జపాన్‌లో పెన్సిల్ చిత్రీకరణ | Pencil crew goes to Japan | Sakshi
Sakshi News home page

జపాన్‌లో పెన్సిల్ చిత్రీకరణ

Published Sun, Oct 26 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM

జపాన్‌లో పెన్సిల్ చిత్రీకరణ

జపాన్‌లో పెన్సిల్ చిత్రీకరణ

 పెన్సిల్ కోసం యువ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్ జపాన్ వెళుతున్నారు. ఆయనతోపాటు యువ నటి శ్రీ దివ్య కూడా బయలుదేరుతోంది. ఈ యువ జంట అక్కడ డ్యూయెట్స్ పాడేసుకుని చెన్నైకి తిరిగి రానున్నారు. అసలు విషయానికొస్తే అతి పిన్న వయసులోనే సంగీత దర్శకుడైన వాడిగా పేరు తెచ్చుకున్న జి.వి.ప్రకాష్‌కుమార్ హీరోగా అవతారమెత్తి నటిస్తున్న తొలి చిత్రం పెన్సిల్. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే మరో రెండు చిత్రాల్లో హీరో అయిపోయిన జి.వి. తన తొలి చిత్రం పెన్సిల్ కోసం హీరోయిన్ శ్రీ దివ్యతో కలిసి యువళ గీతం పాడుకోవడానికి జపాన్ వెళ్లనున్నారు. వీటిలో ఒక రొమాన్స్ గీతం కూడా ఉందట.
 
 దీని గురించి జి.వి.ప్రకాష్‌కుమార్ తెలుపుతూ ఆదివారం రాత్రి బయలుదేరి టోక్యో చేరనున్నట్లు చెప్పారు. అక్కడి సుందర నగర అందాలను పెన్సిల్ చిత్రంలోని పాటల కోసం చిత్రీకరించనున్నట్లు తెలిపారు. చిత్ర షూటింగ్ ఇప్పటికే 80శాతం పూర్తి అయినట్లు వెల్లడించారు. పాటల చిత్రీకరణ పూర్తి అయితే ఇక చిన్న చిన్న ప్యాచ్ వర్కు మాత్రమే మిగిలి ఉంటుందన్నారు. దర్శకుడు మణి నాగరాజ్ చిత్రాన్ని చాలా లావిష్‌గా తెరకెక్కిస్తున్నారని చిత్ర విజయంపై చాలా నమ్మకం ఉందన్నారు. పెన్సిల్ చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. మరో పక్క జి.వి. సంగీత దర్శకుడిగా 50వ చిత్రానికి రెడీ అవుతున్నారు. రాజారాణి చిత్రం ఫేమ్ అట్లీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు చెప్పకపోయినా ఈ చిత్రంలో ఇళయదళపతి నటించనున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement