పళ్ల మధ్య పెన్సిల్‌తో తలనొప్పి మాయం!
పరిపరి శోధన
టెన్షన్ పెరిగితే చాలామందికి తలనొప్పి మొదలవుతుంది. తలనొప్పి తగ్గడానికి మందులు, మాత్రలు ఎడాపెడా వాడేస్తుంటారు. అయితే, ఒత్తిడి పెరగడం వల్ల వచ్చే తలనొప్పికి పెద్దగా మందులు వాడాల్సిన పనిలేదని, చిన్న చిట్కా పాటిస్తే చాలని బ్రిటన్‌కు చెందిన అనెస్థీషియా నిపుణురాలు డాక్టర్ జేన్ లియోనార్డ్ చెబుతున్నారు.
ఆమె చెబుతున్న చిట్కా చాలా సింపుల్. పళ్ల మధ్య పెన్సిల్‌లాంటి వస్తువేదైనా కరచి పట్టుకుని కాసేపు ఉంటే చాలు, తలనొప్పి మటుమాయమవుతుందని అంటున్నారు. పళ్ల మధ్య పెన్సిల్ వంటి వస్తువేదైనా కరచి పట్టుకున్నప్పుడు దవడ కండరాలు, కణతల వద్ద ఉండే కండరాలు రిలాక్స్ అవుతాయని, నెమ్మదిగా తలనొప్పి కూడా తగ్గుతుందని ఆమె వివరిస్తున్నారు.