లండన్: మధుమేహ బాధితులు రోజులో కొంచెం కొంచెంగా ఆహారం తీసుకోవడం కంటే.. ఒక్కసారే ఫుల్ మీల్ తింటే మేలని తమ పరిశోధనలో తేలినట్లు స్వీడన్‌లోని లింకోపింగ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. వీరు టైప్ 2 మధుమేహ రోగులకు మూడు పద్ధతుల్లో ఆహారం అందించి రోగుల్లో బ్లడ్ గ్లూకోజ్, బ్లడ్ లిపిడ్స్, వివిధ హార్మోన్ల స్థాయిని పరిశీలించారు.
కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారం, పిండి పదార్థాలు తక్కువగా ఉండే ఆహారం, మెడిటెర్రానియన్ డైట్, మొదలైన పద్ధతులను అనుసరించి కొంతమంది రోగులపై అధ్యయనం జరిపారు. ప్రతిరోజూ ఆరు సార్లు రక్త నమూనాలు సేకరించారు. మెడిటెర్రానియన్ డైట్‌లో భాగంగా రోజూ ఉదయం అల్పాహారానికి బదులుగా ఒక కప్పు బ్లాక్ కాఫీని ఇచ్చారు.
కొద్దికొద్దిగా ఆహారానికి బదులుగా ఒకేసారి ఫుల్ మీల్ అందించారు. ఎక్కువ కేలరీలున్న ఫ్రెంచ్ రెడ్ వైన్ నూ ఇచ్చారు. మిగతా రెండు పద్ధతులతో పోలిస్తే మెడిటెర్రానియన్ డైట్‌లో మెరుగైన ఫలితాలు కనిపించాయని వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. అయితే మధుమేహ రోగులు రోజులో ఎక్కువసార్లు తక్కువ తక్కువగా ఆహారం తీసుకోవడం మేలని ఇంతకుముందు పరిశోధనల్లో తేలగా.. ఒకేసారి ఎక్కువగా తీసుకోవడం మేలని ఈ పరిశోధనలో తేలింది. ఇంతకూ ఏ పద్ధతి సరైనదన్న విషయం నిర్ధారణ కావాలంటే మరిన్ని పరిశోధనలు జరగాల్సిందే!
‘ఫుల్ మీల్’తో మధుమేహానికి చెక్!
Published Sat, Nov 30 2013 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
Advertisement
Advertisement