ఆఫీసుకొచ్చి బజ్జుంటే.. కోలిగ్స్‌ ఏం చేశారో తెలుసా? | He Fell Asleep At Work, Now, The Internets Trolling This Intern | Sakshi
Sakshi News home page

ఆఫీసుకొచ్చి బజ్జుంటే.. కోలిగ్స్‌ ఏం చేశారో తెలుసా?

Published Mon, Feb 8 2016 4:53 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM

ఆఫీసుకొచ్చి బజ్జుంటే.. కోలిగ్స్‌ ఏం చేశారో తెలుసా?

ఆఫీసుకొచ్చి బజ్జుంటే.. కోలిగ్స్‌ ఏం చేశారో తెలుసా?

అతను కొత్తగా కంపెనీలో చేరిన ఇంటర్న్‌ (శిక్షణ ఉద్యోగి). కానీ ఆఫీసు నచ్చలేదో.. జాబ్‌ అంటే ఇష్టం లేదో.. కొలువులో చేరిన రెండో రోజే అతను ఆఫీసుకు వచ్చి బజ్జున్నాడు. నోరు తెరిచి.. గురకలు పెడుతూ ఓ పెద్ద కునుకే తీశాడు. మరీ అతని సహ ఉద్యోగులు ఏం చేశారనే కదా మీ డౌట్. వాళ్లేం తక్కువ తినలేదు. సదరు కొత్త ఉద్యోగిని నిద్రలేపడానికి బదులు.. గురకలు పెడుతున్న అతని చుట్టూ మూగి.. ఆనందంతో విజయచిహ్నాలు చూపుతూ ఏకంగా ఓ భారీ సెల్ఫీ దిగారు.

దానిని రెడ్‌ఇట్‌లో పోస్టు చేశారు. ఆ సెల్ఫీ ఇప్పుడు ఆన్‌లైన్ లో హల్‌చల్‌ చేస్తోంది. ఆఫీసులో నిద్రపోతే.. ఉద్యోగం ఊడే అవకాశముందంటూ చిత్రవిచిత్రమైన జోక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సెల్ఫీపై పేలుతున్నాయి. కెనడాకు చెందిన ఆ ఇంటర్న్ మాత్రం ఓ ఎనర్జీ డ్రింక్‌ తాగడం వల్ల నిద్ర ముంచుకువచ్చిందని, అందుకే కాస్త కునుకు తీశానని ఓ వెబ్‌సైట్‌ కు ఇచ్చిన వివరణలో తెలిపాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement