ఆన్‌లైన్‌లో వెస్పాస్టోర్ స్నాప్‌డీల్ సహకారంతో అమ్మకాలు | Piaggio launches first online Vespa store on Snapdeal | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో వెస్పాస్టోర్ స్నాప్‌డీల్ సహకారంతో అమ్మకాలు

Published Wed, May 20 2015 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM

ఆన్‌లైన్‌లో వెస్పాస్టోర్ స్నాప్‌డీల్ సహకారంతో అమ్మకాలు

ఆన్‌లైన్‌లో వెస్పాస్టోర్ స్నాప్‌డీల్ సహకారంతో అమ్మకాలు

న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన ద్విచక్ర వాహన కంపెనీ పియాజియో వెహికల్స్ తన తొలి ఆన్‌లైన్ స్టోర్‌ను మంగళవారం ప్రారంభించింది. స్నాప్‌డీల్ సహకారంతో ఈ ఆన్‌లైన్ స్టోర్‌ను అందుబాటులోకి తెచ్చామని పియాజియో తెలిపింది. వెస్పా స్కూటర్ల అన్ని మోడళ్ల(వెస్పా, వీఎక్స్, వెస్పా ఎస్, వెస్పా ఎలిగంటె)ను ఈ ఆన్‌లైన్ స్టోర్‌లో డిస్‌ప్లే చేస్తామని పియాజియో వెహికల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్(టూ వీలర్ బిజినెస్) సంజీవ్ గోయల్ చెప్పారు.

వినియోగదారులు ఒక్క క్లిక్‌తో తమకు నచ్చిన వెస్పా మోడల్‌ను రూ.5,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.  కొనుగోళ్లకు ఎక్కువ సమయం వెచ్చించలేని, ఆన్‌లైన్ షాపింగ్ ఇష్టపడే  యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆన్‌లైన్ స్టోర్‌ను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు.  వినియోగదారులు అన్ని రకాలైన వెస్పా మోడళ్లను యాక్సెస్ చేసుకునే విధంగా వినూత్నమైన షాపింగ్ అనుభూతిని పొందేలా ఈ ఆన్‌లైన్ వెస్పా స్టోర్‌ను రూపొందించామని స్నాప్‌డీల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టోనీ నవీన్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement