base
-
ఆర్మీ పోస్ట్‌పై ఉగ్ర దాడి.. మూడు రోజుల్లో మూడో ఘటన
దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులు తరచూ దాడులకు తెగబడుతున్నారు. జమ్మూకశ్మీర్‌లోని దోడాలో గల ఆర్మీ పోస్ట్‌పై మంగళవారం అర్థరాత్రి ఉగ్రవాదులు దాడి చేశారు. ప్రస్తుతం ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.ఈ కాల్పుల్లో ఇద్దరు జవానులు గాయపడినట్లు సమాచారం. దీనికి ముందు కథువా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే మరో దాడి జరిగింది. మూడు రోజుల క్రితం ప్రయాణికులతో వెళుతున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ సమయంలో ఆ బస్సు లోయలో పడిపోయింది. అప్పుడు జరిగిన ఉగ్ర దాడిలో తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందగా, 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రస్తుతం ఉగ్రవాదులను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.కథువా జిల్లాలోని చత్రగల ప్రాంతంలో నాలుగు రైఫిల్స్, పోలీసుల సంయుక్త పోస్ట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆనంద్ జైన్ మీడియాకు తెలిపారు. -
పాక్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్(టీటీపీ) సంస్థతో పాక్ ప్రభుత్వం చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం కిందటి ఏడాది ముగిసింది. అప్పటి నుంచి దేశంలో ఉగ్రవాదం మళ్లీ ఊపందుకుంది. తాజాగా శనివారం పంజాబ్ ప్రావిన్స్‌లోని మియన్వాలిలో గల వైమానిక స్థావరంపై శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు దాడి చేశారు. అయితే సైన్యం అప్రమత్తం కావడంతో పెను విధ్వంసం తప్పింది. శనివారం ఫైటర్ జెట్లు ఉన్న స్థావరంలోకి ఐదు నుంచి ఆరుగురు సాయుధ ఉగ్రవాదులు తెల్లవారుజామున చొరబాటుకు యత్నించారని పాక్ ఎయిర్ ఫోర్స్ (పీఏఎఫ్) ధ్రువీకరించింది. తాము అప్రమత్తమై ఆ దాడిని భగ్నం చేశామని పేర్కొంది. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని, ఒక పాక్ సైనికుడు వీరమరణం పొందారని.. పలువురికి గాయాలయ్యాయని ప్రకటించుకుంది. ఈ ఘటనలో ఎయిర్‌బేస్‌లోని మూడు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని వెల్లడించింది. దాడికి గల కారణాలు తెలియ రావాల్సి ఉంది. అయితే.. ఇది బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(BLA) పనేనని ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. బీఎల్ఏ.. పాక్ నుంచి స్వాతంత్రం కోరుతూ 2004 నుంచి పోరాడుతోంది. సాధారణ పౌరులనే కాకుండా.. ఈ ఏడాది జూన్‌లోనూ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని తొలిసారిగా దాడికి పాల్పడింది. ఇదిలా ఉంటే.. శుక్రవారం కూడా పాక్‌లో ఉగ్రదాడి జరిగింది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో పోలీసు గస్తీ బృందాలే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు బాంబులతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా వీరిలో ఇద్దరు పోలీసులు. మరో 24 మంది గాయాలపాలయ్యారని ఓ అధికారి తెలిపారు. ఇదిలాఉంటే.. గత ఆరునెలలుగా పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రాంతాలు తీవ్ర ఉగ్రవాద దాడులను చవిచూస్తున్నాయి. అయితే ఈ దాడులు పాక్ భద్రతకు ముప్పుగా మారడమే కాదు.. పొరుగు దేశాలతో సంబంధాలను దెబ్బ తీస్తున్నాయి. తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌లను ప్రోత్సహిస్తూ పాక్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. కానీ, ఆ విమర్శలను తోసిపుచ్చుతున్న పాక్.. తాము ఉగ్ర పీడిత దేశమేనని చెప్పుకుంటోంది. మరోవైపు అంతర్జాతీయ సమాజం, ఉగ్రవాదాన్ని అణచివేసే చర్యలు చేపట్టాలంటూ పాక్‌ను కోరుతున్నాయి. -
కస్టమర్లకు షాకిచ్చిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్! సెప్టెంబర్ 21 నుంచే..
ప్రముఖ ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్ (Karur Vysya Bank) తమ కస్టమర్లకు షాకిచ్చింది. బేస్ రేటు, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును పెంచినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా ప్రకటించింది. మార్పులు సెప్టెంబర్ 21 నుంచి అమలులోకి వస్తాయి. కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రస్తుతం ఉన్న బేస్ రేటును 11.20 శాతం నుంచి 11.40 శాతానికి పెంచింది. అలాగే బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (BPLR )ను 16.20 శాతం నుంచి 16.40 శాతానికి పెంచింది. దీంతో రుణ గ్రహీతలపై వడ్డీ భారం మరింత పెరగనుంది. అలాగే ఈఎంఐలపైనా దీని ప్రభావం పడనుంది. ఉద్యోగులకు 1,63,635 ఈక్విటీ షేర్లు ఇక కరూర్ వైశ్యా బ్యాంక్ జూలైలో KVB ESOS 2011 స్కీమ్, KVB ESOS 2018 పథకం కింద ఉద్యోగులకు 1,63,635 ఈక్విటీ షేర్లను స్టాక్ ఆప్షన్‌గా కేటాయించినట్లు ప్రకటించింది. ఒక్కొక్క ఈక్విటీ షేర్ల ముఖ విలువ రూ.2 ఉంటుంది. కాగా శుక్రవారం (సెప్టెంబర్15) వారాంతంలో కరూర్ వైశ్యా బ్యాంక్ షేర్లు 1.84 శాతం లాభంతో రూ.132.75 వద్ద ముగిశాయి. (Ganesh Chaturthi: రైల్లో వినాయక చవితి పిండి వంటలు! ఆర్డర్ చేయండి.. ఆస్వాదించండి..) -
బంగారం వెండి, వంటనూనెల బేస్ దిగుమతి రేటు తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: వంటనూనెలు, బంగారం, వెండి బేస్ దిగుమతి రేట్లపై సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీటి బేస్ దిగుమతి ధరలను తగ్గిస్తూ బుధవారం ఆలస్యంగా నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త రేట్లు నేటి నుంచే (జూన్16) అమలులోకి వచ్చాయి. ఎడిబుల్ ఆయిల్స్, గోల్డ్, సిల్వర్ బేస్ దిగుమతి ధరలను ప్రతీ 15 రోజులకు ఒకసారి సవరిస్తూ ఉంటుంది. వీటి ఆధారంగా దిగుమతిదారులు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. క్రూడ్ పామ్ ఆయిల్, సోయా ఆయిల్, గోల్డ్, సిల్వర్ పై దిగుమతి సుంకాన్ని కోత పెట్టింది. మరోవైపు ఇతర వాటి బేస్ దిగుమతి ధరలు మాత్రం పెరిగాయి ముఖ్యంగా క్రూడ్ పామోలిన్, ఆర్బీడీ పామోలిన్, ఇతర పామోలిన్, బ్రాస్ స్క్రాప్ ధరలు మాత్రం పెరిగాయి. క్రూడ్ పామ్ ఆయిల్ బేస్ దిగుమతి ధర 1625 డాలర్ల నుంచి 1620 డాలర్లకు తగ్గింది. క్రూడ్ సోయా బీన్ ఆయిల్ రేటు 1866 డాలర్ల నుంచి 1831 డాలర్లకు తగ్గింది. గోల్డ్ బేస్ దిగుమతి ధర 597 డాలర్ల నుంచి 585 డాలర్లకు దిగి వచ్చింది. సిల్వర్ బేస్ దిగుమతి ధర 721 డాలర్ల నుంచి 695 డాలర్లకు తగ్గింది. మరోవైపు ఆర్బీడీ పామ్ ఆయిల్ రేటు 1733 డాలర్ల నుంచి 1757 డాలర్లకు పెరిగింది. ఇతర పామ్ ఆయిల్ బేస్ దిగుమతి రేటు 1679 డాలర్ల నుంచి 1689 డాలర్లకు ఎగసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతిదారు ఇండియా గత నెలలో 2 మిలియన్ టన్నుల సోయాయిల్‌ను సుంకం రహిత దిగుమతులకు అనుమతించింది. 2 మిలియన్ టన్నుల సోయా ఆయిల్ దిగుమతికి ఇది వర్తిస్తుంది. వెండి, బంగారం మినహా బేస్ ధరలు ప్రతి కమోడిటీకి టన్నుకు డాలర్ చొప్పున ఉంటుంది. గోల్డ్ టారిఫ్ 10 గ్రాములకు ఒక డాలర్, అలాగే వెండికి కేజీకి డాలర్‌గా ఉంటుంది. కాగా దేశంలో గురువారం బంగారం ధరలు క్షీణించాయి. పది గ్రాముల పసిడి రూ. 270 పడిపోగా, కిలో వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. -
‘బేస్’ మాయలో ఏప్రిల్ మౌలిక రంగం
న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్‌పై ఏప్రిల్‌లో పూర్తి ‘లో బేస్ ఎఫెక్ట్’ పడింది. ఏకంగా 56.1 శాతం పురోగతి నమోదయ్యింది. వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వశాఖ సోమవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పు ను ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020 ఏప్రిల్‌ను తీసుకుంటే, ఎనిమిది రంగాల గ్రూప్‌లో కరోనా కష్టాలతో అసలు వృద్ధిలేకపోగా 37.9% క్షీణత నమోదయ్యింది. సమీక్షా కాలంలో కీలక రంగాలను వేర్వేరుగా సమీక్షిస్తే... ► సహజ వాయువు: 19.9 శాతం క్షీణత నుంచి 25 శాతం పురోగతికి మారింది. ► రిఫైనరీ ప్రొడక్టులు: 24.2 శాతం క్షీణ రేటు నుంచి 30.9 శాతం వృద్ధికి చేరింది. ► స్టీల్: 82.8 శాతం మైనస్ నుంచి 400 శాతం వృద్ధికి హైజంప్ చేసింది. ► సిమెంట్: 85.2 శాతం క్షీణ రేటు నుంచి 548.8 శాతం పురోగమించింది ► విద్యుత్: 22.9 శాతం నష్టం నుంచి 38.7 శాతం వృద్ధితో యూటర్న్ తీసుకుంది. ► బొగ్గు: 9.5 శాతం పురోగమించింది. ► ఎరువులు: స్వల్పంగా 1.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► క్రూడ్ ఆయిల్: క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి ఏప్రిల్‌లోనూ దిగజారింది. 2.1% క్షీణతనే నమోదుచేసుకుంది. అయితే 2020 ఏప్రిల్ నాటి మైనస్ 6.4% క్షీణత రేటు కొంత తగ్గడం కొంత ఊరట. ఐఐపీ 150% పెరిగే చాన్స్! మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది పారిశ్రామిక రంగాల వెయిటేజ్ 40.27 శాతం. ఏప్రిల్ ఐఐపీ గణాంకాలు మరో రెండు వారాల్లో వెలువడే అవకాశం ఉంది. భారీ బేస్ ఎఫెక్ట్ వల్ల ఐఐపీ పెరుగుదలసైతం 130 నుంచి 150 శాతం వరకూ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ -
తల్లి మాటతో.. కోట్లు సంపాదించాడు
టోక్యో: కరోనా వైరస్ విజృంభణతో ఎందరో ఉపాధి కోల్పోయారు. పట్టణాల్లో పని దొరకక చాలామంది స్వగ్రామాలకు చేరుకున్నారు. కానీ కొందరు ఔత్సాహికులు మాత్రమే కోవిడ్ కాలంలోనూ తమ వ్యాపారాన్ని విస్తరించుకున్నారు. ఈ కోవకు చెందిన వాడే జపాన్‌కు చెందిన యుటా సురుయోకా. కరోనా కాలంలో చాలామంది వ్యాపారాలు తలకిందులైతే.. యుటా మాత్రం దూసుకుపోయాడు. అయితే తాను వ్యాపారం ప్రారంభించడానికి కారణం తన తల్లే అంటాడు యుటా. ఆమె చేసిన వ్యాఖ్యలు తనలో ఆలోచన రగిలించాయని.. ఈ క్రమంలో స్థాపించిన కంపెనీ నేడు మహావృక్షమయ్యింది అంటున్నాడు యుటా. క్రౌడ్ ఫండింగ్ స్టార్టప్‌లో ఇంటర్న్‌గా ఉన్న సమయంలో యుటా తల్లి చిన్న దుకాణం నడుపుకునేది. ఈ క్రమంలో ఓ రోజు ఆమె తనకు కూడా ఆన్లైన్ స్టోర్ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడింది. కానీ తనకు అది సాధ్యం కాదని నిరాశ వ్యక్తం చేసింది. తల్లి మాటలు యుటాలో ఆలోచనలు రేపాయి. గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణదారులకు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఇంటర్నెట్ షాపులను సృష్టించడానికి సహాయపడే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా అతను 2012 లో తన సొంత సంస్థ ‘బేస్ ఇంక్‌ను’ స్థాపించాడు. గత ఏడాది స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసిన నాటి నుంచి యుటా కంపెనీ షేర్ల విలువ ఆరు రెట్లు పెరిగింది. అయితే అక్టోబర్‌లో గరిష్ట స్థాయి నుంచి బాగా పడిపోయినప్పటికీ పెద్దగా నష్టం వాటిల్లలేదు. (చదవండి: ‘ట్విట్టర్ కిల్లర్’.. పర్మిషన్ తీసుకుని చంపాడు) ప్రస్తుతం యుటా కంపెనీ షేర్ల మార్కెట్ విలువ సుమారు 7 1.7 బిలియన్లకు పెరగడమే కాక అతడిని మల్టీమిలియనీర్‌గా చేసింది. ఒక హాబీగా స్టార్ట్ చేసిన ఈ కంపెనీ ప్రస్తుతం మల్టీమిలయన్ డాలర్ల విలువ చేస్తోంది. ఈ కంపెనీ ప్రధానంగా ఏం చేస్తుంది అంటే చిన్న చిన్న వ్యాపారులు చేసుకునే వారికి సొంతంగా ఆన్లైన్ షాప్‌ని క్రియేట్ చేసుకునేందుకు సాయం చేస్తుంది. పేమెంట్ ప్రాసెసింగ్‌కు అవసరమైన టూల్స్‌ని అందిస్తుంది. హోల్సెల్లర్లకు మాత్రమే కాక రిటైలర్లకు కూడా ఈ సేవలను అందిస్తుండటం.. యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్‌ఫామ్ కావడంతో అనతి కాలంలోనే ఈ యుటా బేస్ కంపెనీ ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించగలిగింది. ఇక బేస్ నిర్వహిస్తోన్న ఆన్లైన్ యాప్‌లో ప్రస్తుతం 7 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారంటే ఎంత బాగా రన్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక వెబ్సైట్ క్రియేట్ చేసినందుకు గాను టేస్ యూజర్ల దగ్గర నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయదు. కానీ అది ప్రొవైడ్ చేసే పేమెంట్ టూల్స్ నుంచి జనరేట్ అయ్యే రెవెన్యూలో వాటా తీసుకుంటుంది. (చదవండి: కోవిడ్ ఎఫెక్ట్... ఆరోగ్య బీమా జోరు!) ఇక యుటా ఓ కాలేజీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుతుండగా.. ఓ క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్‌ప్‌లో ఇంటర్న్‌షిప్ మొదలు పెట్టాడు. ఆ సమయంలో పేపాల్ వంటివి మంచి విజయం సాధించాయి. దాంతో యుటాకి దీని మీద ఆసక్తి ఏర్పడింది. అయితే సొంతంగా తానే ఓ బిజినేస్ చేస్తానని యుటా ఎప్పుడు అనుకోలేదు. తల్లి మాటలతో ఓ హాబీగా బేస్‌ని స్థాపించినప్పటికి అది కస్టమర్లను బాగా ఆకర్షించింది. ఇక కరోనా యుటాకి బాగా కలసి వచ్చింది. గతేడాది ఆగస్టు నాటికి బేస్ స్టోర్‌లో 8 లక్షల కంపెనీలు ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి వాటి సంఖ్య 1.2మిలియన్లకు పెరిగింది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ కారణంతో అన్లైన్ వ్యాపారాలకు గిరాకీ బాగా పెరిగింది. దాంతో చాలా మంది రిటైలర్స్ బేస్‌లో ఆన్లైన్ స్టోర్లు క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇంత విజయం సాధించినప్పటికి యుటా ఏ మాత్రం పొంగిపోలేదు. తాను ఇప్పుడే వ్యాపారా ప్రపంచంలోకి అడుగుపెట్టానని... నేర్చుకోవాల్సింది చాలా ఉందంటాడు -
పేకాట స్థావరంపై దాడి..ఎనిమిది మంది అరెస్ట్
హైదరాబాద్ : మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వినాయక హిల్స్ కాలనీలో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. గుట్టు చప్పుడు కాకుండా ఓ ఇంటిలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.50 వేల నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లింగాలపల్లిలో బేస్ !
వెయ్యిమందికి పైగా సీఆర్పీఎఫ్ బలగాలు దుమ్ముగూడెం సరిహద్దులోనూ మరో బేస్‌క్యాంప్? పైడిగూడెంను సందర్శించిన సీఆర్పీఎఫ్ ఐజీ దుమ్ముగూడెం : తెలంగాణ సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కుంట బ్లాక్ పరిధిలోని మారాయిగూడెం అటవీ ప్రాంతం లింగాలపల్లి గ్రామ సమీపంలో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నారు. రెండురోజులుగా ఈ క్యాంప్ పనుల్లో యంత్రాంగం తలమునకలైంది. ఇప్పటికే ఈ ప్రాంతానికి వెయ్యి మందికి పైగా ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి. దుమ్ముగూడెం మండలంలోని సరిహద్దు గ్రామాల్లోనూ ఒక బేస్ క్యాంప్ ఏర్పాటుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనికి ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదని సమాచారం. లింగాలపల్లిలో బేస్‌క్యాంప్ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో మావోల ప్రభావం తగ్గుతుందని పోలీసుల ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ధర్మపేట, ఎలకనగూడెం, కిష్టారంలో బేస్ క్యాంప్‌లు చేశారు. ఆ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోల ప్రభావం తగ్గించారు. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడానికి మారాయిగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని వంకమడుగు, కొత్తూరు, గంగిలేరులతో పాటు కిష్టారం పోలీస్‌స్టేషన్ సరిహద్దు గ్రామాలైన రాయిగూడెం, బట్టిగూడెం తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా కమిటీతో పాటు కిష్టారం , గొల్లపల్లి ఏరియా కార్యదర్శులు తమ బలగాలతో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారని వినికిడి. ఆ ప్రభావాన్ని పూర్తిస్థాయిలో నిరోధించడానికి లింగాలపల్లిలో బేస్‌క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ బేస్ క్యాంప్ ఏర్పాటుతో సీజీ మారాయిగూడెంతో పాటు దుమ్ముగూడెం మండల సరిహద్దున ఉన్న కొత్తూరు, కమలాపురం, ఎర్రబోరు, అడవిరామవరం ,కొమ్మనాపల్లి తదితర గ్రామాలలోకి మావోలు ప్రవేశించే అవకాశాలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఇప్పటికే లింగాలపల్లికి చేరుకున్న పోలీస్ బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా జల్లెడ పడుతున్నాయి. బేస్‌క్యాంప్ నిర్మాణ సామగ్రిని తరలించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. పైడిగూడెంను సందర్శించిన సీఆర్పీఎఫ్ ఐజీ మండలంలోని గౌరారం, పైడిగూడెం అటవీ ప్రాంతాన్ని సీఆర్పీఎఫ్ ఐజి సదానంద్, ఇతర పోలీస్ అధికారులు సోమవారం సందర్శించారు. రక్షణ నిమిత్తం పోలీసులు ఆ ప్రాంతానికి భారీగా తరలివెళ్లారు. భద్రాచలం హెలీకాప్టర్‌లో వచ్చిన ఆయన వాహనంలో దుమ్ముగూడెం చేరుకున్నారు. అక్కడి నుంచి స్థానిక పోలీస్ అధికారుల బందోబస్తుతో పైడిగూడెం అటవీ ప్రాంతానికి తరలివెళ్లారు. అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని ధర్మపేట బేస్‌క్యాంప్‌నకు వెళ్లారని ప్రచారం సాగుతున్నా పోలీసులు ధ్రువీకరించడం లేదు. దుమ్ముగూడెం మండలం సరిహద్దు గ్రామం పైడిగూడెంలో బేస్‌క్యాంప్ ఏర్పాటుకు స్థలం పరిశీలించేందుకు వెళ్లినట్లు సమాచారం. -
యాక్సిస్ బేస్ రేటు స్వల్పంగా తగ్గింపు
న్యూఢిల్లీ: కనీస రుణ రేటు (బేస్)ను ప్రైవేటు రంగం మూడవ దిగ్గజ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ స్వల్పంగా 10 బేసిస్ పాయింట్లు (100 బేస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఈ రేటు 9.35 శాతానికి తగ్గింది. జూలై 27వ తేదీ నుంచీ ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. తాజా ఫండ్స్ సమీకరణ ఆధారిత రుణ రేటు (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత- ఎంసీఎల్ఆర్)ను కూడా బ్యాంక్ వివిధ మెచ్యూరిటీలపై ఐదు నుంచి 10 బేసిస్ పాయింట్ల శ్రేణిలో తగ్గించింది. కాగా బుధవారం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో బ్యాంక్ షేర్ ధర 1.67% (రూ.9.45) తగ్గి రూ.556 వద్ద ముగిసింది. -
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
బీబిగూడెం(చివ్వెంల) : పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఏఎస్ఐ రౌతు రామచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బీబిగూడెం గ్రామ శివారులోని ఓ మామిడి తొటలో పేకాట ఆడుతున్న ఆత్మకూర్(ఎస్) మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన కొండేటి బుచ్చిరెడ్డి, మల్లోజు వెంకన్న, బొప్పారం గ్రామానికి చెందిన పగడాల క్రిష్ణారెడ్డి, ఏపూర్ గ్రామానికి చెందిన తొండల నారాయణ, సూర్యాపేట మండలం చింతల చెరువు గ్రామానికి చెందిన కాటోజు జనార్ధనాచారి, చివ్వెంల మండల కేంద్రానికి చెందిన శిగ లచ్చయ్యలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.12,700 నగదు, మూడు బైక్‌లు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
టూకీగా ప్రపంచ చరిత్ర -108
వేకువ క్షత్రియ వర్ణ ప్రవేశంతో నగరపాలికులకు పునాది ఏర్పడింది. ఒక ప్రధాన పట్టణం, దాని చుట్టుపక్కలున్న వ్యవసాయ గ్రామాలూ ఆ రాజ్యాల ఎల్లలు. ఆ పరిధిలోని భూమి సర్వస్వానికీ యజమాని రాజు. రైతులు కౌలుదార్లు మాత్రమే. మెచ్చినవారికి ఆ పొలంలో కొంతమేర రాజు దానంగా ఇవ్వవచ్చు. అలాంటి సందర్భాల్లో కౌలుదారునికి యజమాని మారుతాడు. ఆటవిక తెగలమీద క్షత్రియుల పెత్తనం ఉండేది గాదని పురాణగాథల ద్వారా తెలుస్తూంది. మహాభారతంలోని అరణ్యపర్వం ఆధారంగా, అడవులేవీ రాజులు ఏలుబడిలో ఉండేవిగాదని స్పష్టంగా అర్థమౌతుంది. పాలన ఏర్పడింది మొదలు క్షత్రియుల నడవడిక బ్రాహ్మణవర్గం కనుసన్నల్లో సాగింది. ఐతే, నిరంతరం ఈ ఆధిపత్యం సజావుగా సాగలేదని సూచించే వృత్తాంతాలు పురాణాల్లోనే కనిపిస్తాయి. అసురులను పక్కనబెడితే, మానవుల్లో బ్రాహ్మణుల పెత్తనాన్ని మొదటిసారిగా ధిక్కరించిన క్షత్రియుడు కార్తవ్యార్జునుడు. అందుకు గుణపాఠంగా, అతనితో పాటు క్షత్రియ వంశాన్నే నాశనం చేసినవాడు పరశురాముడు. రెండవ తిరుగుబాటుకు కారకుడు వేణచక్రవర్తి. బ్రాహ్మణుల ప్రోత్సాహంతో అతని కుమారుడైన పృథు తండ్రిని హత్యజేసి షట్చక్రవర్తుల్లో స్థానం సంపాదించుకున్నాడు. క్రీ.పూ.10వ శతాబ్ద కాలంలో ఆర్యావర్తం రాజ్యాలు తొలిదశ నైలు నాగరికతలో ఏర్పడిన చిన్న చిన్న ఏలుబడుల వంటివి. అక్కడిలాగే ఇక్కడ కూడా ఇరుగుపొరుగు రాజ్యాల పురోహితులతో లాలూచీపడి క్రమంగా విస్తరించడం మొదలెట్టాయి. యుద్ధాలకు అవసరమైన గుర్రాలనూ, ఆయుధాలనూ పర్షియన్ల నుండి కొనుగోలు చేసేందుకు నేటి పెషావర్ (సంస్కృత సాహిత్యంలోని పురుష పురం) వాణిజ్య కూడలిగానూ, దాని సమీపంలోని ‘తక్షశిల’ ఆర్యావర్తం, పారసీకం, మెసొపొటేమియా, ఈజిప్టులకు సాంస్కృతిక కేంద్రంగా ఏర్పడింది. ఉత్తరావర్తంలో అనేకచోట్ల ముడిఖనిజం నిక్షేపాలు దొరకడంతో, లోహ పరిశ్రమలో స్థానిక నైపుణ్యం విరివిగా ప్రవేశించింది. ఇలాంటి వాతావరణంలో, క్రీ.పూ. 6 శతాబ్దంలో కయ్యాలతోనూ, వియ్యాలతోనూ పరిధులు విస్తరించుకుంటూ సామ్రాజ్యంగా ఏర్పడిన మగధకు బింబిసారుడు (క్రీ.పూ.543-491) చక్రవర్తి. ‘రాజగృహ’ పట్టణం అతని రాజధాని. అదే సమయంలో పశ్చిమాసియా మొత్తాన్ని సైరస్ ది గ్రేట్ పాలిస్తున్నాడు. బింబిసార చక్రవర్తికి సమకాలీనుడు సిద్దార్థ గౌతముడు (క్రీ.పూ.563-483). చక్రవర్తి కంటే వయసులో ఐదేళ్లు పెద్దవాడు. తోటి జనులతో చనువుగా మెలగిన సిద్దార్థుడు రోగపీడితుల యాతన చూశాడు, సత్తువ కోల్పోయిన వృద్ధుల ఆవేదన గమనించాడు. చావుమంచం ఎక్కినవాళ్లు బతికేందుకు పడే తాపత్రయం అవగాహన చేసుకున్నాడు. పేదరికం, అమాయకత్వం, మూఢవిశ్వాసం, పిసినారితనం వంటి మానసిక బలహీనతలతో పాటు, దొంగతనం, జూదం, అసూయ, రాగద్వేషాల వంటి అవలక్షణాలను గుర్తించాడు. అతని మనసు వాటి పరిష్కారానికి తహతహలాడింది. అతని ఆలోచన అందుకు మార్గాలు వెదికే ధ్యాసలో కూరుకుపోయింది. పెళ్లి, దాంపత్య సుఖాలు అతన్ని ఆ ఆలోచన నుండి విరమింపజేసేందుకు విఫలమయ్యాయి. ఒక తాగుబోతుకు భార్యమీది కంటే మద్యం మీద ఆసక్తి ఎక్కువుండే చందంగా, ఒక జిజ్ఞాసాపరునికి తన అన్వేషణే ప్రాణప్రదం. బ్రాహ్మణులు చెప్పే శాస్త్రాల్లో సమాధానాలు దొరకగలవనే ఆశతో అతడు వాటిని నేర్చుకునేందుకు ప్రయత్నించాడు. అవి బ్రాహ్మణుల గుప్త సంపదగా మారిపోయి ఉన్నాయి. యోగులుగా దేశాలు పట్టుకు తిరిగే సన్యాసులను ఆశ్రయించాడు. దగ్గరగా చూసిన తరువాత వాళ్లు బూటకమని తేల్చుకున్నాడు. గంగానదికి ఆవలిగావున్న రుష్యాశ్రమాల్లో తన దాహం తీరవచ్చుననే నమ్మకంతో కుటుంబాన్ని వదిలేసి, ‘రాజగృహ’ దిశగా బయలుదేరాడు. బయలుదేరే సమయానికి యశోదర కొడుకును ప్రసవించింది. పుత్ర వాత్సల్యమనే మోహపాశమైనా సిద్దార్థుని ప్రయత్నాన్ని ఆపలేకపోయింది. ఆశ్రమవాసంలో సిద్దార్థుడు ఏళ్ల తరబడి తనకు కావలసిన సమాధానాల కోసం ఎదురుచూశాడు. ఒకచోట తృప్తి దొరకక, మరొక చోటికి తరలిపోయాడు. వెళ్లిన ప్రతిచోట అతనిలోని విధేయత ఆశ్రవాసుల ఆప్యాయతను పొందగలిగింది. ధ్యానంతో జ్ఞానం కలుగుతుందని అతడు వాళ్ల నుండి నేర్చుకున్నాడు. ఆ జ్ఞానానికి పర్యవసానం ఏమిటి అనే ప్రశ్న అతనిలో ఉదయించింది. ప్రతిఫలంగా దొరికే మోక్షం జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందనే రుషుల నిర్వచనం సిద్దార్థునికి నచ్చలేదు. మోక్షమనేది వ్యక్తికి ఒనగూరే లాభం. కనీసం పక్కమనిషితోనైనా పంచుకునేందుకు వీలుపడనిది. అందువల్ల, మోక్షసాధన అనేది స్వార్ధానికి పరాకాష్టంగా అతనికి తోచింది. సిద్దార్థుడు కోరుకునేది పదుగురితో పంచుకునేందుకు వీలయ్యే జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని స్వయంగా సంపాదించుకునేందుకు సిద్దార్థుడు నిర్ణయించుకున్నాడు. ఆశ్రమాన్ని వదిలి, సొంత ప్రయత్నం మీద బయలుదేరిన సిద్దార్థునికి తనలాగే ఆశ్రమాలతో విసిగిన ఐదుగురు మిత్రులు తోడైనారు. ఆహారం మానివేసి, అన్నో ఇన్నో ఆకులలుములు తింటూ, నిశ్చలమైన ఏకాంతంలో కూర్చుని తపస్సులో మునిగితే జ్ఞానం సంప్రాప్తిస్తుందని అందరూ కలిసి నిర్ణయించుకున్నాడు. వింధ్య పర్వత ప్రాంతంలోని ఒక కొండగుహను ఎన్నుకుని సిద్దార్థుడు తపస్సులో కూర్చున్నాడు. మిత్రులు అతని గొప్పతనాన్ని చుట్టుపక్కల గ్రామాల్లో పెద్దగా ప్రచారం చేస్తున్నారు. కొన్ని రోజులకు సిద్దార్థుని శరీర బలం పూర్తిగా నీరసించిందేగానీ జ్ఞానం జాడ దొరకలేదు. ఇది సరైన మార్గమేనా అనే సంశయంతో ఆలోచించుకుంటూ నదివొడ్డున పచార్లు చేస్తున్న సిద్దార్థుడు స్పృహ తప్పి నీటిలో పడిపోయాడు. మిత్రుల సహాయంతో బయటపడి కోలుకున్న తరువాత అతడు ఆహారం కావాలని కోరడం మిత్రలను కలవరపెట్టింది. మెదడుకు శక్తి ఉంటేనే జ్ఞానాన్ని సంపాదించగలుగుతుంది గానీ, నీరసంతో అది అసాధ్యం అనే పలుకులు వాళ్లకు ములుకులైనాయి. సిద్దార్థునికి భ్రష్టత్వం ఆపాదించి వాళ్లు తమ దారిని వెదుక్కున్నారు. ఒంటరిగా మిగిలిన సిద్దార్థుని పరిస్థితి గమనించిన పశుకాపరి వనిత సుజాత, కొన్ని పాలు, కొద్ది కొద్ది భోజనంతో అతన్ని ఆరోగ్యవంతుణ్ని చేసింది. తేరుకున్న సిద్దార్థుడు నదివొడ్డున్నే ఉన్న రావిచెట్టు నీడలో కూర్చుని, నెలల పర్యంతం తనలో తాను తర్కించుకోవడం మొదలెట్టాడు. మెదడును కమ్ముకున్న మబ్బులు కొద్దికొద్దిగా విచ్చిపోవడం ప్రారంభించాయి. కొంతకాలానికి జ్ఞానోదయమైన సంతృప్తితో బుద్ధుడైన సిద్దార్థుడు సంచారానికి బయలుదేరాడు. ఇంతకాలం అతడు ఏ నీడన జ్ఞానం సంపాదించాడో ఆ రావిచెట్టు ‘బోధివృక్షం’ అయింది. నేటి బీహార్ రాష్ట్రంలోని ‘గయ’ పట్టణానికి సమీపంలో ఉండే బౌద్ధుల పుణ్యక్షేత్రమే ఆ బోధివృక్షం. బయలుదేరిన సిద్దార్థుడు కాలినడకన ‘వారణాసి’ చేరుకున్నాడు. అక్కడ అతనికి తనను విడిచిపెట్టివెళ్లిన ఐదుగురు మిత్రులూ కనిపించారు. వాళ్లింకా సన్యాస జీవితమే గడుపుతున్నారు. సిద్దార్థుని కళ్లల్లో ప్రజ్వరిల్లుతున్న ఆత్మవిశ్వాసం వాళ్లను ఆశ్చర్యచకితులను చేసింది. సిద్దార్థుడు పొందిన జ్ఞాన రహస్యం తెలుసుకోవాలనే ఆసక్తి ఏర్పడింది. ఐదురోజుల పాటు వాళ్ల మధ్య చర్చోపచర్చలు ఏకధాటిగా కొనసాగాయి. సిద్దార్థుని అభిప్రాయాలతో వాళ్లకు సంపూర్ణమైన ఏకీభావం కుదిరింది. సిద్దార్థుణ్ని వాళ్లు బుద్ధునిగా గుర్తించారు. అందరూ కలిసి వారణాసి సమీపంలోని జింకల వనంలో కుటీరం నిర్మించుకున్నారు. అనుయాయుల సంఖ్య క్రమక్రమంగా పెరిగింది. వర్షాకాలంలో మాత్రమే వాళ్లకు ఆశ్రమవాసం. మిగతా రోజుల్లో బుద్ధునితో సహా ప్రతి ఒక్కరు దిక్కుదిక్కున సంచారం చేస్తూ, జ్ఞానసందేశం ప్రజలకు అందించాలి. ప్రజలు పెట్టింది మాత్రమే తింటూ ప్రాణం నిలుపుకోవడం ఆ భిక్షకుల క్రమశిక్షణ. పేదరికం, అమాయకత్వం, మూఢవిశ్వాసం, పిసినారితనం వంటి మానసిక బలహీనతలతో పాటు, దొంగతనం, జూదం, అసూయ, రాగద్వేషాల వంటి అవలక్షణాలను గుర్తించాడు. బుద్ధుని బోధనల సర్వస్వం వివరంగా చర్చించేందుకు ఇక్కడ వీలుపడదు గాబట్టి, కీలకమైన అంశాలకు మాత్రమే మనం పరిమితమౌదాం. అతని బోధనలు స్పష్టమైనవిగాను, అర్థం చేసుకునేందుకు తేలికైనవిగాను ఉండటమే కాక, అత్యాధునిక భావాలకు బహుదగ్గరగా ఉండటం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. లోకంలోని బాధలన్నింటికీ మూలం స్వార్థచింతన; మానవుని అంతరంగానికి ‘దురాశ’ అనేది అంతులేని యాతనకు గురిచేస్తుందనేది బుద్ధుని తాత్వికచింతనకు పునాది. అందువల్ల, వదులుకోవలసినవాటిలో మొదటిది - ఇంద్రియాలను తృప్తిపరచాలనే కోరిక; రెండవది - కీర్తి, సంపదలను ఆర్జించాలనే ఆశ; మూడవది - చిరంజీవిగా ఉండాలనే తాపత్రయం. మనిషి ఆలోచనా ప్రపంచం నుండి ‘నేను’ (అహం) అనే సర్వనామం తొలగించుకుంటే, మహోన్నతమైన జ్ఞానానికి దారి ఏర్పడుతుంది. ‘నిర్వాణం’ అంటే ప్రాణాలను త్యజించడం కాదు, ‘అహం’ అనే భావాన్ని త్యజించడం. ఈ లక్ష్యాల సాధన కోసం తప్పనిసరిగా పాటించవలసిన క్రమశిక్షణగా ఎనిమిది నియమాలనూ గౌతమబుద్ధుడు నిర్దేశించాడు. వాటిల్లో మొదటిది మాటలో నిజాయితి; రెండవది నడవడికలో నిజాయితి; మూడవది బతుకు తెరువులో నిజాయితి; నాలుగవది వాంఛలో పరిశుద్ధత; ఐదవది సరైన దృక్పథం; ఆరవది ప్రయత్నంలో నిజాయితి; ఏడవది ఉద్రేకాల నిగ్రహం; ఎనిమిదవది ఆత్మపరిశీలనలో నిజాయితి. ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసింది కోరికలు చంపుకోవాలని కాదు బుద్ధుడు చెప్పింది; వాటిని సరైన మార్గానికి మరలించమని. కోరికలు చంపుకోగలిగినవి కావు; అవి చచ్చిపోతే మనిషికి బతుకు మీద ఆశే చచ్చిపోతుంది. పైగా, కోరికలను వదులుకోవడం ఆచరణ సాధ్యం కాని ప్రయత్నం. అందువల్ల, కోరికలను సరైన మార్గంలో నడిపేందుకు ప్రతిమనిషి సరైన దృక్పథం ఏర్పరుచుకోవాలి. ఉదాహరణకు సమాజానికి సేవ చేయడం, న్యాయం నిలబెట్టేందుకు పాటుపడటం. కళల పట్ల ఆసక్తి వంటివి పెంపొందించుకోవాలని ఉద్దేశం. ప్రయత్నంలో నిజాయితి అంటే - పనేమో మంచిదే, కానీ దాన్ని సాధించేందుకు అవలంబించిన మార్గం నీచమైనదై, ఫలితాన్ని బట్టి మార్గాన్ని సమర్థించుకోవడం తగదని ఉద్దేశం. ఉద్రేకాలనేవి జీవికి సహజ లక్షణం. వాటిని అదుపులో పెట్టుకోగలిగినప్పుడే పశుత్వం వదలిన మనిషౌతాడు. అందువల్ల, ఉద్రేకాలను నియంత్రించడమే కాదు, ఆ దశ నిరంతరం కొనసాగాలంటే మనం చేసుకునే ఆత్మపరిశీలనలో నిజాయితీ ఉంటేనే సాధ్యం అనేది వాటి సారాంశం ఈ బోధనలకు తోడు బుద్ధుడు పునర్జన్మల వంటి విశ్వాసాలను ఖండించాడు. బుద్ధుని ప్రచారాలు వైదికులకు వ్యతిరేకంగా ఉద్దేశించినవి కాకపోయినా, ఆ కోవకు చెందినవాళ్లకు అవి కంటగింపు కలిగించినా, ప్రజాబాహుళ్యాన్ని ఆ తత్వం ఆకర్షించింది. జీవితాంతం ఆదరాభిమానాలు చూరగొన్న తాత్వికునిగా తన 80వ ఏట గౌతమబుద్ధుడు ‘కుశినర (నేటి ఉత్తరప్రదేశ్‌లోని కుశినగర్)’లో జీవిత ప్రస్థానం ముగించాడు. సిద్దార్థునికి జ్ఞానోదయమైన బోధివృక్షం ఇప్పటి గయలో కనిపించేది కాకపోయినా, అసలు వృక్షం తాలూకు అంటు సింహళంలో బహు జాగ్రత్తగా పోషింపబడుతూ, ప్రపంచంలోని అతి ప్రాచీనమైన చారిత్రిక వృక్షంగా ఈనాటికీ మిగిలే ఉంది. బోధివృక్షాన్ని కాపాడుకున్నంత జాగ్రత్తగా బుద్ధుని బోధనలను కాపాడుకోవడంలో అతని శిష్యులు విఫలమైనారు. ‘అహం’ను త్యజించడం సమాజాన్ని త్యజించినంత తేలిక కాదు. సంసారాలను విడిచిపెట్టడం వరకే చేయగలిగారు కానీ, ‘అహం’ను వదిలించుకోలేదు. తరాలు గడిచిన తరువాతి బౌద్ధబిక్షువులు రాజుల అనుగ్రహంతో, శిల్పంతో తీర్చిదిద్దిన ఆరామాల్లో సుఖమైన జీవితాలకు అలవాటుపడ్డారు. సిద్దార్థునికి రెండు తరాల తరువాత గానీ భారతదేశంలో లిపి పుట్టిందిగాదు. అందువల్ల, అతని బోధనలను శిష్యులు ఎంతమేరకు అందుకోగలిగారో, ఎంతమేరకు తరువాతి తరాలకు అందించగలిగారో అంచనా వెయ్యడం సాధ్యమయ్యేదిగాదు. పోనుపోను సిద్ధాంతంలో మలినం పేరుకుపోయి, దిశానిర్దేశం లేనిదిగా తయారైంది. ఇటీవలి కాలంలో వెలుగుజూసిన అత్యంత పురాతనమైన పాళీగ్రంథాల మూలంగా మూలతత్వం కొంతమేరకైనా ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాం. -
గొల్లూరులో మావోయిస్టుల స్థావరం
పోలీసుల రికార్డుకు ఎక్కని ప్రాంతం మావోయిస్టుల స్థావరాన్ని ఛేదిస్తాం 3 జిల్లాల ఉమ్మడి కూంబింగ్‌కు చర్యలు విశాఖ రూరల్ ఎస్పీ ప్రవీణ్ పాడేరు: ఒడిశాలోని కోరాపుట్టు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల సరిహద్దులోని పొట్టంగి బ్లాక్‌లో గొల్లూరు మారుమూల ప్రాంతాన్ని స్ధావరంగా చేసుకొని మావోయిస్టులు కార్యకలాపాలు సాగిస్తున్నారని విశాఖ రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్ తెలిపారు. అరకు, పాడేరు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్‌తో సమావేశం అనంతరం స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో శనివారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. గొల్లూరు ప్రాంతం మావోయిస్టుల అడ్డాగా మారిందన్న విషయం ఇంత వరకు ఒడిశా, విజయనగరం, విశాఖ జిల్లాల పోలీసు యంత్రాంగం గుర్తించ లేదన్నారు. గతంలో కూడా ఈ ప్రాంతం పోలీసు రికార్డుల్లోకి ఎక్కలేదని, ఇక్కడ మావోయిస్టులు స్థావరం ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు సాగిస్తున్న వైనం పోలీసు యంత్రాంగాన్నే ఆశ్చర్యపరుస్తుందన్నారు. 3 జిల్లాల సరిహద్దులోని లోయప్రాంతం కావడంతో ఇంత వరకు పోలీసులకు అనుమానం రాలేదన్నారు. అరకులోయ మండల కేంద్రానికి 20 కి.మీ దూరంలో ఉన్న గొల్లూరులో ఇటీవల మావోయిస్టుల కార్యకలాపాలు అధికమయ్యాయనే పక్కా సమాచారం ఉందన్నారు. మావోయిస్టుల స్థావరాన్ని చేధించేందుకు కొరాపుట్టు, విజయనగరం, విశాఖపట్నం పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నామన్నారు. తాను,విజయనగరం, కోరాపుట్టు ఎస్పీలంతా ఉమ్మడి వ్యూహంతో కూంబింగ్ చర్యలను చేపడతామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో పొట్టంగి బ్లాక్ పరిధిలో మావోయిస్టు డొంబ్రి ఎన్‌కౌంటర్‌కు ప్రతికారంగా మావోయిస్టులు ఇద్దరు కొండదొర కులస్తులను హతమార్చారని, గత నెల సొంకి సమీపంలో గిరిజనేతరుడిని కూడా మావోయిస్టులు హత్య చేశారని తెలిపారు. ఒడిశాలోని కోరాపుట్టు,విజయనగరం జిల్లాల పోలీసు యంత్రాంగం వద్ద కూడా ఈ మారుమూల లోయ ప్రాంతం సమాచారం లేదన్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఏఓబీలోని మావోయిస్టు కేడర్ అంతా అక్కడే మకాం ఏర్పరచుకున్నట్లు తెలుస్తుందన్నారు. మావోయిస్టుల చర్యలను అణచి వేసి ప్రశాంత వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ కోయ ప్రవీణ్ తెలిపారు. విశాఖ ఏజెన్సీలోని ఐఏపీ పథకం కింద చేపట్టిన రూ.3 కోట్ల రోడ్డు పనుల పురోగతిపై ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్‌తో సమీక్షించామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్షించామని ఏజెన్సీలో ఇంజనీరింగ్ పనులన్నీ వేగవంతంగా పూర్తి చేసేందుకు పోలీసుశాఖ కూడా కృషి చేస్తుందని ఎస్పీ తెలిపారు.