టోక్యో: కరోనా వైరస్ విజృంభణతో ఎందరో ఉపాధి కోల్పోయారు. పట్టణాల్లో పని దొరకక చాలామంది స్వగ్రామాలకు చేరుకున్నారు. కానీ కొందరు ఔత్సాహికులు మాత్రమే కోవిడ్ కాలంలోనూ తమ వ్యాపారాన్ని విస్తరించుకున్నారు. ఈ కోవకు చెందిన వాడే జపాన్‌కు చెందిన యుటా సురుయోకా. కరోనా కాలంలో చాలామంది వ్యాపారాలు తలకిందులైతే.. యుటా మాత్రం దూసుకుపోయాడు. అయితే తాను వ్యాపారం ప్రారంభించడానికి కారణం తన తల్లే అంటాడు యుటా. ఆమె చేసిన వ్యాఖ్యలు తనలో ఆలోచన రగిలించాయని.. ఈ క్రమంలో స్థాపించిన కంపెనీ నేడు మహావృక్షమయ్యింది అంటున్నాడు యుటా. క్రౌడ్ ఫండింగ్ స్టార్టప్‌లో ఇంటర్న్‌గా ఉన్న సమయంలో యుటా తల్లి చిన్న దుకాణం నడుపుకునేది. ఈ క్రమంలో ఓ రోజు ఆమె తనకు కూడా ఆన్‌లైన్ స్టోర్ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడింది. కానీ తనకు అది సాధ్యం కాదని నిరాశ వ్యక్తం చేసింది. తల్లి మాటలు యుటాలో ఆలోచనలు రేపాయి. గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణదారులకు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఇంటర్నెట్ షాపులను సృష్టించడానికి సహాయపడే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా అతను 2012 లో తన సొంత సంస్థ ‘బేస్ ఇంక్‌ను’ స్థాపించాడు. గత ఏడాది స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేసిన నాటి నుంచి యుటా కంపెనీ షేర్ల విలువ ఆరు రెట్లు పెరిగింది. అయితే అక్టోబర్‌లో గరిష్ట స్థాయి నుంచి బాగా పడిపోయినప్పటికీ పెద్దగా నష్టం వాటిల్లలేదు. (చదవండి: ‘ట్విట్టర్ కిల్లర్’.. పర్మిషన్ తీసుకుని చంపాడు)
ప్రస్తుతం యుటా కంపెనీ షేర్ల మార్కెట్ విలువ సుమారు 7 1.7 బిలియన్లకు పెరగడమే కాక అతడిని మల్టీమిలియనీర్‌గా చేసింది. ఒక హాబీగా స్టార్ట్ చేసిన ఈ కంపెనీ ప్రస్తుతం మల్టీమిలయన్ డాలర్ల విలువ చేస్తోంది. ఈ కంపెనీ ప్రధానంగా ఏం చేస్తుంది అంటే చిన్న చిన్న వ్యాపారులు చేసుకునే వారికి సొంతంగా ఆన్‌లైన్ షాప్‌ని క్రియేట్ చేసుకునేందుకు సాయం చేస్తుంది. పేమెంట్ ప్రాసెసింగ్‌కు అవసరమైన టూల్స్‌ని అందిస్తుంది. హోల్‌సెల్లర్లకు మాత్రమే కాక రిటైలర్లకు కూడా ఈ సేవలను అందిస్తుండటం.. యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్‌ఫామ్ కావడంతో అనతి కాలంలోనే ఈ యుటా బేస్ కంపెనీ ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించగలిగింది. ఇక బేస్ నిర్వహిస్తోన్న ఆన్‌లైన్ యాప్‌లో ప్రస్తుతం 7 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారంటే ఎంత బాగా రన్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక వెబ్‌సైట్ క్రియేట్ చేసినందుకు గాను టేస్ యూజర్ల దగ్గర నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయదు. కానీ అది ప్రొవైడ్ చేసే పేమెంట్ టూల్స్ నుంచి జనరేట్ అయ్యే రెవెన్యూలో వాటా తీసుకుంటుంది. (చదవండి: కోవిడ్ ఎఫెక్ట్... ఆరోగ్య బీమా జోరు!)
ఇక యుటా ఓ కాలేజీలో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ చదువుతుండగా.. ఓ క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్‌ప్‌లో ఇంటర్న్‌షిప్ మొదలు పెట్టాడు. ఆ సమయంలో పేపాల్ వంటివి మంచి విజయం సాధించాయి. దాంతో యుటాకి దీని మీద ఆసక్తి ఏర్పడింది. అయితే సొంతంగా తానే ఓ బిజినేస్ చేస్తానని యుటా ఎప్పుడు అనుకోలేదు. తల్లి మాటలతో ఓ హాబీగా బేస్‌ని స్థాపించినప్పటికి అది కస్టమర్లను బాగా ఆకర్షించింది. ఇక కరోనా యుటాకి బాగా కలసి వచ్చింది. గతేడాది ఆగస్టు నాటికి బేస్ స్టోర్‌లో 8 లక్షల కంపెనీలు ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి వాటి సంఖ్య 1.2మిలియన్లకు పెరిగింది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ కారణంతో అన్‌లైన్ వ్యాపారాలకు గిరాకీ బాగా పెరిగింది. దాంతో చాలా మంది రిటైలర్స్ బేస్‌లో ఆన్‌లైన్ స్టోర్లు క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇంత విజయం సాధించినప్పటికి యుటా ఏ మాత్రం పొంగిపోలేదు. తాను ఇప్పుడే వ్యాపారా ప్రపంచంలోకి అడుగుపెట్టానని... నేర్చుకోవాల్సింది చాలా ఉందంటాడు
Comments
Please login to add a commentAdd a comment