
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో రేపు జరగబోయే లంబాడా ఐక్య వేదిక సభని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులు ఎల్బీ నగర్-దిల్‌సుఖ్ నగర్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సభ జరిగే దారిలో భారీ వాహనాలకు అనుమతి లేదు. తెలంగాణ లంబాడీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ సభ జరుగనుంది.
అలాగే ఎల్బీనగర్ జంక్షన్ నుంచి దిల్‌సుఖ్ నగర్ వెళ్లే వారు ఉప్పల్ ,రామంత పూర్, సంతోష్ నగర్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. మలక్‌పేట్ నుంచి వచ్చే వారు టీవీ టవర్ నుంచి రామంత్ పూర్, ఉప్పల్ మీదుగా లేదా సంతోష్ నగర్ ద్వారా ఎల్బీనగర్ వెళ్లాలన్నారు.
సభకి వచ్చే వాహనాలకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు..
1. వరంగల్, విజయవాడ వైపు నుంచి వచ్చేవారు నాగోల్ మెట్రో స్టేషన్ సమీపంలోని హెచ్ఎండీఏ లే ఔట్‌లో పార్కింగ్ స్థలం ఏర్పాటు
2. ఇబ్రహీంపట్నం నుంచి వచ్చే వారు నాదర్ గుల్‌లోని ఏవియేషన్ అకాడమీ వద్ద ఏర్పాటు.
3. కర్మన్ ఘాట్ నుంచి వచ్చే వాహనాలకు హనుమాన్ గుడి వద్ద ఏర్పాటు
4. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలకు ఉప్పల్ స్టేడియం వద్ద ఏర్పాటు
5. ఎల్బీనగర్ నుంచి వచ్చే వాహనాలకు ఎక్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు