నాంపల్లిలో స్వరూపానంద.. భారీ భద్రత!
హైదరాబాద్: షిరిడీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్వరూపానంద సరస్వతి ఆదివారం సాయంత్రం నగరానికి రావడంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ద్వారకా శారద పీఠం అధిపతి అయిన స్వరూపానంద సరస్వతి నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని లలిత కళాతోరణంలో గురువందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయిబాబాపై వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు.
‘షిరిడీ సాయిబాబా ఓ ముస్లిం తెగకు చెందినవారు. ఆయన్ను వ్యక్తిగతంగా ఆరాధిస్తూ చాలా మంది హిందువులు తప్పు చేస్తున్నారు. ఆయన చిత్రపటాలను పూజ గదిలో ఉంచుకోవద్ద’ని స్వరూపానంద సరస్వతి గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన వ్యాఖ్యలను సాయిబాబా భక్తులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆయనను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.