విక్రమ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) కార్మికుల జీవితాల ఆధారంగా పా.రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సినిమా ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది. హీరోహీరోయిన్లతో వరుస ఇంటర్వ్యూలు ఇప్పిస్తూ.. సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. తాజాగా మాళవికా మోహనన్, పార్వతి తిరువోతు ప్రెస్ మీట్ నిర్వహించారు.
(చదవండి: విజయ్ దేవరకొండతో వివాదం.. మరోసారి స్పందించిన అనసూయ)
ఈ సందర్భంగా మాళవిక మాట్లాడుతూ.. ‘తంగలాన్’ నా జీవితంలో మర్చిపోలేని సినిమా. ఈ చిత్రంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను మేకప్ వేసుకోవడానికే దాదాపు నాలుగు గంటల సమయం పట్టేది. ఎక్కువగా ఎండలోనే షూటింగ్ చేశాం. దాని కారణంగా నా శరీరంపై దద్దుర్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. రోజూ సెట్స్‌లో డెర్మటాలజిస్ట్, కళ్ల డాక్టర్.. ఇలా మొత్తం ఐదుగురు డాక్టర్లు ఉండేవారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశిస్తున్నాం’అని అన్నారు.
పార్వతి తిరువోతు మాట్లాడుతూ.. ‘పా.రంజిత్ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. తంగలాన్ లో నాది గంగమ్మ అనే కీలక పాత్ర. ఈ పాత్ర కోసం ఎంతో శ్రమించా. భాషపరంగా కసరత్తు చేశా’ అని తెలిపారు. ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే.. ఏ రంగంలో అడుగుపెట్టేవారని ఓ విలేకరి ప్రశ్నించగా.. టీ షాపు పెట్టేదాన్ని అని సమాధానం ఇచ్చింది పార్వతి. ‘వృత్తి ఏదైనా సరే మరాద్య, గౌరవంతో పని చేయాలనుకున్నాను. నాకు టీ అంటే చాలా ఇష్టం. టీ చక్కగా పెట్టగలను. అందుకే ఒకవేళ నటిని కాకపోయి ఉంటే..కచ్చితంగా ఓ టీ షాపు పెట్టేదాన్ని’అని పార్వతి చెప్పుకొచ్చింది. తనకు విజువల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టమని, ఒకవేళ తాను నటి కాకపోయి ఉంటే ఫొటోగ్రఫీ, లేదా సినిమాటోగ్రఫీ రంగంలోకి వెళ్లేదాన్ని అని పార్వతి బదులిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment