సోమవారం నుంచి తమిళనాడులో థియేటర్స్‌ను క్లోజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తమిళ చిత్రాలు ఒక్కొక్కటిగా ఓటీటీ బాట పడుతున్నాయి. విజయ్ సేతుపతి నటించిన ‘తుగ్లక్ దర్బార్’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్రబృందం పేర్కొంది. తాజాగా నయనతార నటించిన ‘నెట్రిక్కన్’, త్రిష చేసిన ‘రాంగీ’ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ దిశగా అడుగులు వేస్తున్నాయని కోలీవుడ్ సమాచారం.
ఇప్పటికే ఈ రెండు చిత్రాల నిర్మాతలతో ఓటీటీ సంస్థలు చర్చలు జరిపాయని, ఓ ఒప్పందానికి వచ్చిన తర్వాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని చెన్నై కోడంబాక్కమ్ అంటోంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ‘రాంగీ’కి శరవనన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కథను అందించడం విశేషం. ఇక నయనతార చేసిన ‘నెట్రిక్కన్’ చిత్రాన్ని మిలింద్ రావ్ డైరెక్ట్ చేశారు. ఇందులో నయనతార అంధురాలి పాత్రలో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment