పాక్‌ సైన్యం ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందిలా.. బయటపడిన ఫొటోలు | Pakistani Army Giving Training to Terrorists, Sets Up Camp In Kotli Area Of PoK | Sakshi
Sakshi News home page

పాక్‌ సైన్యం ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందిలా.. బయటపడిన ఫొటోలు

Published Thu, Jul 18 2024 11:50 AM | Last Updated on Thu, Jul 18 2024 2:02 PM

Pakistani Army Giving Training to Terrorists

జమ్ముకశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా  వరుసగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఈ ఉగ్రవాద దాడుల్లో కొందరు భారత ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. అదే సమయంలో ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. తాజగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలలో పాక్‌ దుశ్చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ స్వయంగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందని ఈ చిత్రాలను చూస్తే తెలుస్తోంది.

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి ప్రాంతంలో పాక్ సైన్యం క్యాంపును ఏర్పాటు చేసి, అక్కడి యువతకు ఆయుధాలను వినియోగించడంలో శిక్షణ ఇస్తోందని తెలుస్తోంది. పాకిస్తాన్ సైన్యం ఇక్కడి యువకులను ఉగ్రవాదులుగా మార్చేందుకు శిబిరాలను ఏర్పాటు చేస్తోంది.  ఇందుకోసం  శిక్షణ పొందిన మాజీ ఆర్మీ లేదా కమాండోల సహాయం తీసుకుంటోందని సమాచారం.

జమ్ముకశ్మీర్‌లోని దోడాలో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు, భారత సైన్యానికి మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు భారత సైన్యానికి చెందిన నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. తాజాగా పాఠశాలలో ఉన్న ఆర్మీ బృందంపై ఉగ్రవాదులు గ్రెనేడ్‌తో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement