diabetes victim
-
మధుమేహం పెరుగుదలలో చైనా, భారత్ పోటాపోటీ
సాక్షి, విశాఖపట్నం: మధుమేహం దూకుడు పెంచుతోంది. ఏటా మధుమేహం బాధితుల సంఖ్య పెరుగుతోంది. జనాభా మాదిరిగానే మధుమేహ రోగుల్లోనూ చైనా, భారత్ పోటీ పడుతున్నాయి. చైనా 141 మిలియన్ల మంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండగా.. భారత్ 77 మిలియన్ల మధుమేహులతో ద్వితీయ స్థానంలో నిలిచింది. మన దేశంలో మధుమేహం బాధితుల సంఖ్య 2045 సంవత్సరం నాటికి 135 మిలియన్లకు చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. దీని బారినపడే వారిలో మహిళల (40 శాతం) కంటే పురుషులే (60 శాతం) అధికంగా ఉంటున్నారు. 2020లో దేశంలో 7 లక్షల మంది డయాబెటిస్తో చనిపోయారు. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం దేశంలోకెల్లా కేరళ 19.8 శాతం మధుమేహ బాధితులతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో 13.6 శాతంతో ఛండీగఢ్, తమిళనాడు, 8.9 శాతంతో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. అంటే మన రాష్ట్రంలో ప్రతి వంద మందిలో 9 మందికి మధుమేహం ఉన్నట్టు లెక్క. మధుమేహ బాధితుల సంఖ్య పెరగడానికి వివిధ అంశాలు దోహదం చేస్తున్నాయనే విషయాన్ని ఇదివరకే గుర్తించారు. స్థూలకాయం, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్స్ తినడం, వేళకు ఆహారం తీసుకోకపోవడం, పని ఒత్తిడి, జీవనశైలిలో మార్పులు, వంశ పారంపర్యం వంటివి ప్రధాన కారణాలుగా తేల్చారు. ప్రతి ఇద్దరు మధుమేహుల్లో ఒకరు తనకు ఆ రోగం ఉన్నట్టు గుర్తించలేకపోతున్నట్టు పరిశోధనల్లో తేలింది. ఇది కూడా డయాబెటిస్ రోగుల సంఖ్య పెరగడానికి దోహదపడుతోంది. ఇదీ చదవండి: చైనాలో కోవిడ్ విజృంభణ.. ఫోర్త్ వేవ్ వచ్చినా ప్రాణాంతకం కాదు! -
కృత్రిమ చక్కెరలతోనూ ఊబకాయ, మధుమేహ సమస్యలు!
చక్కెర తెస్తున్న చిక్కుల పుణ్యమా అని ఈరోజుల్లో చాలామంది కృత్రిమ స్వీట్నర్స్ను వాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవి కూడా ఊబకాయం, మధుమేహం వంటి అనేక వ్యాధులకు కారణమవుతున్నట్లు తాజాగా ఓ పరిశోధన స్పష్టం చేసింది. మెడికల్ కాలేజ్ ఆఫ్ విస్కాన్సిన్, మారెక్యూట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సంయుక్తంగా జరిపిన ఈ పరిశోధనల్లో ఈ కృత్రిమ చక్కెరలు శరీరంలో ఎలాంటి మార్పులకు కారణమవుతున్నాయో విస్తృతంగా చర్చించారు. కృత్రిమ చక్కెరలను వాడటం మొదలై చాలాకాలమవుతున్నా.. ఊబకాయపు సమస్య ఏ కొంచెం కూడా తగ్గకపోవడం ఇక్కడ గమనార్హం. సాధారణ చక్కెరతోపాటు ఆస్పారటేమ్, అసిసూల్ఫేమ్ పొటాసియం వంటి కృత్రిమ చక్కెరలను ఎలుకలకు అందించినప్పుడు వాటి శరీరాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త బ్రియన్ హాఫ్మాన్ తెలిపారు. మూడు వారాల తరువాత జరిపిన పరిశీలనల్లో కీలకమైన రసాయనాలు, కొవ్వులు, అమినోయాసిడ్లలో తేడాలు నమోదయ్యాయి అని చెప్పారు. వీటన్నింటిని బట్టి ఈ కృత్రిమ చక్కెరలు మన శరీరం కొవ్వులను జీర్ణం చేసుకునే పద్ధతుల్లో మార్పులకు కారణమవుతున్నాయని.. కొన్ని కృత్రిమ చక్కెరలు రక్తంలో పేరుకుపోయి రక్తనాళాల్లోని కణాలపై దుష్ప్రభావం చూపుతాయని హాఫ్మాన్ తెలిపారు. కృత్రిమ చక్కెరలను మోతాదుకు మించి అది కూడా దీర్ఘకాలంపాటు తీసుకుంటే సమస్యలు తప్పవని తొలిసారి తమ పరిశోధన చెబుతోందని హాఫ్మాన్ చెప్పారు. -
రోగుల పాలిట నవ్వుల రేడు ‘రేవా’
ఒక్కసారి షుగర్ వ్యాధి అటాక్ అయిందని తెలియగానే ఇక అంతా అయిపోయిందని నిర్వేదంలోకి వెళ్ళిపోతాం. ఇష్టమైన ఆహారం, అలవాట్లన్నింటినీ వదులుకోవాలని అత్యధిక మంది పేషెంట్లు నిరాశ చెందుతున్నారు. షుగర్ వలన కలిగే శారీరక బాధ కంటే ఇలాంటి మనోవ్యథ ఎక్కువగా ఉంటోందని అనేక మంది రోగులు వాపోతుంటారు. ఇంతటి మనోవ్యథతో తమ వద్దకు వచ్చే మధుమేహ బాధితులకు ఆత్మస్థైర్యం, నిబ్బరం కలిగించి, రోగిలా కాకుండా వారికి తమను నమ్ముకుని వచ్చిన ఆత్మీయుడిగా భావించి చికిత్సనందిస్తోంది ‘రేవా హెల్త్, స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్’. మధుమేహ రోగి ఇష్టాలు, ఆహారపు అలవాట్లను పూర్తిగా వదులుకోవాల్సిన అవసరం లేకుండా బ్యాలెన్స్డ్ డైట్ సూచనలతో మన్ననలు పొందుతోంది. ప్రతి వ్యక్తికి తనలో ఉన్న పోషక లోపాలను సవరిస్తూ చక్కెర తక్కువగా ఉండేటట్లుగా డైట్ ప్లాన్ ఇస్తారు. అలాగే వ్యాయామం, మందులు కూడా చాలా లోతుగా చేసిన పరీక్షల ఆధారంగానే ఇస్తారు. అధిక బరువు గల కారణాలు ఏమిటి? ఒక వయస్సులో తిన్నా రాని బరువు వయస్సుతో ఎందుకు పెరుగుతుంది? హైపో థైరాయిడ్‌లో బరువు ఎందుకు పెరుగుతుంది? జాయింట్ Pain కు గల కారణాలు ఏమిటి? Root Cause తెలుసుకొని నివారణోపాయాలు తెలపటం రేవా ప్రత్యేకత. అడ్రస్ రేవా హెల్త్, స్కిన్ అండ్ హెయిర్ జీవీకే వన్ ఎంట్రీ గేట్ ఎదురుగా, రోడ్ నం. 4, బంజారాహిల్స్ హైదరాబాద్ వివరాలకు 800 800 1225 800 800 1235 040 4454 4330 మెయిల్ ఐడీ: ksrgopal@revami.com వెబ్సైట్: www.revami.in/ -
డయాకేర్ ఆన్లైన్
మధుమేహం నగర వాసుల్లో చాలామందిని పట్టి పీడిస్తోంది. యాంత్రిక జీవనం, సకాలంలో భోజనం చేయకపోవడం, ఒత్తిడి కారణంగా వయసుతో నిమిత్తం లేకుండానే పలువురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మధుమేహం బారిన పడేవారు వైద్యుల సలహా, సూచనలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకు ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరం. వారికి కావాల్సిన ఆహారం సరైన పోషకాలతో లభించడం ఒకింత కష్టమే. దీనిని గమనించిన ‘డయాబెటిస్ ఇండియా స్టోర్.కామ్’ మధుమేహ బాధితులకు అవసరమైన అన్ని రకాల వస్తువులను ఒకేచోట అందుబాటులోకి తెస్తోంది. మందులు మినహా ఫుడ్ నుంచి ఫుట్‌కేర్ వరకు మధుమేహ బాధితులకు అవసరమైన అన్ని వస్తువులను ఈ ఆన్లైన్ స్టోర్ ద్వారా అందిస్తున్నారు. కావాల్సిన వస్తువులను ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చాలు, నేరుగా వాటిని ఇంటికి పంపిస్తారు. లభించే వస్తువులు... ఫ్రెండ్లీ ఫుడ్ ఇందులో బ్రేక్‌ఫాస్ట్ రెడీ మిక్స్, డయా రైస్, మిల్లెట్ మిక్స్, సుగర్ ఫ్రీ బిస్కట్స్, సుగర్ ఫ్రీ చాక్లెట్స్, జామ్స్, స్వీట్లు. ఫ్రెండ్లీ బెవరేజెస్ ఇన్స్టంట్ గ్రీన్ టీ, డయా జీత్రీ హెర్బల్ టీ, లెమన్ జిం జర్ స్క్వాష్, ఇన్స్టంట్ నేచురల్ సూప్స్. సప్లిమెంట్స్, నేచురల్ పౌడర్స్... బ్లాక్ జామూన్ (నేరేడు) పౌడర్, కరేలా(కాకర) పౌడర్, ఆమ్లా (ఉసిరి) పౌడర్, మేథి (మెంతి) పౌడర్, నేచురల్ స్వీటెనర్స్ ఫుట్ కేర్... డయాబెటిక్ సిల్వర్ సాక్స్, హెల్త్ సాక్స్, డయాబెటిక్ ఫుట్‌వేర్‌తో పాటు గ్లూకోమీటర్స్, ఆలివ్ ఆయిల్, వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్స్ సహా మొత్తం 200ల వస్తువులు దొరుకుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు అవగాహన కల్పించే పుస్తకాలను ఆన్లైన్లో విక్రయించడంతో పాటు ఉచితంగా కౌన్సెలింగ్ ఇస్తారు. మధుమేహ బాధితులందరికీ అందుబాటు ధరలకే ఈ వస్తువులను విక్రయిస్తున్నామని ‘డయాబెటిస్ ఇండియా స్టోర్స్ డాట్ కామ్’ డెరైక్టర్ రవిచంద్ర చాడ తెలిపారు. ఆన్లైన్లో రూ.499కు పైబడి విలువ గల వస్తువులను కొనుగోలు చేసే వారికి ఉచితంగా డోర్ డెలివరీ చేస్తున్నామని, ఎలాంటి దుష్ర్పభావాలు లేని బ్రాండెడ్ కంపెనీల వస్తువులనే తాము విక్రయిస్తున్నామని వివరించారు. ఆర్డర్ ఇవ్వాలనుకుంటే.. www.diabetesindiastore.com వెబ్సైట్ ద్వారా కావాల్సిన వస్తువులను బుక్ చేసుకోవచ్చు. లేదా కాల్‌సెంటర్: 9246819393లో సంప్రదించవచ్చు. -
చర్మ కణాలతో ఇన్సులిన్!
వాషింగ్టన్: మధుమేహం నివారణ దిశగా అమెరికా శాస్త్రవేత్తలు ఓ కీలక ముందడుగు వేశారు. ఎలుకల్లో చర్మ కణాలను క్లోమ కణాలుగా మార్చి వాటి ద్వారా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయగలిగారు. దీంతో భవిష్యత్తులో టైప్1 మధుమేహ వ్యాధికి సమర్థమైన, శాశ్వత చికిత్సకు మార్గం సుగమం అయిందని భావిస్తున్నారు. సాధారణంగా క్లోమంలో ఉండే బీటా కణాలు ఇన్సులిన్ హార్మోన్‌ను స్రవిస్తుంటాయి. ఈ బీటా కణాలు నాశనం అయినప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. అయితే ఇన్సులిన్ లేకపోతే శరీర కణాలు గ్లూకోజ్ చక్కెరలను స్వీకరించలేవు కాబట్టి.. టైప్1 మధుమేహ సమస్య ఉత్పన్నం అవుతుంది. ప్రస్తుతం ఈ వ్యాధిగ్రస్తులు రోజూ క్రమం తప్పకుండా ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో క్లోమంలో బీటా కణాలను పునరుద్ధరించే దిశగా పరిశోధన మొదలుపెట్టిన గ్లాడ్‌స్టోన్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు మొదటి దశలో విజయం సాధించారు. ఎలుకల చర్మంలోని ఫైబ్రోబ్లాస్ట్ కణాలను సేకరించి వాటిని వివిధ కణాల మిశ్రమం సాయంతో ఎండోడర్మ్ కణాల మాదిరిగా మార్చారు. తొలిదశ పిండం లోపలి పొరలో ఉండే ఎండోడర్మ్ కణాలే తర్వాత శరీరంలో క్లోమంతోసహా వివిధ అవయవాలను ఏర్పరుస్తాయి. -
‘ఫుల్ మీల్’తో మధుమేహానికి చెక్!
లండన్: మధుమేహ బాధితులు రోజులో కొంచెం కొంచెంగా ఆహారం తీసుకోవడం కంటే.. ఒక్కసారే ఫుల్ మీల్ తింటే మేలని తమ పరిశోధనలో తేలినట్లు స్వీడన్‌లోని లింకోపింగ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. వీరు టైప్ 2 మధుమేహ రోగులకు మూడు పద్ధతుల్లో ఆహారం అందించి రోగుల్లో బ్లడ్ గ్లూకోజ్, బ్లడ్ లిపిడ్స్, వివిధ హార్మోన్ల స్థాయిని పరిశీలించారు. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారం, పిండి పదార్థాలు తక్కువగా ఉండే ఆహారం, మెడిటెర్రానియన్ డైట్, మొదలైన పద్ధతులను అనుసరించి కొంతమంది రోగులపై అధ్యయనం జరిపారు. ప్రతిరోజూ ఆరు సార్లు రక్త నమూనాలు సేకరించారు. మెడిటెర్రానియన్ డైట్లో భాగంగా రోజూ ఉదయం అల్పాహారానికి బదులుగా ఒక కప్పు బ్లాక్ కాఫీని ఇచ్చారు. కొద్దికొద్దిగా ఆహారానికి బదులుగా ఒకేసారి ఫుల్ మీల్ అందించారు. ఎక్కువ కేలరీలున్న ఫ్రెంచ్ రెడ్ వైన్ నూ ఇచ్చారు. మిగతా రెండు పద్ధతులతో పోలిస్తే మెడిటెర్రానియన్ డైట్లో మెరుగైన ఫలితాలు కనిపించాయని వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. అయితే మధుమేహ రోగులు రోజులో ఎక్కువసార్లు తక్కువ తక్కువగా ఆహారం తీసుకోవడం మేలని ఇంతకుముందు పరిశోధనల్లో తేలగా.. ఒకేసారి ఎక్కువగా తీసుకోవడం మేలని ఈ పరిశోధనలో తేలింది. ఇంతకూ ఏ పద్ధతి సరైనదన్న విషయం నిర్ధారణ కావాలంటే మరిన్ని పరిశోధనలు జరగాల్సిందే!