విడుదలైన పియాజియో ఆపే నెక్ట్స్‌ప్లస్‌, ధర ఎంతంటే! | Piaggio Vehicles On Monday Launched An All New New Passenger Three Wheeler | Sakshi
Sakshi News home page

విడుదలైన పియాజియో ఆపే నెక్ట్స్‌ప్లస్‌, ధర ఎంతంటే!

Published Wed, Jul 13 2022 10:31 AM | Last Updated on Wed, Jul 13 2022 10:34 AM

Piaggio Vehicles On Monday Launched An All New New Passenger Three Wheeler - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన రంగంలో ఉన్న ఇటలీ సంస్థ పియాజియో భారత మార్కెట్లో ప్యాసింజర్‌ విభాగంలో ఆపే నెక్ట్స్‌ ప్లస్‌ త్రిచక్ర వాహనం ప్రవేశపెట్టింది. పరిచయ ఆఫర్‌లో ఎక్స్‌షోరూం ధర రూ.2.35 లక్షలు. పెట్రోల్, సీఎన్‌జీ, ఎల్‌పీజీ వేరియంట్లలో ఈ మోడల్‌ను రూపొందించారు.

సీఎన్‌జీ వేరియంట్‌ కేజీకి 50 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ట్యూబ్‌లెస్‌ టైర్స్, విశాలమైన కూర్చునే స్థలం, డ్యూయల్‌ టోన్‌ సీట్స్, పారదర్శక కిటికీలు వంటి హంగులు ఉన్నాయి.

కంపెనీ విక్రయిస్తున్న మోత్తం యూనిట్లలో సీఎన్‌జీ వాటా ఏకంగా 50 శాతముంది. డీజిల్‌ మోడళ్లకు మహమ్మారి ముందస్తు స్థాయిలో 20 శాతం లోపే డిమాండ్‌ ఉందని కంపెనీ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement