రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. క్రాకస్ సిటీ కన్టర్ట్ హాల్‌లో శుక్రవారం ఐసిస్ తీవ్రవాదులు ఒడిగట్టిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇప్పటి వరకు 115 చేరింది. 145 మంది గాయపడ్డారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి 11 మందిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో నలుగురు ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
రషన్స్ శాసనసభ్యుడు అలెగ్జాండర్ ఖిన్‌స్టెయిన్ మాట్లాడుతూ.. దాడి చేసిన వ్యక్తులు పారిపోయారని.. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో కారును వెంబడించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల కారులో పిస్టల్, అసాల్ట్ రైఫిల్‌కు సంబంధించిన మ్యాగజైన్, తజకిస్థాన్‌కు చెందిన పాస్‌పోర్ట్‌లు లభించాయని తెలిపారు.
మరో ఇద్దరు నిందితులు కాలినడకన సమీపంలోని అడవిలోకి పారిపోయారని పేర్కొన్నారు. అనంతరం వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కాగా పశ్చిమ మాస్కోలోని కాన్సర్ట్ హాల్‌లోకి దుండగులు విరుచుకుపడి కాల్పులు జరిపిన జరిపిన సంగతి తెలిసిందే. కాల్పులతో పాటు బాంబులు విసిరి బిభత్సం సృష్టించారు. దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఇప్పటికే ప్రకటించింది.
చదవండి: మాట మార్చిన మాల్దీవులు.. భారత్ ఎప్పుడూ మిత్రుడే అంటూ..
Comments
Please login to add a commentAdd a comment