మాస్కో : ప్రధానిగా మూడో సారి బాధ్యతలు చేపట్టిన మోదీ తొలిసారి రష్యాలో పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఇరువురి భేటీలో ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోన్న రష్యా సైన్యానికి సహాయకులు భారత పౌరులు ఉన్నారని, వారిని వెంటనే స్వదేశానికి పంపించాలని కోరారు. మోదీ విజ్ఞప్తితో పుతిన్ భారతీయుల్ని స్వదేశానికి పంపించేందుకు అంగీకరించారు.
దీంతో పాటు వివిధ అంశాలపై చర్చించారు. రష్యా పర్యటన ముగించుకుని ఆస్ట్రియాకు వెళ్లే ముందు మాస్కోలోని డయాస్పోరా వేదికగా భారతీయుల్ని ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ ప్రసంగించారు.
👉నేను ఒంటరిగా ఇక్కడికి రాలేదు. భారత నేల సువాసనతో ఇక్కడికి వచ్చాను. 140 కోట్ల మంది భారతీయుల ప్రేమతో ఇక్కడికి వచ్చాను.
👉భారత్ జీ-20 సదస్సును విజయవంతంగా నిర్వహించింది.
👉డిజిటల్ పేమెంట్లలో సరికొత్త రికార్డ్‌లను సృష్టించాం.
👉దేశం మరుతోందని ప్రపంచం మొత్తం గుర్తిస్తోంది.
👉ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జీని నిర్మించాం.
👉పదేళ్లలో 3౦వేల కిలోమీటర్ల రైల్వే లైన్ల ఎలక్ట్రిఫికేషన్లు చేశాం
👉పదేళ్లలో ఎయిర్ పోర్ట్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తాం.
👉గత పదేళ్లలో జరిగిన అభివృద్ది ట్రైలర్ మాత్రమే
👉దేశాభివృద్దిలో 140 కోట్ల భారతీయుల కృషి ఉంది.
👉సవాలు..సవాళ్లు నా డీఎన్‌ఏలో ఉన్నాయి. గత పదేళ్లలో దేశంలో జరిగిన అభివృద్దిపై ప్రపంచమే ఆశ్చర్యపోయింది.
👉ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ 15 శాతం సహకరిస్తోందన్న మోదీ.. 2014కి ముందు అంధకారంలో ఉంది.
👉ఐసీసీ వరల్డ్ టీ20లో భారత్ విజయాన్ని మీరు ఘనంగా జరుపుకున్నారు. విజయమే అంతిమ లక్ష్యం. భారత యువత చివరి క్షణం వరకు పట్టు వదలదు.
👉ప్రతి భారతీయుడు దేశాన్ని మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. భారతదేశ విజయాల గురించి ఎన్నారైలు గర్వంగా మాట్లాడుతున్నారు.
👉ఈ రోజు భారత్ చంద్రుని భాగంలోకి చంద్రయాన్ పంపింది. మరే ఇతర దేశం ఆ స్థాయికి చేరుకోలేదు.
👉ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను భారత్ కలిగి ఉంది.
👉డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రగామిగా కొనసాగుతోంది.
👉భారత్‌ను మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం.
👉సరిగ్గా నెల రోజుల క్రితం నేను మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాను. నా మూడో టర్మ్‌లో మూడింతల శక్తితో పని చేస్తానని ఆ రోజు ప్రతిజ్ఞ చేశాను' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment