నయనతార, త్రిష.. 'అమ్మోరు తల్లి'గా వచ్చేదెవరంటే.. | Ammoru Thalli Part 2 Official Announced | Sakshi
Sakshi News home page

నయనతార, త్రిష.. 'అమ్మోరు తల్లి'గా వచ్చేదెవరంటే..

Published Sat, Jul 13 2024 11:38 AM | Last Updated on Sat, Jul 13 2024 11:52 AM

Ammoru Thalli Part 2 Official Announced

'అమ్మోరు తల్లి' సినిమాలో  నయనతార నటించిన విషయం తెలిసిందే. 2020లో వచ్చిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇందులో కూడా మళ్లీ నయనతార నటిస్తున్నట్లు ప్రకటన వెలువడింది.  తమిళంలో 'మూకుత్తి అమ్మన్‌'గా తెరకెక్కిన సినిమాను తెలుగులో 'అమ్మోరు తల్లి' పేరుతో విడుదల చేశారు.  ఈ చిత్రాన్ని ఆర్‌జే బాలాజీ ప్రధాన పాత్రలో నటిస్తూనే స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఫాంటసీ కామెడీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌లో డైరెక్ట్‌గా విడుదల అయిన 'అమ్మోరు తల్లి' సినిమాలో ముక్కుపుడక అమ్మోరుగా నయన్‌ విజృంభించింది. అయితే, సీక్వెల్‌లో నటించేందుకు నయనతార నిరాకరించిందని, ఆ స్థానంలో త్రిష కథానాయికగా నటిస్తుందని అప్పట్లో ఒక వార్త నెట్టింట వైరల్‌ అయింది. నయనతార ఈ చిత్రంలో అద్భుతంగా నటించిందని ఆమెకు ప్రశంసలు కూడా దక్కాయి. అలాంటిది సీక్వెల్‌లో మరొకరిని తీసుకొస్తే ఇబ్బందులు ఎదురుకావచ్చని భావించిన మేకర్స్‌ ఫైనల్‌గా నయన్‌ను ఒప్పించినట్లు తెలుస్తోంది. 

తాజాగా అమ్మోరు తల్లి 2 చిత్రంలో నయనతార నటిస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాణ సంస్థ వేల్స్‌ అధికారికంగా ప్రకటించింది. అందుకు సంబంధించిన ఒక వీడియోను వారు విడుదల చేశారు. భక్తి పేరుతో దొంగ బాబాలు చేస్తున్న మోసాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో పార్ట్‌ 1 తెరకెక్కించారు. మరీ సిక్వెల్‌లో వారు ఎలాంటి కథతతో వస్తారో చూడాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement