‘తంగలాన్‌’కి అదే పెద్ద సవాలు : జీవీ ప్రకాశ్‌ | Music Director GV Prakash Talks About Thangalaan Movie | Sakshi
Sakshi News home page

అతి తక్కువ సమయం.. ‘తంగలాన్‌’కి అదే పెద్ద సవాలు : జీవీ ప్రకాశ్‌

Published Tue, Aug 13 2024 7:08 PM | Last Updated on Tue, Aug 13 2024 7:19 PM

Music Director GV Prakash Talks About Thangalaan Movie

‘తంగలాన్‌’ కోసం 50 రోజుల రీరికార్డింగ్‌ చేశాను. కొన్నిసార్లు రెండు మూడు రోజుల ముందు ట్యూన్ చేయాల్సి వచ్చేది. టైమ్ తక్కువగా ఉండటం ఒక్కటే ఈ సినిమాకు మ్యూజిక్ చేయడంలో నేను ఎదుర్కొన్న సవాలు. అయినా పర్పెక్ట్ ఔట్ పుట్ తీసుకురాగలిగాం. దర్శకుడు పా.రంజిత్‌ విజన్‌ను అర్థం చేసుకొని అందుకు తగినట్లుగా మ్యూజిక్‌ చేశాను’అని అన్నారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాశ్‌ కుమార్‌. చియాన్‌ విక్రమ్‌ హీరోగా నటిస్తున్న పీరియాడిక్‌ మూవీ ‘తంగలాన్‌’. పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు మ్యూజిక్ అందించిన జీవీ ప్రకాశ్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

‘తంగలాన్’ సినిమా ఆఫర్ నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. "తంగలాన్" ఇండియానా జోన్స్ వంటి భారీ మూవీ. ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడు ఈ కథకు ఎలాంటి మ్యూజిక్ చేయాలి అనేది అర్థమైంది. ట్రైబల్ నేపథ్యంగా ప్రీ ఇండిపెండెన్స్ టైమ్ లో జరిగే స్టోరీ ఇది. ట్రైబల్స్ ఎలాంటి మ్యూజిక్ క్రియేట్ చేస్తారు అనేది ఆలోచించాను. ఆస్ట్రేలియన్, ఆఫ్రికన్ ట్రైబ్స్ క్రియేట్ చేసే కొన్ని మ్యూజిక్స్ అబ్సర్వ్ చేశాను. ఇలాంటి సినిమాకు మోడరన్ మ్యూజిక్ సెట్ కాదు. ఒరిజినల్ గా , ఆ కథా నేపథ్యానికి తగినట్లు మ్యూజిక్ క్రియేట్ చేశాం. "తంగలాన్"కు మ్యూజిక్ ఇవ్వడంలో నా టీమ్ ఎంతో సపోర్ట్ చేసింది.

దర్శకుడు పా.రంజిత్ గారు ఒక గొప్ప మూవీని మీ ముందుకు తీసుకురాబోతున్నారు. ఆయన మ్యాజికల్ రియలిజం స్క్రీన్ ప్లేతో సినిమాను రూపొందించారు. మ్యాజికల్ రియలిజంతో గతంలోనూ కొన్ని పీరియాడిక్ మూవీస్ వచ్చినా..ఇందులో మరికొన్ని అదనపు లేయర్స్ ఉంటాయి. పా రంజిత్ గారితో వర్క్ చేయడం ఫెంటాస్టిక్ ఎక్సీపిరియన్స్ ఇచ్చింది.

విక్రమ్ గారు ఈ సినిమా కోసం మారిపోయిన తీరు ఆశ్చర్యపరిచింది. ఇది నటీనటులకు ఫిజికల్ గా స్ట్రెయిన్ చేసే సినిమా. విక్రమ్ గారు తన గత చిత్రాల్లాగే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. "తంగలాన్"లో ఫీమేల్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. పార్వతీ తిరువోతు, మాళవిక ది బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చారు.

‘తంగలాన్’ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. నేను మీతో పాటే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఎగ్జైటెడ్ గా ఎదురుచూస్తున్నాను. మీరంతా "తంగలాన్" చూసి థ్రిల్ ఫీలవుతారని మాత్రం చెప్పగలను.

ఏఐ సహా ఎన్నో కొత్త టెక్నాలజీలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే టెక్నాలజీపైనే ఆధారపడటం సరికాదు. ఎంతవరకు మనం టెక్నాలజీ ఉపయోగించుకోవాలి అనే ఐడియా ఉండాలి.

తెలుగులో దుల్కర్ హీరోగా నటిస్తున్న లక్కీ భాస్కర్, నితిన్ హీరోగా చేస్తున్న రాబిన్ హుడ్ తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. దిల్ రాజు గారితో, వైజయంతీ బ్యానర్స్ లో మూవీస్ చేయాల్సిఉంది. తమిళంలో ధనుష్ గారి డైరెక్షన్ లో మూవీ, శివకార్తికేయన్ అమరన్ తో పాటు మరికొన్ని బిగ్, ఎగ్జైటింగ్ సినిమాలు చేస్తున్నాను. నటుడుగా, సంగీత దర్శకుడిగా నా ప్రయారిటీస్ క్లియర్ గా పెట్టుకున్నాను. ఏ సినిమాలకు ఎప్పుడు వర్క్ చేయాలనేది ఎవరికీ ఇబ్బంది రాకుండా ప్లాన్ చేసుకుంటున్నా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement