టోక్యో: విశ్వ క్రీడలంటేనే ప్రతిష్టాత్మకం. అలాంటే మేటి ఒలింపిక్స్ క్రీడలను ఔత్సాహిక ప్రేక్షకులు ప్రత్యక్షంగా చూసేందుకు ఎగబడతారు. నెలల ముందే టికెట్లు బుక్ చేసుకుంటారు. కానీ ‘టోక్యో’ ఈవెంట్‌ను మాత్రం కరోనా వైరస్ దెబ్బకొట్టింది. దీంతో ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడల ఆరంభ సంబరాలు, పోటీలు, ముగింపు వేడుకలకు చప్పట్లు కొట్టేవారెవరూ ప్రేక్షకుల గ్యాలరీలో ఉండరు. దీంతో హీట్లు, ఫీట్లు, విజయాలు, ఘనతలు, రికార్డులు టోక్యో గడ్డపై ఇలా ఏం జరుగుతున్నా... టీవీల్లోనే చూడాలి. ప్రత్యక్ష ప్రేక్షకులుండరు. అంతా టీవీ ప్రేక్షకులే!
ఇప్పటికే విదేశీ ప్రేక్షకులెవరినీ అనుమతించ వద్దని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకుంది. స్వదేశీ ప్రేక్షకులను అనుమతించాలని అనుకున్నప్పటికీ అది కూడా సాధ్యంకానీ పరిస్థితి ఉందిపుడు! 68 వేల సీట్ల సామర్థ్యమున్న నేషనల్ స్టేడియంలో ఈనెల 23న ఒలింపిక్స్ ఆరంభోత్సవాలు జరుగుతాయి. దీనికి మాత్రం కేవలం వీఐపీలను అనుమతిస్తారు. వేదికల వద్ద ప్రేక్షకుల సందడే ఉండదని స్థానిక మీ డియా పేర్కొంది. చిన్నా చితక స్టేడియాల్లో జరిగే పోటీలకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకుల్ని అనుమతించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment