breaking news
Intern
-
ఇంటర్న్‌లకు రూ.12.5 లక్షలు వరకు స్టైపెండ్
భారతదేశ ఉద్యోగ పరిశ్రమలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న రంగాల్లో సేవలందిస్తున్న సంస్థలు ఇంటర్న్‌లకు భారీ స్టైపెండ్లు ఆఫర్ చేస్తున్నాయి. ఆమ్స్ట్రడమ్ ఆధారిత ఐఎంసీ ట్రేడింగ్ బీవీ తన ఇంటర్న్‌లకు నెలకు రూ.12.5 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు తెలిపింది. ఇది 2024లో కంపెనీ చెల్లించిన స్టైపెండ్ల కంటే మూడు రెట్లు అధికంగా ఉండడం గమనార్హం. క్వాడే కంపెనీ తన ఇంటర్న్‌ల స్టెపెండ్ను నెలకు రూ.7.5 లక్షలకు పెంచింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 50% పెరుగుదలను సూచిస్తుంది.ప్రతిభ కలిగిన వారికి కంపెనీలు ఎంతైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ వ్యవహారం ద్వారా తెలుస్తుంది. ఇటీవల కాలంలో మెటా ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఏర్పాటుకు ప్రపంచంలోని టెక్ నిపుణుల కోసం కంపెనీ సెర్చింగ్ ప్రారంభించింది. అందుకు దాదాపు రూ.880 కోట్ల వరకు కూడా ప్రవేశ ప్యాకేజీని అందించేందుకు సిద్ధపడింది. ప్రస్తుతం మెరుగైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులకు ఐఎంసీ ట్రేడింగ్ బీవీ, క్వాడే కంపెనీలు ఇంటర్న్‌లకు భారీగా స్టైపెండ్ ఇచ్చేందుకు సన్నద్ధం అయ్యాయి. వీటి బాటలోనే మరిన్ని కంపెనీలు నడిచే అవకాశం ఉంది. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కంపెనీకి వ్యాల్యూ యాడ్ చేసే వారికి ఎప్పటికీ జాబ్ మార్కెట్లో గిరాకీ ఉంటుందని దీని ద్వారా తెలుస్తుంది.ముఖ్యంగా క్వాంట్ పరిశోధకులు, ట్రేడింగ్ ఇంజినీర్లు, గణితం, కంప్యూటర్ సైన్స్, డేటా మోడలింగ్‌లో మెరుగైన నైపుణ్యాలు ఉన్న అల్గోరిథమిక్ డెవలపర్లకు, ఏఐ ప్రాంప్టింగ్ ఇంజినీరింగ్, జెన్ఏఐ ట్రెయినింగ్ ఉద్యోగాలకు డిమాండ్ ఉన్నట్లు కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐఎంసీ ట్రేడింగ్ బీవీ, క్వాడే కంపెనీల ఇంటర్న్‌షిప్‌లో చాలా మంది ఐఐటీ, బిట్స్ పిలానీ, ఎంఐటీ, ఈటీహెచ్ జ్యూరిచ్ వంటి గ్లోబల్ విశ్వవిద్యాలయాల నుంచి హాజరయ్యారు. ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి! -
తల్లి మాటతో.. కోట్లు సంపాదించాడు
టోక్యో: కరోనా వైరస్ విజృంభణతో ఎందరో ఉపాధి కోల్పోయారు. పట్టణాల్లో పని దొరకక చాలామంది స్వగ్రామాలకు చేరుకున్నారు. కానీ కొందరు ఔత్సాహికులు మాత్రమే కోవిడ్ కాలంలోనూ తమ వ్యాపారాన్ని విస్తరించుకున్నారు. ఈ కోవకు చెందిన వాడే జపాన్‌కు చెందిన యుటా సురుయోకా. కరోనా కాలంలో చాలామంది వ్యాపారాలు తలకిందులైతే.. యుటా మాత్రం దూసుకుపోయాడు. అయితే తాను వ్యాపారం ప్రారంభించడానికి కారణం తన తల్లే అంటాడు యుటా. ఆమె చేసిన వ్యాఖ్యలు తనలో ఆలోచన రగిలించాయని.. ఈ క్రమంలో స్థాపించిన కంపెనీ నేడు మహావృక్షమయ్యింది అంటున్నాడు యుటా. క్రౌడ్ ఫండింగ్ స్టార్టప్‌లో ఇంటర్న్‌గా ఉన్న సమయంలో యుటా తల్లి చిన్న దుకాణం నడుపుకునేది. ఈ క్రమంలో ఓ రోజు ఆమె తనకు కూడా ఆన్లైన్ స్టోర్ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడింది. కానీ తనకు అది సాధ్యం కాదని నిరాశ వ్యక్తం చేసింది. తల్లి మాటలు యుటాలో ఆలోచనలు రేపాయి. గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణదారులకు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఇంటర్నెట్ షాపులను సృష్టించడానికి సహాయపడే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా అతను 2012 లో తన సొంత సంస్థ ‘బేస్ ఇంక్‌ను’ స్థాపించాడు. గత ఏడాది స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసిన నాటి నుంచి యుటా కంపెనీ షేర్ల విలువ ఆరు రెట్లు పెరిగింది. అయితే అక్టోబర్‌లో గరిష్ట స్థాయి నుంచి బాగా పడిపోయినప్పటికీ పెద్దగా నష్టం వాటిల్లలేదు. (చదవండి: ‘ట్విట్టర్ కిల్లర్’.. పర్మిషన్ తీసుకుని చంపాడు) ప్రస్తుతం యుటా కంపెనీ షేర్ల మార్కెట్ విలువ సుమారు 7 1.7 బిలియన్లకు పెరగడమే కాక అతడిని మల్టీమిలియనీర్‌గా చేసింది. ఒక హాబీగా స్టార్ట్ చేసిన ఈ కంపెనీ ప్రస్తుతం మల్టీమిలయన్ డాలర్ల విలువ చేస్తోంది. ఈ కంపెనీ ప్రధానంగా ఏం చేస్తుంది అంటే చిన్న చిన్న వ్యాపారులు చేసుకునే వారికి సొంతంగా ఆన్లైన్ షాప్‌ని క్రియేట్ చేసుకునేందుకు సాయం చేస్తుంది. పేమెంట్ ప్రాసెసింగ్‌కు అవసరమైన టూల్స్‌ని అందిస్తుంది. హోల్సెల్లర్లకు మాత్రమే కాక రిటైలర్లకు కూడా ఈ సేవలను అందిస్తుండటం.. యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్‌ఫామ్ కావడంతో అనతి కాలంలోనే ఈ యుటా బేస్ కంపెనీ ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించగలిగింది. ఇక బేస్ నిర్వహిస్తోన్న ఆన్లైన్ యాప్‌లో ప్రస్తుతం 7 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారంటే ఎంత బాగా రన్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక వెబ్సైట్ క్రియేట్ చేసినందుకు గాను టేస్ యూజర్ల దగ్గర నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయదు. కానీ అది ప్రొవైడ్ చేసే పేమెంట్ టూల్స్ నుంచి జనరేట్ అయ్యే రెవెన్యూలో వాటా తీసుకుంటుంది. (చదవండి: కోవిడ్ ఎఫెక్ట్... ఆరోగ్య బీమా జోరు!) ఇక యుటా ఓ కాలేజీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుతుండగా.. ఓ క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్‌ప్‌లో ఇంటర్న్‌షిప్ మొదలు పెట్టాడు. ఆ సమయంలో పేపాల్ వంటివి మంచి విజయం సాధించాయి. దాంతో యుటాకి దీని మీద ఆసక్తి ఏర్పడింది. అయితే సొంతంగా తానే ఓ బిజినేస్ చేస్తానని యుటా ఎప్పుడు అనుకోలేదు. తల్లి మాటలతో ఓ హాబీగా బేస్‌ని స్థాపించినప్పటికి అది కస్టమర్లను బాగా ఆకర్షించింది. ఇక కరోనా యుటాకి బాగా కలసి వచ్చింది. గతేడాది ఆగస్టు నాటికి బేస్ స్టోర్‌లో 8 లక్షల కంపెనీలు ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి వాటి సంఖ్య 1.2మిలియన్లకు పెరిగింది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ కారణంతో అన్లైన్ వ్యాపారాలకు గిరాకీ బాగా పెరిగింది. దాంతో చాలా మంది రిటైలర్స్ బేస్‌లో ఆన్లైన్ స్టోర్లు క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇంత విజయం సాధించినప్పటికి యుటా ఏ మాత్రం పొంగిపోలేదు. తాను ఇప్పుడే వ్యాపారా ప్రపంచంలోకి అడుగుపెట్టానని... నేర్చుకోవాల్సింది చాలా ఉందంటాడు -
పార్టీ పేరిట పిలిచి.. స్పానిష్ యువతిపై..
గురుగ్రామ్: ఢిల్లీకి చెందిన ఫిల్మ్ మేకర్ తనపై అత్యాచారం జరిపాడని 23 ఏళ్ల స్పానిష్ యువతి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ విద్యార్థి అయిన స్పానిష్ యువతి భారత్‌లోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఏడాది పాటు ఇంటెర్న్‌గా పనిచేయడానికి ఇక్కడికి వచ్చింది. గురుగ్రామ్‌లో బస చేసిన ఆమె.. ఇల్లు మారాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఫేస్బుక్ గ్రూప్ ద్వారా నిందితుడు ఆంజనేయ్ ఆమెకు పరిచయమయ్యాడు. యానిమేషన్ చిత్రాలు నిర్మించే ప్రొడక్షన్ హౌస్‌లో పనిచేస్తున్న అతని స్వస్థలం ఢిల్లీలోని ఆనంద్ విహార్ కాగా.. ప్రస్తుతం గురుగ్రామ్‌లో ఉంటున్నాడు. అతను శుక్రవారం (జూన్ 14) పార్టీ ఉందని తన ఇంటికి పిలిచాడు. దీంతో రాత్రి 10.30 గంటల సమయంలో స్పానిష్ యువతి అతనికి ఇంటికి వెళ్లింది. ‘నేను అతన్ని గట్టిగా నమ్మడంతోనే అతని ఇంటికి వెళ్లాను. కొన్ని గంటలు కలిసి గడిపాక మేం ముద్దులు పెట్టుకున్నాం. ఆ తర్వాత పైన ఉన్న గదిలోకి నన్ను అతను తీసుకెళ్లాడు. అయితే, శృంగారంలో పాల్గొనాలన్న ఆలోచన నన్ను ఇబ్బంది పెట్టింది. అది వద్దని నేను అతనికి చెప్పను. దీంతో కనీసం రాత్రి ఇక్కడే గడిపి వెళ్లు అతని చెప్పాడు. ఇందుకు అంగీకరించాను. కానీ, నిద్రపోయిన తర్వాత కొంతసేపటికి మేలుకువ వచ్చింది. ఆంజనేయ్ హస్తప్రయోగం చేసుకుంటూ నావైపు చూస్తూ కనిపించాడు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. వెంటనే ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. కానీ అతను నన్ను వెళ్లనివ్వలేదు. నాకు ఇబ్బందిగా ఉందని ఎంత చెప్పినా వినిపించుకోకుండా అతన్ను బలవంతపెట్టాడు. బలత్కారం చేశాడు. అతను చెప్పినట్టు చేయకుంటే ఇంకేదైనా దారుణం చేస్తాడేమోనన్న భయంతో ఈ ఘోరాన్ని నేను భరించాను. డోర్లు మూసి..నా ఫోన్ విసిరేసి..అతను నాపై అత్యాచారం చేశాడు’ అని బాధితురాలు ఫిర్యాదులో వివరించారు. తన స్నేహితురాలి ద్వారా ఆ ఘటన జరిగిన మరునాడే బాధితురాలు ఫిర్యాదు చేసింది. మొదట ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసిన బాధితురాలు అనంతరం పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. నిందితుడు ఆంజనేయ్పై ఐపీసీ సెక్షన్లు 376 (రేప్), 342 (అక్రమ నిర్బంధం) కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. -
ఆఫీసుకొచ్చి బజ్జుంటే.. కోలిగ్స్ ఏం చేశారో తెలుసా?
అతను కొత్తగా కంపెనీలో చేరిన ఇంటర్న్ (శిక్షణ ఉద్యోగి). కానీ ఆఫీసు నచ్చలేదో.. జాబ్ అంటే ఇష్టం లేదో.. కొలువులో చేరిన రెండో రోజే అతను ఆఫీసుకు వచ్చి బజ్జున్నాడు. నోరు తెరిచి.. గురకలు పెడుతూ ఓ పెద్ద కునుకే తీశాడు. మరీ అతని సహ ఉద్యోగులు ఏం చేశారనే కదా మీ డౌట్. వాళ్లేం తక్కువ తినలేదు. సదరు కొత్త ఉద్యోగిని నిద్రలేపడానికి బదులు.. గురకలు పెడుతున్న అతని చుట్టూ మూగి.. ఆనందంతో విజయచిహ్నాలు చూపుతూ ఏకంగా ఓ భారీ సెల్ఫీ దిగారు. దానిని రెడ్ఇట్లో పోస్టు చేశారు. ఆ సెల్ఫీ ఇప్పుడు ఆన్లైన్ లో హల్చల్ చేస్తోంది. ఆఫీసులో నిద్రపోతే.. ఉద్యోగం ఊడే అవకాశముందంటూ చిత్రవిచిత్రమైన జోక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సెల్ఫీపై పేలుతున్నాయి. కెనడాకు చెందిన ఆ ఇంటర్న్ మాత్రం ఓ ఎనర్జీ డ్రింక్ తాగడం వల్ల నిద్ర ముంచుకువచ్చిందని, అందుకే కాస్త కునుకు తీశానని ఓ వెబ్సైట్ కు ఇచ్చిన వివరణలో తెలిపాడు.