కశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో శనివారం భద్రతా బలగాలు ముంబై ఉగ్రదాడుల సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లక్వీ మేనల్లుడు ఒవైద్ సహా పాక్‌కు చెందిన ఆరుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల్ని హతమార్చాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన ఓ ‘గరుడ్’ కమాండో ప్రాణాలు కోల్పోగా, మరో జవాన్ గాయపడ్డారు.