అతిథులుగా ఈ ఇద్దరూ? | 'Trisha Illana Nayanthara' go on floors | Sakshi
Sakshi News home page

అతిథులుగా ఈ ఇద్దరూ?

Published Mon, Jan 19 2015 8:36 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

అతిథులుగా ఈ ఇద్దరూ?

అతిథులుగా ఈ ఇద్దరూ?

అందమైన ఊహలకు ప్రతిరూపం సినిమా. ఎవరు అవునన్నా, కాదన్నా గ్లామర్ అందులో ఒక భాగం. కథ, కథనాలకు ప్రాముఖ్యత నిచ్చే స్టార్ దర్శకుడు శంకర్ కూడా భారీ విలువలతో రూపొందించిన ఐ చిత్రంలో కథానాయికి ఎమిజాక్సన్ పాత్రలో గ్లామర్‌ను గుప్పించారు. ఇక అసలు విషయానికొస్తే యువ సంగీత దర్శకుడిగా దూసుకుపోతున్న జి.వి.ప్రకాష్‌కుమార్ ఇప్పుడు కథానాయకుడిగా కూడా కాలు మోపారు. ఇటీవల విడుదలైన డార్లింగ్ పేరుకు తగ్గట్టుగానే ప్రేక్షకుల ప్రేమను పొందుతోంది. త్వరలో త్రిష ఇల్లన్నా నయనతార అంటూ సెట్‌పైకి వెళ్లనున్నారు.
 
 మొదట ఈ టైటిల్‌కు త్రిష, నయనతార అనుమతిస్తారా? అన్న సందేహం వ్యక్తమైంది. అయితే ఆ ఇద్దరు భామలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్రిష ఇల్లన్నా నయనతార చిత్ర చిత్రీకరణకు మార్గం సుగమం అయింది. నవ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో జీవీ కి జంటగా కయల్ చిత్రం ఫేమ్ ఆనంది నటించనుంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా ఒక ప్రముఖ నటి నటించనున్నారట. ముఖ్యపాత్రలో అతిలోకసుందరి శ్రీదేవి, ప్రముఖ దర్శకుడు భారతీరాజా నటించనున్నారు. దీంతోనే త్రిష ఇల్లన్నా నయనతారకు భారీతనం వచ్చేసింది.
 
 మరిన్ని హంగులు చేర్చడానికి ఏకంగా టైటిల్‌లో చేరిన తారలు నయనతార, త్రిషలను అతిథి పాత్రలో నటింప చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు యూనిట్ వర్గాలు అంటున్నారు. ఇప్పటికే ఈ విషయమై వారితో చర్చిస్తున్నట్లు తెలిపారు. ఆ ఇద్దరు బ్యూటీస్ గనుక పచ్చజెండా ఊపేస్తే     తిష ఇల్లన్నా నయనతార చిత్రం రేంజ్ మారిపోతుంది. ఈ చిత్రం ఈ నెలలోనే సెట్‌పైకి వెళ్లనుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement