మధుమేహాన్ని అధిగమించండి | Overcome Diabetes taking care of yourself | Sakshi
Sakshi News home page

మధుమేహాన్ని అధిగమించండి

Published Fri, Nov 14 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM

మధుమేహాన్ని అధిగమించండి

మధుమేహాన్ని అధిగమించండి

సకాలంలో సరైన చికిత్సా విధానాన్ని అనుసరిస్తే మధుమేహం ఓ సమస్య కానే కాదు. దాన్ని తేలికగా నియంత్రించండి. భారత్‌లో మధుమేహం కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గణాంకాల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం 5 కోట్ల మంది మధుమేహం రోగులున్నారు. మరో 10 కోట్ల మంది దీని బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటుంది. అదేమిటంటే.. భారతదేశానికి హైదరాబాద్ నగరం ‘మధుమేహ రాజధానిగా’ పిలవబడడం!
 
 ఈ మహమ్మారి ఇలా విజృంభించడానికి కారణమేంటి?  జీవనశైలితో ముడిపడిన వ్యాధి ‘ఒకేచోట కూర్చుని ఉద్యోగం చేయాల్సి రావడం, శరీరానికి తగిన వ్యాయమం లేకపోవడం, స్థూలకాయం, పని ఒత్తిడి, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, క్రమబద్ధమైన జీవితం కొరవడడం వంటివి ఈ వ్యాధికి కారణమవుతున్నాయి. ‘ఇదివరకు వయసు మళ్లినవారిలో మాత్రమే కనిపించే మధుమేహం... ఇప్పుడు 20-30 ఏళ్ల వారిలో సైతం కనిపిస్తోంది’ అని హైదరాబాద్‌లోని  రేవా సంస్థకు చెందిన డాక్టర్ ప్రసాద్ చెప్పారు.
 
 మధుమేహ వ్యాధిపై పరిశోధన, నివారణ, నియంత్రణ వంటి అంశాలకు సంబంధించిన ఇన్‌స్టిట్యూట్ అనేక విజయాలు తన సొంతం చేసుకుంది. సకాలంలో గుర్తించి, చికిత్స చేపడితే ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చని రేవా వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధిని బట్టి చికిత్స కాకుండా, ఈ వ్యాధి ప్రబలడానికి ముందుగానే దీన్ని పసిగట్టి నివారణ చర్యలు తీసుకోవడం  ఈ వైద్య విధానం. ‘మేం సమగ్రమైన చికిత్సా విధానం ద్వారా శరీరంలో బ్లడ్ షుగర్‌ని అదుపు చేస్తాం. తరువాత సరైన ఔషధాలు, పౌష్టిక పదార్థాల ద్వారా శరీరతత్వాన్ని మార్చి ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రిస్తాం’ అని డాక్టర్ ప్రసాద్ తెలిపారు.
 
 ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తులున్నారు. అయితే, తమకు మధుమేహం ఉన్నట్లు వాళ్లకు తెలియదు. అటువంటివారికి సకాలంలో సరైన చికిత్స అందని పక్షంలో వాళ్లు తీవ్రస్థాయి దుష్పరిణామాలకు లోనుకావడం ఖాయం. ‘మధుమేహం అంత ప్రమాదకర వ్యాధి కాదు. చికిత్స తరువాత చాలామంది ఎంతో ఆనందంగా ఉన్నారు. బ్లడ్ షుగర్ అదుపు చేస్తే.. గుండె, మూత్రపిండాలు తదితర ప్రధాన అవయవాలు సురక్షితంగా ఉంటాయి’ అని డాక్టర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. మధుమేహం గురించి ఇక అంతగా ఆందోళన చెందకండి. మీరు సకాలంలో స్పందిస్తే దాన్ని పూర్తిగా అదుపులో ఉంచవచ్చు. ఐటఠజీ పూర్తిగా Withdraw చేసి Tablets పై పేషెంట్‌ను Manage  చేయవచ్చని డా॥ప్రసాద్ తెలిపారు.
 - డా॥ప్రసాద్, మెడికల్ డైరెక్టర్
 Diabeties Day 10% Discount on Treatment
 
 Address:
 Reva Health Skin & Hair
 Opp. GVK Entry Gate, Rd.No.4,
 Banjarahills, Hyd-500034
 Mobile No. 8008001225, 8008001235

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement