సాక్షి,న్యూఢిల్లీ: ఎంతో ఆసక్తిగా యాపిల్ లవర్స్ ఎదురు చూస్తున్న దేశంలో యాపిల్ తొలి ఆన్‌లైన్ స్టోర్ ను అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ప్రారంభించింది. రానున్నపండుగ సీజన్ డిమాండ్‌ను క్యాష్ చేసుకునే వ్యూహంలో భాగంగా దేశీయ వినియోగదారుల నెట్టింట వాలిపోయింది. యాపిల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ (www.apple.com/in)ను సందర్శించి, థర్డ్ పార్టీ సేవలపై ఆధారపడకుండా నేరుగా కొనుగోళ్లు చేయవచ్చు. అంతేకాదు డైరెక్ట్ కస్టమర్ సపోర్టు కూడా యూజర్లకు భిస్తుంది. కస్టమర్లకు అత్యుత్తమ సేవలను అందించేందుకు నైపుణ్యం కలిగిన తమ ఆన్‌లైన్ టీం సిద్ధంగా ఉన్నారని యాపిల్ ప్రకటించింది. ఆన్‌లైన్ స్టోర్ ద్వారా యాపిల్ మొదటిసారిగా దేశవ్యాప్తంగా వినియోగదారులకు పూర్తి స్థాయి ఉత్పత్తులు, ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. రవాణా కోసం యాపిల్ బ్లూడార్ట్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. (గుడ్ న్యూస్ చెప్పిన టిమ్ కుక్)
యాపిల్ ఆన్‌లైన్ స్టోర్ అందించే సేవలు
- అన్ని ఆర్డర్‌లు కాంటాక్ట్‌లెస్ డెలివరీ
- ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ద్వారా ఫైనాన్సింగ్ సదుపాయం
- విద్యార్థులు ప్రత్యేక ధరల వద్ద మాక్ లేదా ఐప్యాడ్ లు. ఆపిల్ కేర్ ఉత్పత్తులపై స్పెషల్ డిస్కౌంట్లు. యాక్సిడెంట్ కవరేజి వారంటీ
- ఎయిర్‌పాడ్స్‌లో ఇంగ్లీష్, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం తెలుగు భాషలలో స్పెషల్ ఎమోజీలు , టెక్ట్స్,
- ప్రపంచవ్యాప్తంగా 38 వ ఆన్‌లైన్ స్టోర్ ఆపిల్ ఇండియా స్టోర్ ద్వారా భారతీయ వినియోగదారులకు యాపిల్ నిపుణుల సలహాలు, సూచనలు అందుబాటులో ఉంటాయి.
- ప్రొడక్ట్ ఫీచర్ల గురించి మరింత తెలుసుకోవడం, సెటప్ చేయడం వరకు వినియోగదారులు ఇంగ్లీష్‌లో ఆన్‌లైన్ లో సాయం అందిస్తుంది. అలాగే ఫోన్ ద్వారా హిందీ ఇంగ్లీషులో నేరుగా సలహాలు
- యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారు, తమ డివైస్ గురించి మరింత తెలుసుకునేందుకు , ఇతర సలహాలు, సందేహాల నివృత్తి కోసం ఎగ్జిక్యూటివ్‌తో 30 నిమిషాల పాటు మాట్లాడవచ్చు.
- ఫోటోగ్రఫీ, సంగీతాభిమానులకు 'టుడే ఎట్ ఆపిల్' ద్వారా స్థానిక నిపుణుల నేతృత్వంలో ఆన్‌లైన్ సెషన్లు అక్టోబర్‌లో ప్రారంభించనుంది.
కాగా ఇటీవల యాపిల్ లాంచ్ చేసిన యాపిల్ వాచ్ సిరీస్ 6, కొత్త ఐప్యాడ్ ఎయిర్ తోపాటు, ఐఫోన్, ఐప్యాడ్, మాక్ లాంటి ఉత్పత్తులు ఆన్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. యాపిల్ ప్రస్తుతం భారత్‌లో ఉత్పత్తులను థర్డ్ పార్టీ విక్రేతలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. (ఆపిల్ ఈవెంట్ 2020 : ప్రధాన ఆవిష్కరణలు)
Comments
Please login to add a commentAdd a comment