Lashkar Taiba
-
కశ్మీర్లో ఆరుగురు ఉగ్రవాదుల కాల్చివేత
శ్రీనగర్: కశ్మీర్లో లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనంతనాగ్ జిల్లాలోని బెజ్బెహారాలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు కమాండర్లు సహా ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక్కడి వగహామా సుక్తిపొరాలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కినట్లు పక్కా సమాచారం అందడంతో ఆర్మీ ఆపరేషన్ ప్రారంభించింది. భద్రతాబలగాలు అనుమానిత ఇంటిని చుట్టుముట్టగానే ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్కౌంటర్లో చనిపోయినవారిని అనంతనాగ్ జిల్లా లష్కరే కమాండర్ ఆజాద్ అహ్మద్ మాలిక్, జిల్లా హిజ్బుల్ కమాండర్ ఉనైస్ షఫీ, బాసిత్ ఇష్తియాక్, అతిఫ్ నాజర్, ఫిర్దౌస్ అహ్మద్, షహీద్ బషీర్‌గా గుర్తించారు. ఈ ఏడాది జూన్ 14న రైజింగ్ కశ్మీర్ పత్రిక ఎడిటర్ షూజాత్ బుఖారిని ఉగ్రవాదులు హత్యచేసిన ఘటనలో ఆజాద్ సూత్రధారి. -
పాక్‌పై మరోసారి అమెరికా ఆగ్రహం
వాషింగ్టన్ / ఇస్లామాబాద్ / ఐరాస: లష్కరే తోయిబా వంటి ఉగ్రసంస్థలకు స్వర్గధామంగా మారిన పాక్‌పై అమెరికా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రమూకలకు సాయం చేయడం ఆపకపోతే పాక్ చాలా కోల్పోవాల్సి వస్తుందంటూ అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ హెచ్చరించారు. ఉగ్రస్థావరాలపై పాక్ వైఖరిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునేందుకు అకస్మిక పర్యటనలో భాగంగా పెన్స్ గురువారం అఫ్గానిస్తాన్ చేరుకున్నారు. అఫ్గాన్ అధ్యక్షుడు ఘనీ, ప్రధాని అబ్దుల్లాలతో సమావేశమయ్యారు. తర్వాత బగ్రామ్ ఎయిర్‌బేస్‌లో అమెరికా సైనికులతో మాట్లాడారు.‘అధ్యక్షుడు ట్రంప్ చెప్పిందే నేనూ చెబుతున్నా. అమెరికాతో భాగస్వామ్యం వల్ల పాక్ చాలా లబ్ధి పొందు తోంది. ఉగ్రవాదులు, నేరస్తులకు ఆశ్రయమివ్వడం వల్ల పాక్ చాలా కోల్పోవాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వారిని వెతికి హతమార్చేందుకు అమెరికన్ బలగాలకు ట్రంప్ పూర్తిస్వేచ్ఛ ఇచ్చినట్లు పెన్స్ వెల్లడించారు. మరోవైపు పెన్స్ వ్యాఖ్యల్ని పాక్ ఖండించింది. -
కశ్మీర్లో ఆరుగురు ఉగ్రవాదుల హతం
-
ఆరుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: కశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో శనివారం భద్రతా బలగాలు ముంబై ఉగ్రదాడుల సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లక్వీ మేనల్లుడు ఒవైద్ సహా పాక్‌కు చెందిన ఆరుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల్ని హతమార్చాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన ఓ ‘గరుడ్’ కమాండో ప్రాణాలు కోల్పోగా, మరో జవాన్ గాయపడ్డారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న నిఘావర్గాల సమాచారంతో రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్, కశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్‌వోజీ), రాష్ట్ర పోలీసుల సంయుక్త బృందం చందర్‌గీర్ గ్రామాన్ని చుట్టుముట్టింది. గాలింపు సమయంలో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఈ విషయమై కశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ స్పందిస్తూ..‘ భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో లక్వీ మేనల్లుడు ఒవైద్, లష్కరే కమాండర్లు జర్గమ్, మెహమూద్‌లతో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. వీరందరూ పాక్ నుంచి ప్రవేశించారు. ఘటనాస్థలి నుంచి ఆరు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం’ అని ట్వీటర్లో తెలిపారు. ఈ ఏడాది కశ్మీర్లో ఇప్పటివరకు 170 మంది ఉగ్రవాదుల్ని ఏరివేసినట్లు చెప్పారు. ఈ ఏడాది నవంబర్ 2న పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, ఓ సీఆర్పీఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 6 తేదీన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు చంపేశాయి. -
లష్కరే కమాండర్ హతం
శ్రీనగర్: గతేడాది దక్షిణ కశ్మీర్లో చెలరేగిన అల్లర్లకు ప్రధాన కారకుడిగా భావిస్తున్న లష్కరే తోయిబా టాప్ కమాండర్ వసీమ్ షా(23)ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లాలో శనివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో షాతో పాటు అతని అనుచరుడు కూడా హతమయ్యాడు. ఉగ్రవాదులకు స్వర్గధామంగా పరిగణించే లిట్టర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్లలో ఇక్కడ ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్ జరగడం ఇదే తొలిసారి. కొద్దిరోజులుగా షా కదలికలపై నిఘా ఉంచిన జమ్మూ కశ్మీర్ పోలీసులు... లిట్టర్ స్థావరంలో అతడు ఉన్నాడన్న సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ బృందంతో కలసి సోదాలు ప్రారంభించారు. అనుచరుడు నిసార్ అహ్మద్ మీర్‌తో కలసి తప్పించుకోవడానికి షా చేసిన ప్రయత్నం విఫలమైంది. తమ ఉచ్చులో చిక్కుకున్న వారిద్దరిని భద్రతా బలగాలు హతమార్చాయి. షోఫియాన్ జిల్లాలోని హెఫ్–శ్రీమాల్కు చెందిన వసీమ్ షా అలియాస్ అబు ఒసామా భాయ్ 2014లో లష్కరేలో చేరాడు. పండ్ల వ్యాపారి కుటుంబంలో జన్మించిన అతడు కాలేజ్ డ్రాపౌట్. పాఠశాల రోజుల నుంచే లష్కరేకు మద్దతుగా నిలిచాడు. -
ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం
పుల్వామా: కశ్మీర్లో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లాలో గురువారం వేకువ జామున ముగిసిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ఆ సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. అనంతరం చెలరేగిన అల్లర్లలో ఓ పౌరుడు చనిపోయాడు. భద్రతా బలగాలపై రాళ్లు రువ్వుతున్న గుంపును అతడు ముందుండి నడిపిస్తున్నాడని పోలీసులు తెలిపారు. కాకాపురా ప్రాంతంలోని ఓ ఇంట్లో ఎల్ఈటీ కీలక కమాండర్ మజీద్ మీర్ సహా ముగ్గురు ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారన్న సమాచారం అందడంతో పోలీసులు బుధవారం సాయంత్రమే అక్కడ కార్డన్ సెర్చ్ ప్రారంభించారు. రాత్రి 10 గంటల నుంచి గురువారం ఉదయం 4 గంటల దాకా ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు దాక్కున్న ఇంటికి మంటలు అంటుకున్న తరువాత, తప్పించుకోవడానికి వారు బయటికి పరుగులు పెట్టారు. లొంగిపొమ్మని పోలీసులు సూచించినా మాట వినకపోవడంతో వారిని కాల్చి చంపారు. -
ముందస్తు నిర్బంధంలో లఖ్వీ
-
ముందస్తు నిర్బంధంలో లఖ్వీ
మూడు నెలల పాటు జైలులోనే లఖ్వీకి బెయిల్‌పై భారత్ నిరసనతో పాక్ నిర్ణయం కరడుగట్టిన ఉగ్రవాదికి బెయిల్ ఇవ్వడం షాక్‌కు గురిచేసిందన్న మోదీ పాక్ తీరును గర్హిస్తూ పార్లమెంట్ ఏకగ్రీవ తీర్మానం న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి జకీఉర్ రెహ్మాన్ లఖ్వీ బెయిల్‌పై జైలు నుంచి బయటకురాకుండా పాకిస్తాన్ ప్రభుత్వం అడ్డుకుంది. ముందస్తు నిర్బంధ చట్టం కింద అతన్ని మూడు నెలలపాటు నిర్బంధించింది. నిషేదిత ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా ఆపరేషన్స్ కమాండర్ లఖ్వీకి పాక్ కోర్టు బెయిల్ ఇవ్వడంపై భారత్ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవడం, పెషావర్ సైనిక స్కూలులో నరమేధంతో అంతర్జాతీయ మీడియా దృష్టి సారించిన దృష్ట్యా పక్ ఈ చర్య చేపట్టింది. ప్రస్తుతం రావల్పిండి అడియాలా జైలులో ఉన్న లఖ్వీ శుక్రవారం ఉదయం బెయిల్‌పై విడుదలకావాల్సి ఉంది. అయితే అంతకుముందే పాక్ అధికారులు స్పందించారు. ప్రజా భద్రత నిర్వహణ(ఎంపీవో) చట్టం నిబంధనలను ప్రయోగించి, లఖ్వీ జైలు నుంచి బయటకురాకుండా ఉత్తర్వులిచ్చారు. జైలు అధికారులకు సంబంధిత ఉత్తర్వుల కాపీని అందించారు. ఈ విషయాన్ని భారత్‌కూ తెలియజేశారు. అలాగే ఉగ్రవాద వ్యతిరేక కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయాలని పాక్ నిర్ణయించింది. సోమవారం కోర్టులో పిటిషన్ వేయనుంది. పెషావర్‌లో 148 మంది స్కూలు పిల్లలను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపిన నేపథ్యంలో లఖ్వీని విడుదల చేస్తే అంతర్జాతీయంగా పాక్‌కు చెడ్డపేరు వస్తుందని షరీఫ్ అభిప్రాయపడినట్లు సమాచారం. దీనిపై భారత్ నుంచీ ఒత్తిడి వస్తుందని, లఖ్వీని ఎలాగైనా నిర్బంధంలోనే ఉంచాలని ప్రధాని ఆదేశించినట్లు వెల్లడించాయి. మరోవైపు ముంబై దాడుల కేసులో మరో 15 మంది సాక్షులను విచారించకుండానే లఖ్వీకి కోర్టు బెయిల్ ఇవ్వడంపై న్యాయవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. బెయిల్‌ను రద్దు చేయండి: భారత్ లఖ్వీ బెయిల్ రద్దయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని పాక్‌ను భారత్ గట్టిగా కోరింది. లఖ్వీకి బెయిల్ ఇవ్వడంపై పార్లమెంట్ శుక్రవారం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పాక్ కోర్టు నిర్ణయాన్ని లోక్‌సభలో అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. ముంబై దాడి ముష్కరులకు శిక్ష పడేలా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నాయి. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. లఖ్వీకి బెయిల్ రావడం షాక్‌కు గురి చేసిందన్నారు. పాక్ పిల్లల ఊచకోతపై బాధతో బరువెక్కిన గుండెలు ఇంకా తేలికపడకముందే ఈ నిర్ణయం వెలువడటం దారుణమన్నారు. దీనిపై భారత అభ్యంతరాలను పాక్‌కు గట్టిగా చెప్పామని, పార్లమెంట్ వ్యక్తం చేసిన అభిప్రాయాల మేరకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంద పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరులో పాక్‌కు చిత్తశుద్ధి లేదని లఖ్వీ బెయిల్తె రుజువవుతోందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. బెయిల్‌ను ఉపసంహరించుకోవాలనిడిమాండ్ చేశారు. ముంబై దాడుల బాధ్యులకు శిక్ష పడేలా చూడాల్సిన బాధ్యత పాక్‌దేనని వ్యాఖ్యానించారు. పాక్‌లో 67 మంది మిలిటెంట్ల హతం పాకిస్థాన్‌లోని ఉత్తర వజీరిస్థాన్‌లో శుక్రవారం ఆ దేశ భద్రతా బలగాలు మిలిటెంట్ల స్థావరాలపై భారీ ఎత్తున జరిపిన దాడిల్లో 67 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఫజ్లుల్లాపై ద్రోన్ దాడులకు పాక్ నిర్ణయం పెషావర్‌లో నరమేధం సృష్టించిన తాలిబాన్ మిలిటెంట్లతో ఫోన్ సంభాషణలు సాగించిన తెహ్రీక్ ఎ తాలిబాన్ చీఫ్ ముల్లా ఫజ్లుల్లాపై ద్రోన్ దాడులు జరపాలని పాక్ సైన్యంతోపాటు అఫ్ఘాన్‌లోని సంకీర్ణ దళాలు నిర్ణయించాయి. -
నయ వంచన
సాక్షి, సిటీబ్యూరో : దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లు జరిగిన కొద్దిసేపటికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ రీజనల్ సెంటర్‌కు ఘటనాస్థలిలో బలగాల మోహరింపుపై ఓ ఫోన్‌కాల్ వచ్చింది. ఆర్మీకి చెందిన ఉన్నతాధికారి చేసినట్లు భ్రమింపజేసిన ఈ కాల్ వాస్తవానికి చేసింది ఉగ్రవాద సంస్థ లష్కరేతొయిబాగా తర్వాత నిర్ధారణైంది. తిరువనంతపురం కేంద్రంగా పనిచేసే కోస్ట్‌గార్డ్ ఈ ఏడాది జూన్‌లో సదరన్ నావెల్ కమాండ్‌కు ఓ అలర్ట్ మెసేజ్ ఇచ్చింది. నేవీకి చెందిన ఉన్నతాధికారులమాదిరి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ముష్కరులు ఫోన్ చేసి కీలక సమాచారం సంగ్రహించే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలన్నది ఆ హెచ్చరిక సారాంశం. ఇంటర్నెట్లో విరివిగా లభిస్తున్న కాల్ స్ఫూఫింగ్ సాఫ్ట్వేర్ వల్లే ఇలాంటివి సాధ్యం. ఇప్పటివరకు శత్రుదేశాల నిఘా సంస్థలు, ఉగ్రవాదులకు మాత్రమే పరిమితమై ఉన్న ఈ టెక్నాలజీని ఇప్పుడు మోసగాళ్లు కూడా వినియోగించేస్తున్నారు. కేవలం కాల్ స్ఫూఫింగ్ మాత్రమే కాకుండా మెయిల్ స్ఫూఫింగ్కూ పాల్పడుతూ ఉద్యోగాల పేరుతో ఎర వేస్తున్నారు. నిరుద్యోగుల్ని బురిడీ కొట్టించి అందినకాడికి దండుకుంటున్నారు. దీనిపై పక్కా ఆధారాలు సేకరించిన హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు నిందితుల కోసం గాలిస్తూ లోతుగా కూపీ లాగుతున్నారు. క్లోనింగ్‌ను తలదన్నుతూ... ఒకప్పుడు సిమ్‌కార్డుల్ని క్లోనింగ్ చేసేవారు. అంటే మీ సిమ్‌కార్డును పోలినదాన్ని మరోటి సృష్టించి వినియోగించడం. దీనిద్వారా చేసే ఫోన్ కాల్స్ అన్నీ మీ నెంబర్ నుంచే వెళ్తాయి. ఇలా చేయడానికి కచ్చితంగా సిమ్‌కార్డుకు సంబంధించిన ఇంటర్నేషనల్ మొబైల్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ (ఐఎంఎస్‌ఈ) నెంబర్ తెలిసి ఉండటం తప్పనిసరి. దీన్ని తెలుసుకోవడం అందరికీ సాధ్యం కాదు. అయినప్పటికీ అనేక సందర్భాల్లో సిమ్‌కార్డు క్లోనింగ్స్ చోటు చేసుకున్నాయి. ఈ విధానాన్ని తలదన్నేదిగా ఇంటర్నెట్లో అందుబాటులోకి వచ్చిందే స్ఫూఫింగ్. గతంలో కేవలం ఫోన్ కాల్స్‌కు మాత్రమే పరిమితమై ఉన్న ఈ విధానం ఇప్పుడు ఈ-మెయిల్స్‌కు సైతం విస్తరించింది. ఏకంగా ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్‌నూ స్ఫూఫ్ చేయగలుగుతున్నారు. కొన్నేళ్ల క్రితం సరదా కోసం సాఫ్ట్ మేధావులు* రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులతో పాటు మోసగాళ్లుకు సైతం వరంగా మారింది. స్ఫూఫింగ్ చేస్తారిలా... నిర్ణీత రుసుం తీసుకుని స్ఫూఫింగ్ సాఫ్ట్వేర్, సదుపాయాన్ని అందించే వెబ్సైట్లు ఇంటర్నెట్లో అనేకం ఉన్నాయి. వాస్తవానికి ఇది ఇంటర్నెట్ ద్వారా చేసే కాల్. దీనిలోకి ఎంటర్ అయిన తరవాత సదరు వ్యక్తి ఫోన్ నెంబర్‌తో పాటు ఫోన్‌కాల్‌ను అందుకోవాల్సిన వ్యక్తిది, ఫోన్ రిసీవ్ చేసుకునేప్పుడు అతని సెల్ఫోన్లో ఎవరి నెంబర్ డిస్ప్లే కావాలో అది కూడా పొందుపరుస్తారు. ఇదే రకంగా ఈ-మెయిల్ ఐడీ స్ఫూఫింగ్ వెబ్సైట్లలో మెయిల్ ఐడీలను రిజిస్టర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఓ వ్యక్తి ప్రముఖ కంపెనీ నుంచి కాల్ చేసినట్లు, ఈ-మెయిల్ పంపినట్లు మరో వ్యక్తిని బుట్టలో వేసుకునే అవకాశం ఉంటుంది. బ్యాక్ డోర్ అనడంతో బుట్టలో... ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగార్థులు నేరుగా సదరు కంపెనీని సంప్రదిస్తే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది. అయితే మోసగాళ్లు వీరికి ముందే తమకు ఆయా సంస్థల్లో ఉన్న పెద్ద మనుషులతో సంబంధాలు ఉన్నాయని, వాటి ద్వారానే బ్యాక్‌డోర్ ఎంట్రీలుగా ఈ ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని చెప్పి ముందరికాళ్లకు బంధాలు వేస్తారు. దీంతో ఉద్యోగార్థులు నేరుగా ఆయా కార్యాలయాలకు వెళ్లి వివరాలు సేకరించే, సమాచారం సరిచూసుకునే ధైర్యం చేయట్లేదు. ఇదే మోసగాళ్లకు అన్ని సందర్భాల్లోనూ కలిసి వస్తోంది. ఈ తరహాలో కాల్, మెయిల్ స్ఫూఫింగ్ ద్వారా ఘరానా మోసాలకు పాల్పడి నిరుద్యోగుల్ని ముంచిన వ్యవహారంపై సీసీఎస్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో డీసీపీ జి.పాలరాజు ఆదేశాల మేరకు ఓ ప్రత్యేక బృందం ఈ వ్యవహారంలో బాధ్యుల్ని గుర్తించడానికి లోతుగా ఆరా తీస్తూ సాంకేతికంగా దర్యాప్తు చేస్తోంది. టోకరా వేస్తున్నారిలా... స్ఫూఫింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఎడాపెడా విని యోగించేస్తున్న మోసగాళ్లు నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో టోకరా వేస్తున్నారు. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ ముందు ప్రకట నలు జారీ చేయడం ద్వారా నిరుద్యోగుల్ని ఆకర్షిస్తున్నారు. వారి నుంచి బయోడేటా త దితరాలు సేకరించిన తరవాత ఫోన్ ఇంట ర్వ్యూ దగ్గర అసలు కథ మొదలవుతోంది. సదరు కంపెనీకి చెందిన ఫోన్ నెంబర్‌కు స్ఫూఫింగ్ చేయడం ద్వారా వారే కాల్ చేసినట్లు సృష్టిస్తున్నారు. ఉద్యోగార్థి అనుమా నం వచ్చి ఆ ఫోన్ నెంబర్ ఎవరిదని ఆరా తీసినా ప్రముఖ కంపెనీకి చెందినదిగానే తేలుతుంది. ఆపై అదే కంపెనీకి చెందిన మెయిల్ ఐడీ, ఐపీ అడ్రస్‌ను స్ఫూఫ్ చేస్తు న్న మోసగాళ్లు వాటి ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్, ఆఫర్ లెటర్ వంటివి పంపిస్తున్నారు. వీటిని రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఎంత పరిశీలించినా ప్రముఖ కంపెనీ నుం చి వచ్చినట్లే ఉంటుంది. దీంతో ఆ నిరుద్యోగి ఉద్యోగం వచ్చిందని భావించి మోసగాడు చెప్పిన బ్యాంక్ ఖాతాలో అడిగినంత జమ చేస్తున్నారు. ఇవి కూడా బోగస్ వివరాలతో కూడినవి కావడంతో వీటి ద్వారానూ మోసగాళ్లను పట్టుకునే అవకాశం లేదు.