసింది. దీంతో పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. -
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
-
ముహుర్తబలం లేకే ఇబ్బందులు
తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ముహుర్త బలం లేదని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి అన్నారు. అందుకే ఆయన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గురువారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం స్వరూపానంద సరస్వతి ఆలయం వెలుపల విలేకర్లతో మాట్లాడారు. శ్రీవారి ఆలయంపై విమానాలు తిరగడం దేశానికి అరిష్టమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేతగానితనం వల్లే అలాంటి వాటిపై స్పష్టమైన చర్యలు తీసుకోలేక పోతుందని స్వరూపానంద సరస్వతి స్పష్టం చేశారు. ఇటీవల తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంపై విమానం వెళ్లిన సంగతి తెలిసిందే. ఆగమ శాస్త్రం ప్రకారం... ఆలయంపై విమానాల విహారం నిషేధం. అంతేకాకుండా తిరుమల దేవాలయం నో ఫ్లయింగ్ జోన్ పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు స్వరూపానంద సరస్వతిపై విధంగా స్పందించారు. -
'షిర్డిసాయి' రక్షణ కోసం సుప్రీం కోర్టుకు!
ఢిల్లీ: షిర్డిసాయి విగ్రహాల రక్షణ కోసం సాయిధామ్ చారిటబుల్ ట్రస్ట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సాయిధామ్ చారిటబుల్ ట్రస్ట్ మహారాష్ట్రలోని అన్ని దేవాలయాలతోసహా సాయి ఆలయ వ్యవహారాలు చూస్తోంది. షిర్డిసాయికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిరోధించాలంటూ ఈ ట్రస్ట్ దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసింది. ద్వారక శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యలను ట్రస్ట్ కోర్టు దృష్టికి తీసుకు వెళ్లింది. దేశంలో ఏ దేవాలయంలో కూడా షిర్డి సాయి విగ్రహాలు తొలగించకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని ట్రస్ట్ కోరింది. స్వరూపానంద సరస్వతి ఏమన్నారు? షిర్డీ సాయిబాబా దేవుడు కాదని, మనిషిని దేవుడిగా పూజించవద్దని స్వరూపనంద సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా షిర్డీసాయి బాబాకు ఆలయాలు కట్టడం సరికాదని సెలవిచ్చారు. పనిలో పనిగా హిందువులను విభజించేందుకే అంతర్జాతీయ శక్తులు బాబాను సీన్లోకి తెచ్చాయన్నారు. అల్లాను కొలుస్తూ మాంసం తినే సాయి బాబా హిందూ దేవుడు ఎలా అవుతారని స్వరూపానంద సరస్వతి అన్నారు. సాయి భక్తులు సనాతన దేవుళ్ల బొమ్మలతో సొమ్ము చేసుకున్నారని విమర్శించారు. వాళ్లు మన దేవుడి బొమ్మలు ఉపయోగించకపోతే వాళ్లకు ఎవరూ ఏమీ ఇవ్వరని చెప్పారు. ప్రజలకు ఎవరిని కావాలంటే వారిని కొలుచుకునే హక్కు, స్వేచ్ఛ ఉన్నాయని, అయితే సాయిబాబా తనను తాను దేవుడిగా చెప్పుకొనే ప్రయత్నం చేయడం మాత్రం తమకు ఆమోదయోగ్యం కాదని స్వరూపానంద పేర్కొన్నారు. నాగా సాధువులు కూడా శంకరాచార్యకు మద్ధతుగా నిలిచారు. శంకరాచార్యను ఎవరైనా అవమానిస్తే తాము వీధుల్లో నిరసనకు దిగుతామని హెచ్చరించారు. ఈ అంశాన్ని వారు ఆధ్యాత్మిక యుద్ధంగా కూడా చెప్పారు. ** -
చేయిచేసుకున్న స్వరూపానంద!
వివాదాలు కొనితెచ్చుకోవడంలో రాజకీయ నాయకులతో బాబాలు పోటీ పడుతున్నారు. దురుసు ప్రవర్తనలో నేతాశ్రీలకు తామేమి తీసిపోమని రుజువు చేస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణగా నిలిచారు ద్వారక శంకరాచార్య స్వరూపానంద సరస్వతి. తాను సాధువునన్న సంగతి మర్చిపోయి విలేకరిపై చేయి చేసుకున్నారు. పెద్దరికాన్ని పక్కనపెట్టి పాత్రికేయుడిపై ప్రతాపం చూపారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గురించి ఓ విలేకరి ప్రశ్న సంధించడం స్వరూపానందకు ఆగ్రహం తెప్పించింది. రాజకీయాల గురించి అడగొద్దని చెప్పినా వినకుండా విలేకరి ప్రశ్నించడంతో అతడిపై ఆయన చేయి చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని జబర్పూర్లో జరిగిన ఈ ఘటన దృశ్యాలు జాతీయ చానళ్ల ప్రసారం కావడంతో స్వరూపానంద వివరణయిచ్చారు. పాత్రికేయుడిపై కావాలని చేయి చేసుకోలేదని, పొరపాటున తన చేయి అతడికి తగిలిందని తెలిపారు. అయితే ఇదంతా కాషాయ పార్టీ కుట్ర అని స్వరూపానంద ప్రతినిధి ఆరోపించారు. బీజేపీ ఇదంతా చేయించిందని అన్నారు. స్వామిజీని ప్రశ్నించిన విలేకరి మద్యం సేవించి ఉన్నాడని, స్వరూపానందను సమీపించి ఆయనను తోసివేసేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. స్వరూపానందను రెచ్చగొట్టేందుకే అతడు అలా ప్రవర్తించాడని అన్నారు. దీని వెనుక బీజేపీ మాజీ మంత్రి హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. స్వరూపానంద విలేకరిపై చేయిచేసుకోవడం పట్ల మధ్యప్రదేశ్ బీజేపీ మీడియా సెల్ అధ్యక్షుడు హితేష్ వాజపేయి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విలేకరి వెనుక ఎవరో ఉండి ఇదంతా చేయించారని కాంగ్రెస్ ఆరోపించింది. స్వరూపానంద సరస్వతి గతంలోనూ వార్తల్లో నిలిచారు. మోడీని విమర్శించిన బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో కలిసి విరాట్ రామాయణ్ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి స్వరూపానంద సరస్వతి తన 'చేతి వాటం'తో మరోసారి పతాక శీర్షికలకు ఎక్కారు.