సాక్షి, సిటీబ్యూరో : దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లు జరిగిన కొద్దిసేపటికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ రీజనల్ సెంటర్‌కు ఘటనాస్థలిలో బలగాల మోహరింపుపై ఓ ఫోన్‌కాల్ వచ్చింది. ఆర్మీకి చెందిన ఉన్నతాధికారి చేసినట్లు భ్రమింపజేసిన ఈ కాల్ వాస్తవానికి చేసింది ఉగ్రవాద సంస్థ లష్కరేతొయిబాగా తర్వాత నిర్ధారణైంది.
తిరువనంతపురం కేంద్రంగా పనిచేసే కోస్ట్‌గార్డ్ ఈ ఏడాది జూన్‌లో సదరన్ నావెల్ కమాండ్‌కు ఓ అలర్ట్ మెసేజ్ ఇచ్చింది. నేవీకి చెందిన ఉన్నతాధికారులమాదిరి పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ముష్కరులు ఫోన్ చేసి కీలక సమాచారం సంగ్రహించే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలన్నది ఆ హెచ్చరిక సారాంశం. ఇంటర్‌నెట్‌లో విరివిగా లభిస్తున్న కాల్ స్ఫూఫింగ్ సాఫ్ట్‌వేర్ వల్లే ఇలాంటివి సాధ్యం. ఇప్పటివరకు శత్రుదేశాల
నిఘా సంస్థలు, ఉగ్రవాదులకు మాత్రమే పరిమితమై ఉన్న ఈ టెక్నాలజీని ఇప్పుడు మోసగాళ్లు కూడా వినియోగించేస్తున్నారు. కేవలం కాల్ స్ఫూఫింగ్ మాత్రమే కాకుండా మెయిల్ స్ఫూఫింగ్‌కూ పాల్పడుతూ ఉద్యోగాల పేరుతో ఎర వేస్తున్నారు. నిరుద్యోగుల్ని బురిడీ కొట్టించి అందినకాడికి దండుకుంటున్నారు. దీనిపై పక్కా ఆధారాలు సేకరించిన హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు నిందితుల కోసం గాలిస్తూ లోతుగా కూపీ లాగుతున్నారు.
క్లోనింగ్‌ను తలదన్నుతూ...
ఒకప్పుడు సిమ్‌కార్డుల్ని క్లోనింగ్ చేసేవారు. అంటే మీ సిమ్‌కార్డును పోలినదాన్ని మరోటి సృష్టించి వినియోగించడం. దీనిద్వారా చేసే ఫోన్ కాల్స్ అన్నీ మీ నెంబర్ నుంచే వెళ్తాయి. ఇలా చేయడానికి కచ్చితంగా సిమ్‌కార్డుకు సంబంధించిన ఇంటర్నేషనల్ మొబైల్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ (ఐఎంఎస్‌ఈ) నెంబర్ తెలిసి ఉండటం తప్పనిసరి. దీన్ని తెలుసుకోవడం అందరికీ సాధ్యం కాదు. అయినప్పటికీ అనేక సందర్భాల్లో సిమ్‌కార్డు క్లోనింగ్స్ చోటు చేసుకున్నాయి. ఈ విధానాన్ని తలదన్నేదిగా ఇంటర్‌నెట్‌లో అందుబాటులోకి వచ్చిందే స్ఫూఫింగ్. గతంలో కేవలం ఫోన్ కాల్స్‌కు మాత్రమే పరిమితమై ఉన్న ఈ విధానం ఇప్పుడు ఈ-మెయిల్స్‌కు సైతం విస్తరించింది. ఏకంగా ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్‌నూ స్ఫూఫ్ చేయగలుగుతున్నారు. కొన్నేళ్ల క్రితం సరదా కోసం సాఫ్ట్ మేధావులు* రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్ ఇప్పుడు ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులతో పాటు మోసగాళ్లుకు సైతం వరంగా మారింది.
స్ఫూఫింగ్ చేస్తారిలా...
నిర్ణీత రుసుం తీసుకుని స్ఫూఫింగ్ సాఫ్ట్‌వేర్, సదుపాయాన్ని అందించే వెబ్‌సైట్లు ఇంటర్‌నెట్‌లో అనేకం ఉన్నాయి. వాస్తవానికి ఇది ఇంటర్‌నెట్ ద్వారా చేసే కాల్. దీనిలోకి ఎంటర్ అయిన తరవాత సదరు వ్యక్తి ఫోన్ నెంబర్‌తో పాటు ఫోన్‌కాల్‌ను అందుకోవాల్సిన వ్యక్తిది, ఫోన్ రిసీవ్ చేసుకునేప్పుడు అతని సెల్‌ఫోన్‌లో ఎవరి నెంబర్ డిస్‌ప్లే కావాలో అది కూడా పొందుపరుస్తారు. ఇదే రకంగా ఈ-మెయిల్ ఐడీ స్ఫూఫింగ్ వెబ్‌సైట్లలో మెయిల్ ఐడీలను రిజిస్టర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఓ వ్యక్తి ప్రముఖ కంపెనీ నుంచి కాల్ చేసినట్లు, ఈ-మెయిల్ పంపినట్లు మరో వ్యక్తిని బుట్టలో వేసుకునే అవకాశం ఉంటుంది.
బ్యాక్ డోర్ అనడంతో బుట్టలో...
ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగార్థులు నేరుగా సదరు కంపెనీని సంప్రదిస్తే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది. అయితే మోసగాళ్లు వీరికి ముందే తమకు ఆయా సంస్థల్లో ఉన్న పెద్ద మనుషులతో సంబంధాలు ఉన్నాయని, వాటి ద్వారానే బ్యాక్‌డోర్ ఎంట్రీలుగా ఈ ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని చెప్పి ముందరికాళ్లకు బంధాలు వేస్తారు. దీంతో ఉద్యోగార్థులు నేరుగా ఆయా కార్యాలయాలకు వెళ్లి వివరాలు సేకరించే, సమాచారం సరిచూసుకునే ధైర్యం చేయట్లేదు. ఇదే మోసగాళ్లకు అన్ని సందర్భాల్లోనూ కలిసి వస్తోంది. ఈ తరహాలో కాల్, మెయిల్ స్ఫూఫింగ్ ద్వారా ఘరానా మోసాలకు పాల్పడి నిరుద్యోగుల్ని ముంచిన వ్యవహారంపై సీసీఎస్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో డీసీపీ జి.పాలరాజు ఆదేశాల మేరకు ఓ ప్రత్యేక బృందం ఈ వ్యవహారంలో బాధ్యుల్ని గుర్తించడానికి లోతుగా ఆరా తీస్తూ సాంకేతికంగా దర్యాప్తు చేస్తోంది.
టోకరా వేస్తున్నారిలా...
స్ఫూఫింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఎడాపెడా విని యోగించేస్తున్న మోసగాళ్లు నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో టోకరా వేస్తున్నారు. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ ముందు ప్రకట నలు జారీ చేయడం ద్వారా నిరుద్యోగుల్ని ఆకర్షిస్తున్నారు. వారి నుంచి బయోడేటా త దితరాలు సేకరించిన తరవాత ఫోన్ ఇంట ర్వ్యూ దగ్గర అసలు కథ మొదలవుతోంది. సదరు కంపెనీకి చెందిన ఫోన్ నెంబర్‌కు స్ఫూఫింగ్ చేయడం ద్వారా వారే కాల్ చేసినట్లు సృష్టిస్తున్నారు.
ఉద్యోగార్థి అనుమా నం వచ్చి ఆ ఫోన్ నెంబర్ ఎవరిదని ఆరా తీసినా ప్రముఖ కంపెనీకి చెందినదిగానే తేలుతుంది. ఆపై అదే కంపెనీకి చెందిన మెయిల్ ఐడీ, ఐపీ అడ్రస్‌ను స్ఫూఫ్ చేస్తు న్న మోసగాళ్లు వాటి ద్వారా అపాయింట్‌మెంట్ ఆర్డర్, ఆఫర్ లెటర్ వంటివి పంపిస్తున్నారు. వీటిని రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఎంత పరిశీలించినా ప్రముఖ కంపెనీ నుం చి వచ్చినట్లే ఉంటుంది. దీంతో ఆ నిరుద్యోగి ఉద్యోగం వచ్చిందని భావించి మోసగాడు చెప్పిన బ్యాంక్ ఖాతాలో అడిగినంత జమ చేస్తున్నారు. ఇవి కూడా బోగస్ వివరాలతో కూడినవి కావడంతో వీటి ద్వారానూ మోసగాళ్లను పట్టుకునే అవకాశం లేదు.
నయ వంచన
Published Wed, Nov 20 2013 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM
Advertisement
Advertisement