దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులు తరచూ దాడులకు తెగబడుతున్నారు. జమ్మూకశ్మీర్‌లోని దోడాలో గల ఆర్మీ పోస్ట్‌పై మంగళవారం అర్థరాత్రి ఉగ్రవాదులు దాడి చేశారు. ప్రస్తుతం ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.
ఈ కాల్పుల్లో ఇద్దరు జవానులు గాయపడినట్లు సమాచారం. దీనికి ముందు కథువా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే మరో దాడి జరిగింది. మూడు రోజుల క్రితం ప్రయాణికులతో వెళుతున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ సమయంలో ఆ బస్సు లోయలో పడిపోయింది. అప్పుడు జరిగిన ఉగ్ర దాడిలో తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందగా, 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రస్తుతం ఉగ్రవాదులను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
కథువా జిల్లాలోని చత్రగల ప్రాంతంలో నాలుగు రైఫిల్స్, పోలీసుల సంయుక్త పోస్ట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆనంద్ జైన్ మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment