డయాకేర్ ఆన్‌లైన్
మధుమేహం నగర వాసుల్లో చాలామందిని పట్టి పీడిస్తోంది. యాంత్రిక జీవనం, సకాలంలో భోజనం చేయకపోవడం, ఒత్తిడి కారణంగా వయసుతో నిమిత్తం లేకుండానే పలువురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మధుమేహం బారిన పడేవారు వైద్యుల సలహా, సూచనలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకు ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరం. వారికి కావాల్సిన ఆహారం సరైన పోషకాలతో లభించడం ఒకింత కష్టమే. దీనిని గమనించిన ‘డయాబెటిస్ ఇండియా స్టోర్.కామ్’ మధుమేహ బాధితులకు అవసరమైన అన్ని రకాల వస్తువులను ఒకేచోట అందుబాటులోకి తెస్తోంది. మందులు మినహా ఫుడ్ నుంచి ఫుట్‌కేర్ వరకు మధుమేహ బాధితులకు అవసరమైన అన్ని వస్తువులను ఈ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అందిస్తున్నారు. కావాల్సిన వస్తువులను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే చాలు, నేరుగా వాటిని ఇంటికి పంపిస్తారు.
లభించే వస్తువులు...
ఫ్రెండ్లీ ఫుడ్
ఇందులో బ్రేక్‌ఫాస్ట్ రెడీ మిక్స్, డయా రైస్, మిల్లెట్ మిక్స్, సుగర్ ఫ్రీ బిస్కట్స్, సుగర్ ఫ్రీ చాక్లెట్స్, జామ్స్, స్వీట్లు.
ఫ్రెండ్లీ బెవరేజెస్
ఇన్‌స్టంట్ గ్రీన్ టీ, డయా జీత్రీ హెర్బల్ టీ, లెమన్ జిం జర్ స్క్వాష్, ఇన్‌స్టంట్ నేచురల్ సూప్స్.
సప్లిమెంట్స్, నేచురల్ పౌడర్స్...
బ్లాక్ జామూన్ (నేరేడు) పౌడర్, కరేలా(కాకర) పౌడర్, ఆమ్లా (ఉసిరి) పౌడర్, మేథి (మెంతి) పౌడర్, నేచురల్ స్వీటెనర్స్
ఫుట్ కేర్...
డయాబెటిక్ సిల్వర్ సాక్స్, హెల్త్ సాక్స్, డయాబెటిక్ ఫుట్‌వేర్‌తో పాటు గ్లూకోమీటర్స్, ఆలివ్ ఆయిల్, వెయిట్ మేనేజ్‌మెంట్ ప్రోడక్ట్స్ సహా మొత్తం 200ల వస్తువులు దొరుకుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు అవగాహన కల్పించే పుస్తకాలను ఆన్‌లైన్‌లో విక్రయించడంతో పాటు ఉచితంగా కౌన్సెలింగ్ ఇస్తారు.
మధుమేహ బాధితులందరికీ అందుబాటు ధరలకే ఈ వస్తువులను విక్రయిస్తున్నామని ‘డయాబెటిస్ ఇండియా స్టోర్స్ డాట్ కామ్’ డెరైక్టర్ రవిచంద్ర చాడ తెలిపారు. ఆన్‌లైన్‌లో రూ.499కు పైబడి విలువ గల వస్తువులను కొనుగోలు చేసే వారికి ఉచితంగా డోర్ డెలివరీ చేస్తున్నామని, ఎలాంటి దుష్ర్పభావాలు లేని బ్రాండెడ్ కంపెనీల వస్తువులనే తాము విక్రయిస్తున్నామని వివరించారు.
ఆర్డర్ ఇవ్వాలనుకుంటే..
www.diabetesindiastore.com వెబ్‌సైట్ ద్వారా కావాల్సిన
వస్తువులను బుక్ చేసుకోవచ్చు.
లేదా కాల్‌సెంటర్: 9246819393లో
సంప్రదించవచ్చు.