దిల్‌సుఖ్‌నగర్ (హైదరాబాద్) : సకాలంలో జీతాలు అందించాలని కోరుతూ మెట్రో రైలు కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తున్న కార్మికులు ధర్నాకు దిగారు. కార్మికులంతా కలిసి శనివారం నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ మలక్‌పేట పరిధిలోని ఎల్ అండ్ టీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఇస్తున్న జీతాలే తక్కువని, మళ్లీ అందులో సగం కట్ చేసి అవి కూడా సమయానికి ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని కార్మికులు వాపోతున్నారు.