Nayanthara's Netrikann Movie To Release On Disney+ Hotstar - Sakshi
Sakshi News home page

Nayanthara: ఓటీటీలో నయనతార నెట్రిక్కన్‌!

Published Thu, Jul 22 2021 8:13 AM | Last Updated on Thu, Jul 22 2021 10:38 AM

Nayanthara Netrikann Movie Premieres On Disney Hotstar - Sakshi

Nayanthara Netrikann: నయనతార నటించిన తాజా ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘నెట్రిక్కన్‌’ (మూడో కన్ను) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. డిస్నీ హాట్‌స్టార్‌లో ఈ సినిమా ఎప్పటి నుంచి స్ట్రీమింగ్‌ అవనుందనే విషయాన్ని త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి మిలింద్‌ రావ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రోడ్డు ప్రమాదంలో చూపు కోల్పోయే యువతి పాత్రలో నయనతార కనిపిస్తారు. కొరియన్‌ థ్రిల్లర్‌ ‘బ్లైండ్‌’ చిత్రానికి ‘నెట్రిక్కన్‌’ రీమేక్‌ అనే టాక్‌ వినిపిస్తోంది.

ఈ సంగతి ఇలా ఉంచితే.. బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తారనే టాక్‌ ఎప్పట్నుంచో వినిపిస్తోంది. ఇందులో హీరోయిన్‌గా నయనతార ఫిక్సైపోయారని బాలీవుడ్‌ తాజా టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement