online store
-
డిఫరెంట్ గెటప్స్ ట్రై చేసేది అందుకే: జాతిరత్నాలు భామ
చిట్టి.. నా బుల్బుల్ చిట్టి.. అంటూ కుర్రకారు మనసు దోచుకున్న నటి, సొగసైన పొడగరి ఫరియా అబ్దుల్లా.. మొదటి సినిమాతో ఇటు గ్లామర్ పరంగా అటు నటనాపరంగా వందశాతం మార్కులు కొట్టేసింది. ఆరేళ్ల వయసులోనే యాక్టర్ కావాలనుకుందట ఈ అమ్మడు. అందుకే డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్, డ్రెస్‌లు ట్రై చేస్తుంటానని చెప్పింది చిట్టి. ఆ నటికి నచ్చిన.. ఆమె మెచ్చిన బ్రాండ్స్ ఇవీ.. గీతిక కానుమిల్లి.. హైదరాబాద్‌కు చెందిన గీతిక కానుమిల్లి.. చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కంది. ఆ ఆసక్తితోనే ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసింది. అనంతరం 2018లో హైదరాబాద్‌లో ‘గీతిక కానుమిల్లి’ అని తన పేరుమీదే ఓ బొటిక్ ప్రారంభించింది. అనతి కాలంలోనే ఆమె డిజైన్స్ పాపులర్ అయి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. పి.వి.సింధు, సమంత, కీర్తి సురేష్, సైనా నెహ్వాల్ వంటి చాలా మంది సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్ చేసింది. ధర కూడా డిజైన్‌ను బట్టే ఉంటుంది. ఇక్కడ ఏది కొనాలన్నా వేల నుంచి లక్షల్లో ఖర్చు చేయాలి. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్ అన్నిటిలోనూ ఈ డిజైన్స్ లభిస్తాయి. ద ట్రింక్ హాలిక్.. ఇదొక ఇన్స్టాగ్రామ్ షాపింగ్ సైట్. ఈ మధ్యనే మొదలైన ఈ బ్రాండ్ .. అతి తక్కువ ధరలకే అందమైన జ్యూయెలరీని అందిస్తోంది. క్వాలిటీకి పెట్టింది పేరు. అదే వీరి బ్రాండ్ వాల్యూ. అందుకే, సామాన్య ప్రజల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలకు ఇది ఫేవరెట్. ఇతర బ్రాండ్స్‌తో పోలిస్తే కాస్త సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఇన్స్టాగ్రామ్ మెయిన్ ప్లాట్‌ఫామ్‌గా వీటిని కొనుగోలు చేయొచ్చు. వాట్సాప్ చేసి కూడా ఆర్డర్ చేయొచ్చు. చదవండి: క్లాస్ అయినా.. మాస్ అయినా ఆయనే ‘బాస్’ -
తల్లి మాటతో.. కోట్లు సంపాదించాడు
టోక్యో: కరోనా వైరస్ విజృంభణతో ఎందరో ఉపాధి కోల్పోయారు. పట్టణాల్లో పని దొరకక చాలామంది స్వగ్రామాలకు చేరుకున్నారు. కానీ కొందరు ఔత్సాహికులు మాత్రమే కోవిడ్ కాలంలోనూ తమ వ్యాపారాన్ని విస్తరించుకున్నారు. ఈ కోవకు చెందిన వాడే జపాన్‌కు చెందిన యుటా సురుయోకా. కరోనా కాలంలో చాలామంది వ్యాపారాలు తలకిందులైతే.. యుటా మాత్రం దూసుకుపోయాడు. అయితే తాను వ్యాపారం ప్రారంభించడానికి కారణం తన తల్లే అంటాడు యుటా. ఆమె చేసిన వ్యాఖ్యలు తనలో ఆలోచన రగిలించాయని.. ఈ క్రమంలో స్థాపించిన కంపెనీ నేడు మహావృక్షమయ్యింది అంటున్నాడు యుటా. క్రౌడ్ ఫండింగ్ స్టార్టప్‌లో ఇంటర్న్‌గా ఉన్న సమయంలో యుటా తల్లి చిన్న దుకాణం నడుపుకునేది. ఈ క్రమంలో ఓ రోజు ఆమె తనకు కూడా ఆన్లైన్ స్టోర్ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడింది. కానీ తనకు అది సాధ్యం కాదని నిరాశ వ్యక్తం చేసింది. తల్లి మాటలు యుటాలో ఆలోచనలు రేపాయి. గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణదారులకు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఇంటర్నెట్ షాపులను సృష్టించడానికి సహాయపడే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా అతను 2012 లో తన సొంత సంస్థ ‘బేస్ ఇంక్‌ను’ స్థాపించాడు. గత ఏడాది స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసిన నాటి నుంచి యుటా కంపెనీ షేర్ల విలువ ఆరు రెట్లు పెరిగింది. అయితే అక్టోబర్‌లో గరిష్ట స్థాయి నుంచి బాగా పడిపోయినప్పటికీ పెద్దగా నష్టం వాటిల్లలేదు. (చదవండి: ‘ట్విట్టర్ కిల్లర్’.. పర్మిషన్ తీసుకుని చంపాడు) ప్రస్తుతం యుటా కంపెనీ షేర్ల మార్కెట్ విలువ సుమారు 7 1.7 బిలియన్లకు పెరగడమే కాక అతడిని మల్టీమిలియనీర్‌గా చేసింది. ఒక హాబీగా స్టార్ట్ చేసిన ఈ కంపెనీ ప్రస్తుతం మల్టీమిలయన్ డాలర్ల విలువ చేస్తోంది. ఈ కంపెనీ ప్రధానంగా ఏం చేస్తుంది అంటే చిన్న చిన్న వ్యాపారులు చేసుకునే వారికి సొంతంగా ఆన్లైన్ షాప్‌ని క్రియేట్ చేసుకునేందుకు సాయం చేస్తుంది. పేమెంట్ ప్రాసెసింగ్‌కు అవసరమైన టూల్స్‌ని అందిస్తుంది. హోల్సెల్లర్లకు మాత్రమే కాక రిటైలర్లకు కూడా ఈ సేవలను అందిస్తుండటం.. యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్‌ఫామ్ కావడంతో అనతి కాలంలోనే ఈ యుటా బేస్ కంపెనీ ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించగలిగింది. ఇక బేస్ నిర్వహిస్తోన్న ఆన్లైన్ యాప్‌లో ప్రస్తుతం 7 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారంటే ఎంత బాగా రన్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక వెబ్సైట్ క్రియేట్ చేసినందుకు గాను టేస్ యూజర్ల దగ్గర నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయదు. కానీ అది ప్రొవైడ్ చేసే పేమెంట్ టూల్స్ నుంచి జనరేట్ అయ్యే రెవెన్యూలో వాటా తీసుకుంటుంది. (చదవండి: కోవిడ్ ఎఫెక్ట్... ఆరోగ్య బీమా జోరు!) ఇక యుటా ఓ కాలేజీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుతుండగా.. ఓ క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్‌ప్‌లో ఇంటర్న్‌షిప్ మొదలు పెట్టాడు. ఆ సమయంలో పేపాల్ వంటివి మంచి విజయం సాధించాయి. దాంతో యుటాకి దీని మీద ఆసక్తి ఏర్పడింది. అయితే సొంతంగా తానే ఓ బిజినేస్ చేస్తానని యుటా ఎప్పుడు అనుకోలేదు. తల్లి మాటలతో ఓ హాబీగా బేస్‌ని స్థాపించినప్పటికి అది కస్టమర్లను బాగా ఆకర్షించింది. ఇక కరోనా యుటాకి బాగా కలసి వచ్చింది. గతేడాది ఆగస్టు నాటికి బేస్ స్టోర్‌లో 8 లక్షల కంపెనీలు ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి వాటి సంఖ్య 1.2మిలియన్లకు పెరిగింది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ కారణంతో అన్లైన్ వ్యాపారాలకు గిరాకీ బాగా పెరిగింది. దాంతో చాలా మంది రిటైలర్స్ బేస్‌లో ఆన్లైన్ స్టోర్లు క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇంత విజయం సాధించినప్పటికి యుటా ఏ మాత్రం పొంగిపోలేదు. తాను ఇప్పుడే వ్యాపారా ప్రపంచంలోకి అడుగుపెట్టానని... నేర్చుకోవాల్సింది చాలా ఉందంటాడు -
యాపిల్ ఆన్లైన్ స్టోర్ : బంపర్ ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఐఫోన్ తయారీదారు, టెక్ దిగ్గజం యాపిల్ ఇండియాలో తొలి ఆన్లైన్ స్టోర్ ను బుధవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వినియోగదారులకు డైరెక్ట్ కస్టమర్ సపోర్ట్ తో పాటు, పరిమిత కాలానికి క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందిస్తోంది. ఇందుకోసం హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఎంపిక చేసిన కొనుగోళ్లపై వినియోగదారులు ఆరు శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ క్యాష్‌బ్యాక్ గరిష్టంగా10,000 రూపాయలు. ఐదు నుండి ఏడు రోజుల్లో బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అయితే క్యాష్‌బ్యాక్ పొందాలంటే కనీస కొనుగోలు విలువ 20,900 రూపాయల కంటే ఎక్కువ ఉండాలి. (యాపిల్ ఆన్లైన్ స్టోర్ వచ్చేసింది : విశేషాలు) హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుల లావాదేవీలలోమాత్రమే ఈ ఆఫర్ లభ్యం. ఒక ఆర్డర్‌కు పరిమితమైన ఈ ఆఫర్ అక్టోబర్16 వరకు అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు నోకాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిటీబ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్ఎస్బిసి, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, జె అండ్ కె బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా మాత్రమే ఇది లభ్యం. దీంతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యస్ బ్యాంక్. హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డుల వినియోగదారులకు ఆరు నెలల కాలానికి నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ అందిస్తోంది. అంతేకాదు పాత ఐఫోన్ అమ్మకం ద్వారా కొత్త ఐఫోన్ కొనుగోలు చేయవచ్చు. బ్రాండ్, మోడల్, కండిషన్‌కు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు ఆన్లైన్ ద్వారా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. తరువాత ట్రేడ్-ఇన్ క్రెడిట్‌ను సర్దుబాటుతో కొత్త ఐఫోన్ ధరను తగ్గిస్తుంది. వీటితోపాటు శాంసంగ్, గెలాక్సీ ఎస్10, వన్‌ప్లస్ 6టీ లాంటి ఆండ్రాయిడ్ ఫోన్లకు కూడా క్రెడిట్ ఆఫర్ చేస్తోంది. ఐఫోన్లు, ఐప్యాడ్లు, మాక్, వాచ్, యాపిల్ టీవీలతోపాటు, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మాక్స్, ఐఫోన్ 11, ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ ఎక్స్ఆర్ తదితరాలను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. -
యాపిల్ ఆన్లైన్ స్టోర్ వచ్చేసింది : విశేషాలు
సాక్షి,న్యూఢిల్లీ: ఎంతో ఆసక్తిగా యాపిల్ లవర్స్ ఎదురు చూస్తున్న దేశంలో యాపిల్ తొలి ఆన్లైన్ స్టోర్ ను అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ప్రారంభించింది. రానున్నపండుగ సీజన్ డిమాండ్‌ను క్యాష్ చేసుకునే వ్యూహంలో భాగంగా దేశీయ వినియోగదారుల నెట్టింట వాలిపోయింది. యాపిల్ ఇండియా అధికారిక వెబ్సైట్ (www.apple.com/in)ను సందర్శించి, థర్డ్ పార్టీ సేవలపై ఆధారపడకుండా నేరుగా కొనుగోళ్లు చేయవచ్చు. అంతేకాదు డైరెక్ట్ కస్టమర్ సపోర్టు కూడా యూజర్లకు భిస్తుంది. కస్టమర్లకు అత్యుత్తమ సేవలను అందించేందుకు నైపుణ్యం కలిగిన తమ ఆన్లైన్ టీం సిద్ధంగా ఉన్నారని యాపిల్ ప్రకటించింది. ఆన్లైన్ స్టోర్ ద్వారా యాపిల్ మొదటిసారిగా దేశవ్యాప్తంగా వినియోగదారులకు పూర్తి స్థాయి ఉత్పత్తులు, ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. రవాణా కోసం యాపిల్ బ్లూడార్ట్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. (గుడ్ న్యూస్ చెప్పిన టిమ్ కుక్) యాపిల్ ఆన్లైన్ స్టోర్ అందించే సేవలు అన్ని ఆర్డర్లు కాంటాక్ట్‌లెస్ డెలివరీ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ద్వారా ఫైనాన్సింగ్ సదుపాయం విద్యార్థులు ప్రత్యేక ధరల వద్ద మాక్ లేదా ఐప్యాడ్ లు. ఆపిల్ కేర్ ఉత్పత్తులపై స్పెషల్ డిస్కౌంట్లు. యాక్సిడెంట్ కవరేజి వారంటీ ఎయిర్‌పాడ్స్‌లో ఇంగ్లీష్, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం తెలుగు భాషలలో స్పెషల్ ఎమోజీలు , టెక్ట్స్, ప్రపంచవ్యాప్తంగా 38 వ ఆన్లైన్ స్టోర్ ఆపిల్ ఇండియా స్టోర్ ద్వారా భారతీయ వినియోగదారులకు యాపిల్ నిపుణుల సలహాలు, సూచనలు అందుబాటులో ఉంటాయి. ప్రొడక్ట్ ఫీచర్ల గురించి మరింత తెలుసుకోవడం, సెటప్ చేయడం వరకు వినియోగదారులు ఇంగ్లీష్‌లో ఆన్లైన్ లో సాయం అందిస్తుంది. అలాగే ఫోన్ ద్వారా హిందీ ఇంగ్లీషులో నేరుగా సలహాలు యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారు, తమ డివైస్ గురించి మరింత తెలుసుకునేందుకు , ఇతర సలహాలు, సందేహాల నివృత్తి కోసం ఎగ్జిక్యూటివ్‌తో 30 నిమిషాల పాటు మాట్లాడవచ్చు. ఫోటోగ్రఫీ, సంగీతాభిమానులకు 'టుడే ఎట్ ఆపిల్' ద్వారా స్థానిక నిపుణుల నేతృత్వంలో ఆన్లైన్ సెషన్లు అక్టోబర్‌లో ప్రారంభించనుంది. కాగా ఇటీవల యాపిల్ లాంచ్ చేసిన యాపిల్ వాచ్ సిరీస్ 6, కొత్త ఐప్యాడ్ ఎయిర్ తోపాటు, ఐఫోన్, ఐప్యాడ్, మాక్ లాంటి ఉత్పత్తులు ఆన్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. యాపిల్ ప్రస్తుతం భారత్‌లో ఉత్పత్తులను థర్డ్ పార్టీ విక్రేతలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. (ఆపిల్ ఈవెంట్ 2020 : ప్రధాన ఆవిష్కరణలు) -
గుడ్ న్యూస్ చెప్పిన టిమ్ కుక్
సాక్షి, న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ ప్రేమికులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే దేశీయంగా ఆపిల్ తన తొలి ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ శుక్రవారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. తద్వారా తమ కస్టమర్లకు మరింత చేరువవుతున్నట్టు తెలిపారు.(ఆపిల్ ఈవెంట్ 2020 : ప్రధాన ఆవిష్కరణలు) సెప్టెంబర్ 23 న భారత్‌లో తొలి స్టోర్ ను ప్రారంభించనున్నామని టిమ్ కుక్ ట్వీట్ చేశారు తమకు ఇష్టమైన వారితో, చుట్టూ ఉన్న ప్రపంచంతో సన్నిహితంగా ఉండటం తమ కస్టమర్లకు ఎంత ముఖ్యమో తెలుసు. అందుకే సెప్టెంబర్ 23న ఆన్లైన్లో ఆపిల్ స్టోర్‌తో కస్టమర్లకు కనెక్ట్ అవుతున్నామన్నారు. భారతదేశంలో విస్తరిస్తున్నందుకు గర్వంగా ఉందని, యూజర్లకు మద్దతు, సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డీర్డ్రే ఓ'బ్రియన్ అన్నారు. ఆపిల్ స్పెషలిస్టుల ద్వారా వినియోగదారులు సలహాలు పొందవచ్చని, కొత్త ఆపిల్ ఉత్పత్తులపై ఇంగ్లీష్, హిందీ ఇతర భాషలలో తెలుసుకోవచ్చని హామీ ఇచ్చారు. కస్లమర్ల సౌలభ్యంకోసం చేయగలిగినదంతా చేయాలనుకుంటున్నామన్నారు. మాక్ లేదా ఐప్యాడ్ కొనుగోలు చేసే విద్యార్థులకు ప్రత్యేక తగ్గింపు లభిస్తుందని పేర్కొంది. అలాగే ఆపిల్ ఇతర యాక్ససరీస్, కేర్ ఉత్పత్తులపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అంతేకాదు ఈ పండుగ సీజన్లో, ఆపిల్ సిగ్నేచర్ గిఫ్ట్ ర్యాప్, ఎంచుకున్నఉత్పత్తులపై స్పెషల్ ఎంగ్రేవింగ్ సదుపాయం కూడా అందించనుంది. ఇంగ్లీష్, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం, తెలుగు భాషలలో ఎమోజీ లేదా టెక్స్ట్ చేసుకోవచ్చు. ఆపిల్ ఎయిర్ పాడ్, ఐప్యాడ్ లో ఆపిల్ పెన్సిల్ ఫీచర్ అందిస్తున్నట్టు ఆపిల్ పత్రికా ప్రకటనలో తెలిపింది. కాగా ఇటీవల నిర్వహించిన ఆపిల్ ఈవెంట్ లో సంస్థ వాచ్ సిరీస్. ఐప్యాడ్స్, కొత్త ఆపరేటింగ్ సిస్టంను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. We know how important it is for our customers to stay in touch with those they love and the world around them. We can’t wait to connect with our customers and expand support in India with the Apple Store online on September 23! 🇮🇳https://t.co/UjR31jzEaY — Tim Cook (@tim_cook) September 18, 2020 -
ఐఫోన్ ప్రేమికులకు శుభవార్త
కాలిఫోర్నియా: ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన వినియోగదారులకు ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించింది. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో తన సొంత ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించనున్నట్టు ధృవీకరించింది. అలాగే 2021 నాటికి తొలి ఆపిల్ బ్రాండెడ్ ఫిజికల్ స్టోర్ ఏర్పాటు కానుందని స్వయంగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు. తద్వారా భారతీయ వినియోగదారులకు నేరుగా ఆన్లైన్లోనే ఐఫోన్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఆపిల్ ప్రస్తుతం తన ఉత్పత్తులను థర్డ్‌పార్టీ రీటైలర్ల ద్వారా విక్రయిస్తోంది. కాలిఫోర్నియాలో జరిగిన సంస్థ వార్షిక వాటాదారుల సమావేశంలో ఈ విషయాన్ని టిమ్ కుక్ వెల్లడించారు. దేశీయ భాగస్వామితో కాకుండా తామే స్వయంగా స్టోర్‌ను ప్రారంభించాలని చూస్తున్నామని, దీనికి సంబంధించిన అనుమతులను భారత ప్రభుత్వం నుండి పొందాల్సి వుందని కుక్ చెప్పారు. తమ బ్రాండ్‌ను మరెవరో నడపాలని తాను కోరుకోవడంలేదన్నారు. అంతేకాదు తమకు భారత్ చాలా కీలకమై మార్కెట్ అని గట్టిగా విశ్వసించే కుక్ 2020 జూన్, జూలై మధ్య ఇండియాలో పర్యటించనున్నారు. భారత్‌లో వ్యాపారం, తయారీ ప్రణాళికలు, ఎగుమతులు, ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఆపిల్ దుకాణాల విస్తరణతో సహా పలు అంశాలను ఆయన పరిశీలించనున్నారు. 2019 ఆగస్టులో భారత ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)నిబంధనల సడలింపుల నేపథ్యంలో 2020 జనవరి, మార్చి మధ్య ఆపిల్ తన మొదటి ఆన్లైన్ స్టోర్‌ను ముంబైలో ప్రారంభించనుందని అంచనాలొచ్చాయి. అయితే లాజిస్టికల్ సమస్యలతో ఈ ప్రయత్నాలను వాయిదా వేసినట్టు పలు అంచనాలు వెలువడ్డాయి. (చదవండి : శాంసంగ్‌కు బై, ఆపిల్‌కు సై : వారెన్ బఫెట్) కాగా డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆపిల్ భారతదేశంలో 925,000 ఐఫోన్లను రవాణా చేసిందని పరిశోధనా సంస్థ కెనాలిస్ అంచనా. ఈ సంఖ్య సంవత్సరంలో దాదాపు 200 శాతం పెరిగింది. అయితే దేశంలో ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపై కేంద్రం విధించిన భారీ దిగుమతి సుంకం ఆపిల్‌కు భారతీయ స్మార్ట్‌మార్కెట్లో పెద్ద సవాలు. ఈ నేపథ్యంలోనే ఆపిల్ కాంట్రాక్టర్లు ఫాక్స్‌కాన్, విస్ట్రాన్ సహకారంతో ఐఫోన్లు అసెంబ్లింగ్ ద్వారా పలు రకాల ఐఫోన్ మోడళ్లను (ప్రస్తుత తరం శ్రేణి మినహా) తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలో సొంత దుకాణాలను ప్రారంభించే ముందు సబ్సిడీ, దిగుమతి సుంకాల సడలింపుపై భారత ప్రభుత్వంతో గత కొంతకాలంగా చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. చదవండి : ఆపిల్ సీఈవోకు వేధింపులు, ఫిర్యాదు -
ఆన్లైన్లో వెస్పాస్టోర్ స్నాప్‌డీల్ సహకారంతో అమ్మకాలు
న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన ద్విచక్ర వాహన కంపెనీ పియాజియో వెహికల్స్ తన తొలి ఆన్లైన్ స్టోర్‌ను మంగళవారం ప్రారంభించింది. స్నాప్‌డీల్ సహకారంతో ఈ ఆన్లైన్ స్టోర్‌ను అందుబాటులోకి తెచ్చామని పియాజియో తెలిపింది. వెస్పా స్కూటర్ల అన్ని మోడళ్ల(వెస్పా, వీఎక్స్, వెస్పా ఎస్, వెస్పా ఎలిగంటె)ను ఈ ఆన్లైన్ స్టోర్‌లో డిస్ప్లే చేస్తామని పియాజియో వెహికల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్(టూ వీలర్ బిజినెస్) సంజీవ్ గోయల్ చెప్పారు. వినియోగదారులు ఒక్క క్లిక్‌తో తమకు నచ్చిన వెస్పా మోడల్‌ను రూ.5,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. కొనుగోళ్లకు ఎక్కువ సమయం వెచ్చించలేని, ఆన్లైన్ షాపింగ్ ఇష్టపడే యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆన్లైన్ స్టోర్‌ను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. వినియోగదారులు అన్ని రకాలైన వెస్పా మోడళ్లను యాక్సెస్ చేసుకునే విధంగా వినూత్నమైన షాపింగ్ అనుభూతిని పొందేలా ఈ ఆన్లైన్ వెస్పా స్టోర్‌ను రూపొందించామని స్నాప్‌డీల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టోనీ నవీన్ చెప్పారు. -
డయాకేర్ ఆన్లైన్
మధుమేహం నగర వాసుల్లో చాలామందిని పట్టి పీడిస్తోంది. యాంత్రిక జీవనం, సకాలంలో భోజనం చేయకపోవడం, ఒత్తిడి కారణంగా వయసుతో నిమిత్తం లేకుండానే పలువురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మధుమేహం బారిన పడేవారు వైద్యుల సలహా, సూచనలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకు ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరం. వారికి కావాల్సిన ఆహారం సరైన పోషకాలతో లభించడం ఒకింత కష్టమే. దీనిని గమనించిన ‘డయాబెటిస్ ఇండియా స్టోర్.కామ్’ మధుమేహ బాధితులకు అవసరమైన అన్ని రకాల వస్తువులను ఒకేచోట అందుబాటులోకి తెస్తోంది. మందులు మినహా ఫుడ్ నుంచి ఫుట్‌కేర్ వరకు మధుమేహ బాధితులకు అవసరమైన అన్ని వస్తువులను ఈ ఆన్లైన్ స్టోర్ ద్వారా అందిస్తున్నారు. కావాల్సిన వస్తువులను ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చాలు, నేరుగా వాటిని ఇంటికి పంపిస్తారు. లభించే వస్తువులు... ఫ్రెండ్లీ ఫుడ్ ఇందులో బ్రేక్‌ఫాస్ట్ రెడీ మిక్స్, డయా రైస్, మిల్లెట్ మిక్స్, సుగర్ ఫ్రీ బిస్కట్స్, సుగర్ ఫ్రీ చాక్లెట్స్, జామ్స్, స్వీట్లు. ఫ్రెండ్లీ బెవరేజెస్ ఇన్స్టంట్ గ్రీన్ టీ, డయా జీత్రీ హెర్బల్ టీ, లెమన్ జిం జర్ స్క్వాష్, ఇన్స్టంట్ నేచురల్ సూప్స్. సప్లిమెంట్స్, నేచురల్ పౌడర్స్... బ్లాక్ జామూన్ (నేరేడు) పౌడర్, కరేలా(కాకర) పౌడర్, ఆమ్లా (ఉసిరి) పౌడర్, మేథి (మెంతి) పౌడర్, నేచురల్ స్వీటెనర్స్ ఫుట్ కేర్... డయాబెటిక్ సిల్వర్ సాక్స్, హెల్త్ సాక్స్, డయాబెటిక్ ఫుట్‌వేర్‌తో పాటు గ్లూకోమీటర్స్, ఆలివ్ ఆయిల్, వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్స్ సహా మొత్తం 200ల వస్తువులు దొరుకుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు అవగాహన కల్పించే పుస్తకాలను ఆన్లైన్లో విక్రయించడంతో పాటు ఉచితంగా కౌన్సెలింగ్ ఇస్తారు. మధుమేహ బాధితులందరికీ అందుబాటు ధరలకే ఈ వస్తువులను విక్రయిస్తున్నామని ‘డయాబెటిస్ ఇండియా స్టోర్స్ డాట్ కామ్’ డెరైక్టర్ రవిచంద్ర చాడ తెలిపారు. ఆన్లైన్లో రూ.499కు పైబడి విలువ గల వస్తువులను కొనుగోలు చేసే వారికి ఉచితంగా డోర్ డెలివరీ చేస్తున్నామని, ఎలాంటి దుష్ర్పభావాలు లేని బ్రాండెడ్ కంపెనీల వస్తువులనే తాము విక్రయిస్తున్నామని వివరించారు. ఆర్డర్ ఇవ్వాలనుకుంటే.. www.diabetesindiastore.com వెబ్సైట్ ద్వారా కావాల్సిన వస్తువులను బుక్ చేసుకోవచ్చు. లేదా కాల్‌సెంటర్: 9246819393లో సంప్రదించవచ్చు.