తైక్వాండో మహిళా ప్లేయర్ ఫెర్నాండా అగురె
టోక్యో: ఒలింపిక్స్ సందర్భంగా గతంలో అథ్లెట్లు డోపింగ్‌లో పాజిటివ్‌గా వచ్చేవారు. ఇప్పుడైతే కోవిడ్ పాజిటివ్ రిపోర్టులు టోక్యో స్పోర్ట్స్ విలేజ్‌లో కలకలం రేపుతున్నాయి. బుధవారం మరో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. ఈ ముగ్గురు వేర్వేరు దేశాలకు చెందినవారని ఇక్కడి వర్గాలు తెలిపాయి. చిలీ తైక్వాండో మహిళా ప్లేయర్ ఫెర్నాండా అగురె, నెదర్లాండ్స్ స్కేటింగ్ క్రీడాకారిణి క్యాండీ జాకబ్స్, చెక్ రిపబ్లిక్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు పావెల్ సిరుసెక్‌లకు కోవిడ్ సోకడంతో పోటీలకు దూరమయ్యారు. వీళ్లందరిన్ని 14 రోజుల క్వారంటైన్‌కు తరలించారు. దీంతో క్రీడాగ్రామంలోనే కోవిడ్ సోకిన వారి సంఖ్య 8కి చేరింది. స్పోర్ట్స్ విలేజ్ వెలుపల క్రీడలకు సంబంధించిన మరో 75 మంది కూడా మహమ్మారి బారిన పడ్డారు.
టాప్ ర్యాంక్ షూటర్‌కు: బ్రిటన్ అగ్రశ్రేణి మహిళా షూటర్ అంబర్ హిల్ కోవిడ్‌తో ఒలింపిక్స్‌కు దూరమైంది. టోక్యోకు పయనమవ్వాల్సిన ఆమె ఇప్పుడు ఇంట్లోనే ఐసోలేషన్‌లో గడుపుతోంది. మహిళల ప్రపంచ నంబర్‌వన్ స్కీట్ షూటర్ అయిన హిల్ షెడ్యూల్ ప్రకారం ఆది, సోమవారాల్లో తలపడాల్సి ఉంది. ఆమెకు తాజాగా కరోనా సోకడంతో ఇప్పటికిప్పుడు ఆమె స్థానాన్ని మరో షూటర్‌తో భర్తీ చేసే అవకాశం లేదని బ్రిటన్ వర్గాలు తెలిపాయి. అంబర్ హిల్ గత రియో ఒలింపిక్స్ (2016)లో సెమీఫైనల్లో పరాజయం చవిచూసింది.
ఆసీస్ డోపీపై వేటు: డోపింగ్‌లో పట్టుబడిన ఆ్రస్టేలియా ఈక్వె్రస్టియన్ ఆటగాడు జేమీ కెర్మండ్‌ను టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పించారు. 36 ఏళ్ల ఆసీస్ ఆటగాడు నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు గత నెల 26న ‘ఎ’ శాంపిల్‌లోనే తేలింది. నిబంధనల ప్రకారం ‘బి’ శాంపిల్‌ను పరీక్షించగా... మళ్లీ పాజిటివ్ రావడంతో అతనిపై నిషేధం విధించినట్లు ఆసీస్ ఈక్వెస్ట్రియన్ సంఘం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment