మాస్కోలో ఉగ్రదాడి.. రష్యాకు అండగా ఉంటాం: ప్రధాని మోదీ | 'India Stands With Russia': PM Modi Condemns Heinous Terror Attack In Moscow | Sakshi
Sakshi News home page

మాస్కోలో ఉగ్రదాడి.. రష్యాకు అండగా ఉంటాం: ప్రధాని మోదీ

Published Sat, Mar 23 2024 10:26 AM | Last Updated on Sat, Mar 23 2024 11:38 AM

India Stands With Russia: PM Modi Condemns Heinous Terror Attack In Moscow - Sakshi

రష్యా రాజధాని మాస్కోలో జరిగిన భారీ ఉగ్రదాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. క్రాకస్‌ సిటీ కన్సర్ట్‌ హాల్‌లో ఐసిస్‌ ఉగ్రసంస్థ పాల్పడిన ఘాతుకాన్ని భారత్‌ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. రష్యాకు, అక్కడి ప్రజలకు భారత్‌ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

‘మాస్కోలో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. మా ఆలోచనలు, ప్రార్ధనలు ఎప్పటికీ వారి కోసం ఉంటాయి. ఈ విషాద సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారత్‌ సంఘీభావంగా నిలుస్తుంది’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. 

కాగా శుక్రవారం సైనిక దుస్తుల్లో కన్సర్ఠ్‌ హాల్‌లోకి చొచ్చుకొని వచ్చిన దుండగులు.. ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. కాల్పులతో పాటు బాంబులు విసిరి బిభత్సం సృష్టించారు. ఏం జరుగుతుందో తెలియక అక్కడున్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.  దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ ఇప్పటికే ప్రకటించింది.  

ఈ భయంకర ఘటనలో ఇప్పటి వరకు 60 మంది మృతి చెందగా.. 150 మందికి పైగా గాయపడ్డారు. ప్రముఖ రష్యన్‌ రాక్‌ బ్యాండ్‌ ‘ఫిక్‌నిక్‌’ సంగీత కార్యక్రమంలో ఈ దాడి చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు  అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. 

చదవండి: మాస్కో దాడులు: ముందే హెచ్చరించిన అమెరికా !

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement