మధుమేహగ్రస్తులకు డిలైట్ మెడ్లి ప్రో | Delight medli Pro for diabetes patients | Sakshi
Sakshi News home page

మధుమేహగ్రస్తులకు డిలైట్ మెడ్లి ప్రో

Published Sat, Jan 17 2015 10:27 PM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

Delight medli Pro for diabetes patients

చిరు ధాన్యాలతో జావ  
యాంత్రిక జీవనంలో కొట్టుమిట్టాడుతున్న నగర వాసులకు ప్రస్తుత పరిస్థితుల్లో నాణ్యమైన ఆహారం లభించడం లేదు. ఉరుకులు, పరుగుల జీవితం...ఇంటిలో సరైన సమయానికి ఫుడ్ అందుబాటులో లేకపోవడం వంటి పరిస్థితుల్లో నగర వాసులు ఎక్కువగా బయట దొరికే ఆహారంపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా ఆకలి వేసినపుడు ఏది అందుబాటులో ఉంటే దాన్నే తినేస్తున్నారు. ఇందులో జంక్ ఫుడ్‌ను లాగిస్తున్నారు. దీంతో రోగాల బారిన పడుతున్నారు. పని ఒత్తిడికి తోడు విటమిన్లు లోపించిన ఆహారాన్ని తినడం వల్ల చాలా మంది  మధుమేహం బారినపడుతున్నారు. ఈ మధుమేహగ్రస్తులకు అవసరమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో నాచారంలోని శ్రీ కళ్యాణి ట్రేడింగ్ కంపెనీ ద్వారా ‘అమ్మే’ అనే పేరుతో ‘డిలైట్ మెడ్లీ ప్రొ’ అనే ప్రొడక్ట్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ ప్రొడక్ట్ డయాబెటిక్ వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంది. తొమ్మిది రకాల నాణ్యమైన చిరుధాన్యాలతో దీన్ని తయారు చేశారు.
 
 ఇందులో శనగలు, పెసలు, బార్లీ, రాగులు, సజ్జలు, సోయా, మెంతులు, ఉసిరికాయ, అలసంద (ఛిౌఠీఞజ్ఛీ) వంటి ధాన్యాలతో పౌడర్‌గా తయారు చేశారు. ఈ పౌడర్‌ను గ్లాసు నీటిలో రెండు నిమిషాలు మరుగబెట్టి జావలాగా తయారు కాగానే దాన్ని తాగాలి. మధుమేహగ్రస్తులు గంట గంటకు ఏదో ఒకటి తినాలి... ఆ తినే స్థానంలోనే జావను తాగాలి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కెమికల్స్, కలర్స్, ప్రిజర్వేటివ్స్, కొలెస్ట్రాల్ లేని పౌడర్ ఇది. బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అమ్మ చేతి నుంచి తయారైన వంట ఎంత రుచిగా ఉంటుందో.. అంత శ్రేష్టమైనది ఈ పౌడర్. అందుకే దీనికి ‘అమ్మే’ అని పేరు పెట్టామని సంస్థ డెరైక్టర్ జయశ్రీ శ్రీధర్ చెప్పారు. సామాన్య, మధ్యతరగతి వారికి అందుబాటు ధరలో, నాణ్యమైన చిరుధాన్యాలతో తయారు చేయడం జరిగిందని వివరించారు.
 ADDRESS
 Sri Kalyani Trading Company
 Customer Care No
 8008188288 / 04027034609

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement