Piaggio Vehicles
-
విడుదలైన పియాజియో ఆపే నెక్ట్స్‌ప్లస్, ధర ఎంతంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగంలో ఉన్న ఇటలీ సంస్థ పియాజియో భారత మార్కెట్లో ప్యాసింజర్ విభాగంలో ఆపే నెక్ట్స్ ప్లస్ త్రిచక్ర వాహనం ప్రవేశపెట్టింది. పరిచయ ఆఫర్లో ఎక్స్‌షోరూం ధర రూ.2.35 లక్షలు. పెట్రోల్, సీఎన్జీ, ఎల్పీజీ వేరియంట్లలో ఈ మోడల్‌ను రూపొందించారు. సీఎన్జీ వేరియంట్ కేజీకి 50 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ట్యూబ్‌లెస్ టైర్స్, విశాలమైన కూర్చునే స్థలం, డ్యూయల్ టోన్ సీట్స్, పారదర్శక కిటికీలు వంటి హంగులు ఉన్నాయి. కంపెనీ విక్రయిస్తున్న మోత్తం యూనిట్లలో సీఎన్జీ వాటా ఏకంగా 50 శాతముంది. డీజిల్ మోడళ్లకు మహమ్మారి ముందస్తు స్థాయిలో 20 శాతం లోపే డిమాండ్ ఉందని కంపెనీ తెలిపింది. -
చెన్నైలో పియాజియో తొలి ఎలక్ట్రిక్ వాహన అవుట్ లెట్
చెన్నై: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నైలో తన మొదటి ఎలక్ట్రిక్ వాహన అవుట్ లెట్ ఏర్పాటు చేసింది. తమిళనాడు వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఎం.ఎ.సుబ్రమణియం ఈ ఎక్స్ పీరియన్స్ సెంటర్(ఈవీ షోరూమ్) ప్రారంభించారు. పియాజియో ఎలక్ట్రిక్ వాహనాలను ఈ ఈవీ షోరూమ్ లో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు అని అన్నారు."చెన్నైలో తమిళనాడులో మా మొదటి ఈవీ ప్రత్యేక షోరూమ్ ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది. చెన్నై ఒక పెద్ద మెట్రో & ప్రధాన వ్యాపారలకు కేంద్రంగా ఉంది" అని ఈవీపీ, కమర్షియల్ వేహికల్ బిజినెస్ హెడ్, పియాజియో ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ సాజు నాయర్ అన్నారు. చెన్నై తరువాత, కంపెనీ తమిళనాడులోని ఇతర నగరాలలో ఈవీని విస్తరించాలని చూస్తున్నట్లు నాయర్ తెలిపారు. పియాజియో ఇటీవల కార్గో, ప్యాసింజర్ సెగ్మెంట్లలో ఈవీల ఎఫ్ఎక్స్ రేంజ్(ఫిక్సిడ్ బ్యాటరీ)ని లాంఛ్ చేసింది. ఈ కొత్త ఉత్పత్తులు కొత్త చెన్నై అవుట్ లెట్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. "పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాలపై తమిళ నాడు ప్రభుత్వం దృష్టి సారించడంతో, ఈవీ వాహనాలు భవిష్యత్తులో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉండబోతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి & మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందడానికి మా కొత్త ఈవీ విధానం రూపొందించబడింది" అని సుబ్రమణియం తెలిపారు.(చదవండి: జేమ్స్ బాండ్‌కు శ్రీరామరక్ష ఏదో తెలుసా?) -
ఇండియన్ మార్కెట్లో..వరల్డ్ ఫేమస్ సూపర్ బైక్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న పియాజియో నూతన సూపర్‌బైక్స్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. వీటిలో అప్రీలియా ఆర్ఎస్ 660, టూవోనో 660, అప్రీలియా ఆర్ఎస్వీ4, టూవోనో వీ4, మోటో గుజ్జి వీ85టీటీ ఉన్నాయి. ధరలు రూ.13.09 లక్షల నుంచి రూ.23.69 లక్షల వరకు ఉంది. మోటోప్లెక్స్ డీలర్షిప్స్ వద్ద ఇవి లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ బైక్స్‌కు మంచి ఫాలోయింగ్ ఉందని కంపెనీ తెలిపింది. ధర 660 సీసీ అప్రీలియా ఆర్ఎస్ 660 రూ.13.39 లక్షలు, టూవోనో 660 రూ.13.09 లక్షలు, 1078 సీసీ ఆర్ఎస్వీ4 రూ.23.69 లక్షలు, 1077 సీసీ టూవోనో వీ4 రూ.20.66 లక్షలు, 850 సీసీ మోటోగుజ్జి వీ85టీటీ రూ.15.4 లక్షలు ఉంది. -
ఏప్రిలియా బుకింగ్స్ షురూ...!
ముంబై: ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం పియాజియో ఇండియా ఇటీవల ఆవిష్కరించిన ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 ప్రీ – బుకింగ్స్ శుక్రవారం ప్రారంభమయ్యాయి. పియాజియో డీలర్ల వద్ద, ఆన్లైన్లో ముందస్తుగా రూ.5,000 చెల్లించి ఈ మోడల్‌ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. సరికొత్త ఎస్ఎక్స్ఆర్ 125 గతేడాది డిసెంబర్లో విడుదల చేసిన ఎస్ఎక్స్ఆర్160 మోడల్‌కు అప్డేట్ వెర్షెన్‌గా వస్తుంది. ఇందులో బీఎస్–6 ప్రమాణాలు కలిగిన 125సీసీ త్రీ వాల్వ్ ఫ్యూయల్ ఎజెక్టెడ్ ఇంజిన్‌ను అమర్చారు. అలాగే ఎల్ఈడీ హెడ్‌లైట్స్, ఎల్ఈడీ టైల్ లైట్స్, ఫ్యూయల్ డిజిటల్ క్లస్టర్, బ్లూటూత్ మొబైల్ కనెక్టివిటీ సదుపాయం, అనువైన సీటింగ్ వ్యవస్థ, అడ్జెస్టబుల్ రేర్ సస్పెన్షన్, సీబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్‌తో డిస్క్ బ్రేక్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. చదవండి: డబ్ల్యూఎల్‌పీకి రెండో హబ్‌గా హైదరాబాద్ -
మార్కెట్లోకి పియాజియో ‘ఏప్ ఈ–సిటీ’
న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన దిగ్గజ వాహన తయారీ కంపెనీ పియాజియో.. భారత ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టింది. ‘ఏప్ ఈ–సిటీ’ పేరిట ఎలక్ట్రిక్ త్రీ–వీలర్‌ను బుధవారం విడుదల చేసింది. లిథియం– అయాన్ బ్యాటరీ కలిగిన దీని ధర రూ. 1.97 లక్షలుగా(ఎక్స్–షోరూం) ప్రకటించింది. మూడేళ్ల వారెంటీతో వస్తున్న ఈ వాహనాన్ని సన్ మొబిలిటీ భాగస్వామ్యంతో మొదటి దశలో చండీగఢ్, మొహాలి, గురుగ్రామ్‌లలో అందుబాటులోకి తెస్తోంది. -
ఆన్లైన్లో వెస్పాస్టోర్ స్నాప్‌డీల్ సహకారంతో అమ్మకాలు
న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన ద్విచక్ర వాహన కంపెనీ పియాజియో వెహికల్స్ తన తొలి ఆన్లైన్ స్టోర్‌ను మంగళవారం ప్రారంభించింది. స్నాప్‌డీల్ సహకారంతో ఈ ఆన్లైన్ స్టోర్‌ను అందుబాటులోకి తెచ్చామని పియాజియో తెలిపింది. వెస్పా స్కూటర్ల అన్ని మోడళ్ల(వెస్పా, వీఎక్స్, వెస్పా ఎస్, వెస్పా ఎలిగంటె)ను ఈ ఆన్లైన్ స్టోర్‌లో డిస్ప్లే చేస్తామని పియాజియో వెహికల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్(టూ వీలర్ బిజినెస్) సంజీవ్ గోయల్ చెప్పారు. వినియోగదారులు ఒక్క క్లిక్‌తో తమకు నచ్చిన వెస్పా మోడల్‌ను రూ.5,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. కొనుగోళ్లకు ఎక్కువ సమయం వెచ్చించలేని, ఆన్లైన్ షాపింగ్ ఇష్టపడే యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆన్లైన్ స్టోర్‌ను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. వినియోగదారులు అన్ని రకాలైన వెస్పా మోడళ్లను యాక్సెస్ చేసుకునే విధంగా వినూత్నమైన షాపింగ్ అనుభూతిని పొందేలా ఈ ఆన్లైన్ వెస్పా స్టోర్‌ను రూపొందించామని స్నాప్‌డీల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టోనీ నవీన్ చెప్పారు.