చట్టం అమలుకు ప్రజలు కలిసి రావాలి
వరంగల్‌క్రైం : ప్రజా సంరక్షణ చట్టం అమలులో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ జి.కిషన్ పిలుపునిచ్చారు. ప్రజా సంరక్షణ చట్టం-2013పై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించేందుకు వరంగల్ అర్బన్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్‌లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అర్బన్ పరిధిలోని మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, సినిమా హాల్స్, అపార్ట్‌మెంట్స్ యజమానులతోపాటు అర్బన్ పరిధికి చెందిన పలువురు వ్యాపారస్తులు హాజ రయ్యూరు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని వ్యాపార వర్గాలకు చెందిన వారు అక్టోబర్ 2వ తేదీలోపు తప్పకుండా సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. 2013లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన చట్టం విధివిధానాలకు సంబంధించి వరంగల్ అర్బన్ అదనపు ఎస్పీ యాదయ్య వివరిస్తూ దిల్‌సుఖ్‌నగర్‌లో ఉగ్రవాదులు పాల్పడిన రెండు బాంబు పేలుళ్లలో అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయూరని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్పటి ప్రభుత్వం ప్రజాభద్రత చట్టం- 2013 ప్రవేశపెట్టిందని తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో వివిధ ప్రైవేటు సంస్థలు, వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక, ఆస్పత్రులు, క్రీడాప్రాంగణాలు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లతోపాటు అపార్టుమెంట్లు, సమావేశ స్థలాలు తదితర ప్రదేశాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు, ప్రవేశ మార్గంలో తనిఖీ పరికరాలు(డోర్‌ఫ్రేమ్‌లు) ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ చట్టం అమలును అర్బన్ పరిధిలో మునిసిపల్ విభాగంకు చెందిన సిటీ ప్లానర్, ఆర్‌ఐతోపాటు సబ్ డివిజనల్ స్థాయి పోలీసు అధికారితో కూడిన కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే మెుదటి సారి రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు జరిమా నా విధిస్తారని, మూ డోసారి మాత్రం భవనాన్ని సీజ్ చేయనున్న ట్లు తెలిపారు.
మునిసిపల్ కమిషనర్ సువర్ణ పాండాదాస్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఈ చట్టాన్ని అనుసరించి భవన నిర్మాణ అనుమతులను ఇస్తామన్నారు. అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ ప్రజాసంరక్షణ బాధ్యత ఏ ఒక్కరికో సంబంధించిన అంశం అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ సమష్టి బాధ్యతగా గుర్తించాలని కోరారు. సదస్సులో వరంగల్ అర్బన్ పోలీస్ బాంబ్ డిస్పోజల్ విభాగం సిబ్బంది తమ పరికరాలను ప్రదర్శించారు. భద్రత కోసం చేపట్టే సాధనాలను ఉత్పత్తి చేసే పలు కంపెనీ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. భారీ స్క్రీన్‌పై సీసీ కెమెరాల ద్వారా రికార్డరుున నేరాల పుటేజీలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఓఎస్డీ నాగరాజు, వరంగల్, హన్మకొండ, కాజీపేట, మామునూరు, ఎస్‌బీ, ట్రాఫిక్, క్రైం డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.