బ్లాక్‌బస్టర్‌ గల్లీ క్రికెట్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ | Lubber Pandhu 2024 Movie OTT Release Date Confirmed, Check Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

Lubber Pandhu OTT Release: బ్లాక్‌బస్టర్‌ గల్లీ క్రికెట్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌

Published Tue, Oct 22 2024 7:39 AM | Last Updated on Tue, Oct 22 2024 9:25 AM

Rubber Pandu Movie Streaming Date Locked

కోలీవుడ్‌లో సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన చిత్రం 'లబ్బర్‌ పందు'. సెప్టెంబర్‌ 20న విడుదలైన ఈ చిత్రం విజయ్‌ గోట్‌ మూవీతో పోటీ పడింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్‌ కానుంది. పెద్దగా ఫేమ్‌ లేని నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. 2024 ఉత్తమ చిత్రాల జాబితాలో 'లబ్బర్‌ పందు' కూడా చేరిపోయింది. రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్‌తో నిండిన గ్రామీణ క్రికెట్ డ్రామాగా ఈ మూవీని దర్శకుడు తెరకెక్కించాడు.

హరీష్ కళ్యాణ్- దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన 'లబ్బర్ పందు' సినిమాను తమిళరాసన్ పంచముత్తు దర్శకత్వం వహించారు. ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా డిస్నీ+ హాట్‍స్టార్‌లో విడుదల కానుంది. అక్టోబర్‌  31 నుంచి స్ట్రీమింగ్‌ కానుందని అధికారికంగా ప్రకటన వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది.

లబ్బర్ పందు చిత్రాన్ని కేవలం రూ. 5 కోట్లతో తెరకెక్కించారు. అయితే, కోలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ సినిమా 18వ రోజు కలెక్షన్స్‌ విషయంలో విజయ్‌ గోట్‌ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ. 4 కోట్లు కలెక్షన్స్‌ వస్తే.. లబ్బర్‌ పందు ఒక్క తమిళనాడులోనే రూ.2.75 కోట్లు రాబట్టింది. గల్లీ క్రికెట్ బ్యాక్‍డ్రాప్‍తో వచ్చిన ఈ చిత్రం బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఇద్దరు గ్రామీణ క్రీడాకారుల మధ్య మొదలైన గొడవకు లవ్ స్టోరీని కలుపుతూ ఈ మూవీని తెరకెక్కించారు. అందుకే ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement